వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరికి ఉపకారం చేస్తూ ఉపకారం చేయడంవల్ల తమకు లాభించినట్లు మంచివారు ప్రవర్తిస్తారట. జానకిరాంలో ఆ చొరవ, మంచితనం ఉండబట్టే వల్లభాయి పటేల్ ఉపన్యాసానికి మైక్రోఫోన్ సరిచేసే పనికి జానకిరామ్‌ను నియోగించారట.
అయ్యగారి వీరభద్రరావు, కొమ్మూరి పద్మావతి వంటి కళాకారుల సహాయంతో పి.వి.రాజమన్నార్ దయ్యాల లంక, ముద్దుకృష్ణ అనార్కలి, విశ్వనాథ ఏకవీర స్వయంగా రచించిన కర్ణ, కుంతి, కచ, దేవయాని, మీరా, నచికేతు, ప్రేమపరీక్ష మొదలైన నాటకాలను అసంఖ్యాకంగా ప్రసారం చేశారట. నటులను ఎన్నుకోవటం, సంగీతాన్ని సమకూర్చుకోవటం, 15, 16 రిహార్సల్స్ అనంతరం ప్రసారం. స్టూడియో బయట రెడ్‌లైట్ ఆరటం. మళ్లీ కార్యక్రమానికి ఆయత్తం కావడంలో జానకిరాం లీనమై కృషిచేశారు. అపూర్వ స్థానాన్ని సంపాదించారు. ఈ దీక్ష రేడియోకి బాణీని దిద్దింది. స్టేజీకి రేడియోకి- కాకికి కోయిలకు, నల్లకుక్కకు తెల్లకుక్కకు ఉన్నంత అంతరం ఉంటుందని జానకిరాం విశే్లషణ.
ఆత్మకథ ప్రతిఘటన కవితాత్మకంగా భర్తృహరి, భవభూతి, కంకంటి పాపరాజు మొదలైన ప్రాచీనకవుల కవితలతోపాటు ఆధునిక కవుల మనోహర గీత పంక్తులతో ఆరంభమవుతుంది. ఇది కథా సర్వస్వం- కవితా సర్వస్వం అనిపిస్తుంది. ఆగ్రాలో తాజ్‌మహల్‌ను దిల్సారాలో చిత్రాలను చూసి ఆనందం తట్టుకోలేక ఈ జీవితం ముగిసిపోయి, ఈ జ్ఞాపకం పదిలంగా నిలిచిపోతే బాగుండుననుకునే సౌందర్యారాధకుడు. తపస్సు చేసిన పెన్నిధి లభించకపోతే ఆత్మహత్య ఆలోచనలో పరుగెడుతున్న రైలులో దట్టమైన చీకట్లోకి చూస్తాడు. సంస్కారం ఆ ప్రయత్నం నుంచి విరమించేలా చేస్తుంది.
మద్రాస్ వేపేరీలో మలబార్‌హౌస్, త్రివేణి శతజయంతి సంచిక ప్రారంభ్సోవం, విశ్వనాథ కాళ్లు కడుక్కువచ్చి మల్లంపల్లి సోమశేఖర శర్మను కుర్చీలో కూర్చోమని ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటూ ఆంధ్ర ప్రశస్తిని శర్మగారికి అంతకిమిచ్చి ఆశువుగా మాటలన్నారు.
నీ వనుకోను లేదు; మరినేనిది
చెప్పను లేను కనా, అన్నా/ వినవయ్య నేటి నా చిరుపొత్తము/ నీకు నంకితం
బైవెలయింప జేతు హృదయంబులు
నీకును నాకును మాతృదే
శా విలదుఃఖ దారితములై శ్రుతి
గల్పె విషాద గీతికల్
బుచ్చిబాబు మాటల్లో సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చేయగల సాధకులకు ఆప్తుడు కళాశీలి జానకిరాం. కళానిధులు, మంత్రివర్యులు, నాట్యాచార్యులు నటీమణులు, చిత్రకళా నిపుణులు, ప్రఖ్యాత విమర్శకులు- ఎందరి ప్రతిభనో వెల్లడిచేసే సుకృతం జానకిరామ్‌ది. ఆనందం పంచి పెట్టడమే తన జీవిత లక్ష్యంగా పేర్కొనడం కాదు; చేశారు. బాధ కలిగితే శతపత్రి నిక్షిప్త జలబిందువుగా ఊహించుకోవడం సాధన చేశారు. మానవుని సంపూర్ణ లక్ష్యం.
పంచపంచ ఉషఃకాలంలో మేల్కొని శృంగార మేజా దగ్గర సరిచూసుకున్న జానకిరాం రామవరప్పాడు స్టేషన్ మాస్టారిని కొట్టారంటే నమ్మలేం. కొట్టారు.
శ్రీశ్రీలో అపరిమితమైన విప్లవ శక్తులతోపాటు సత్యానే్వషణ, ఉద్యోగం గుర్తించడం ఒక గొప్ప అనుభవంగా చెప్తారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

కొమ్మన రాధాకృష్ణారావు