వినమరుగైన

శారద లేఖలు( కనుపర్తి వరలక్ష్మమ్మ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరలక్ష్మమ్మగారు మహాత్ముడు హరిజనోద్ధరణ అని అల్లాడకపోతే కన్యా జనోద్ధరణకు కంకణం కట్టుకొనరాదా అని ప్రశ్నిస్తారు. ఆడవారి అగచాట్లు చూసి వివాహేతర సంబంధాలు, వరకట్న బాధలు విని వధూవరుల బంధానికి కట్నమే ప్రధానమనిచెప్తూ ‘మంచి అన్నములోని మంచి కూర దొరకదగు’ సామెతను గుర్తుచేస్తారు.స్ర్తి సర్వసౌఖ్యములు పురుషుని ఇచ్ఛ్ధానమైయున్నవి కాని స్ర్తి యిచ్ఛ్ధానమై లేవు. ఆర్థిక స్వాతంత్య్రం అవసరమని ప్రచారం చేశారు. కలశోదకంతోకాదు, కన్నీళ్ళతో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారంటూ వ్యధ చెందుతారు.
ఆయుధ నిర్మాణమున్నంతకాలము సంగ్రామ భయమెటుల తప్పదో కులసభలున్నాళ్లు వర్ణ విభేద విద్వేషము తప్పదనే భావము చాలా లేఖల్లో కనబడుతుంది. దీన్ని ఆమె గాఢంగా విశ్వసించారు.
దేశ విభజనవల్ల భారతదేశ స్వరూపము విరూపమగునని వ్రాస్తూ విభజన వలదని, సమన్వయ సాధనే సర్వోత్తమమని భావిస్తారు. మనం హిందువులం, క్రైస్తవులం, మహమ్మదీయులం గాము, భారతీయులమనే భావన పాదుకొల్పారు.
జూన్ 47 నాటి రాజకీయాల్లో ఆంధ్ర శాసనసభ్యుల తీరు నాన్న పల్లకీనెక్కేనన్న సంబరమే కాని తమకు సవతి తల్లివచ్చెనన్న విషయము గ్రహించనివారివలె నున్నారట.
తాపసుల కాశ్రయమైన నైమిశారణ్యం, రాక్షసావాసమైన దండకారణ్యం, పాండవులు నివసించిన ద్వైతవనము- వీటిని గురించి జ్ఞాపకం చేస్తూ- ..

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

కొమ్మన రాధాకృష్ణారావు