వినమరుగైన

శారద లేఖలు( కనుపర్తి వరలక్ష్మమ్మ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్షీగారి ఆలోచన మేర వనసీమలు వృద్ధిచెందాలని లేఖాముఖంగా చాటారు.అవయములు స్వాధీనమైన వారికి ఇంద్రియములు స్వాధీనమగును. ఇంద్రియములు స్వాధీనమైనవారికి మనస్సు స్వాధీనమగునని - ఏలూరులో కమ్ముల అప్పన్నగారి యోగ వ్యాయామ చికిత్సాలయ వార్షికోత్సవమును గురించి వ్రాసే జాబులో వ్రాశారు.
12 సంవత్సరాల అనంతరం 1963 మే జూలైలలో వ్రాసిన జాబుల్లోపొదుపుకు నాగరికతా వ్యామోహానికి పొత్తు కుదరదని, నోట్సుల యుగము, గైడుల యుగం వచ్చిందని, చరిత్ర భూగోళములేకమై సాంఘిక శాస్త్రంగా అవతరించిందని, అవిధేయులైన విద్యార్థులు- విద్యార్థులను పీడించే ఉపాధ్యాయులను గురించి రాశారు.్భగవదంశ సంభూతులచాటున జరిగే అత్యాచారాలను ఏకరువు పెట్టారు. దైవచింతన, ఆత్మసాధన మరచిన వ్యామోహాలను, వేలంవెఱ్ఱిని ఖండించారు.
మానినది మందు, మనినది ఊరు అంటూ హైపెనికం మందు ద్వారా ఎముక చికిత్స. ఏఖినేషియా మందు ద్వారా కుక్కకాటుకు- హోమియో మందులిచ్చి వైద్యం చేశారట.అల్లోపతి వైద్యం మిగతా వైద్య విధానాల్లో గొప్పతనాన్ని మరుగుపరచేలా చేస్తుందని సోదాహరణంగా ఏప్రిల్ 64 జాబులో రాశారు.
మైకులవల్ల రాత్రులు నిద్ర సుఖము లేదు. పగలు శ్రవణ సుఖము లేదు అని విచక్షణారహితంగా లౌడ్ స్పీకర్లను వాడడం గర్జిస్తారు. మెట్రిక్ సిస్టం గందరగోళం కూడా ఆమెకు లేఖాంశమే. చీనావారి కారణంగా నెహ్రూ పండితుని ఆరోగ్యం క్షీణించిందని అగ్నికి చెదపట్టిందని మనస్తాపం చెందారు.
ప్రముఖ విద్యావేత్త, మేధావి, ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతి అయిన కట్టమంచి రామలింగారెడ్డిగారు, శ్రీమతి వరలక్ష్మమ్మగారి జీవితము, సాహిత్యము సంస్కారవంతమైన ఒక తరాన్ని తయారుచేసి, తెలుగువారు మరిపోలేని మహోపకారం చేశాయి. ఆమె రచనల్లో కటుత్వం లేని పటుత్వం కనిపిస్తుంది. ఆమె మూర్తిలో గర్వం లేని గాంభీర్యం స్ఫురిస్తుంది. ఆమె జీవితంలో ఆడంబరంలేని ఆదర్శం ద్యోతకవౌతుంది. గత అర్థశతాబ్ది తాలూకు గాంభీర్యము, ఈ అర్థశతాబ్దపు తీవ్రతా రెండూ సమానంగా సమ్యక్ సమ్మేళనం చెందిన సజీవ సాహితీమూర్తి. ఆంధ్ర జీవన సాహితీ స్రవంతుల భూత భవిష్యత్ తీరాల్ని కలిపే వర్తమాన వచన కావ్యసారధి ఆమె అంటూ ప్రస్తుతించారు.
4వ తరగతివరకే చదివి స్వయంకృషితో విద్యావికాసాన్ని సాధించి ప్రసరించిన ఆంధ్ర శారద 82వ ఏట ఆగస్టు 78లో అక్షరంగా నిలిచిపోయారు.
*
అయిపోయింది
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కొమ్మన రాధాకృష్ణారావు