వినమరుగైన

మగువ మాంచాల -ఏటుకూరి వేంకట నరసయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె-
‘‘ఎక్కడ నేర్చుకొంటి హృదయేశ్వర నన్నిటు మభ్యపెట్టగా
చక్కని పోడుముల్ సగము చచ్చిన భార్యకు పోతపాలతో
మక్కువ తీరునా? పరువుమాలిన భర్తకు ఆలిపోడుముల్
అక్కరపట్టునా? పురుషులన్ని విధమ్ముల కార్యసాధకుల్
ప్రాణమువంటి భర్త పెరపంచలు త్రొక్కిన భార్య చూచుచున్
ప్రాణముతోడ నిల్చి నిరపాయ పరిస్థితి నుల్ల సిల్లునా?
పొరపడ కాత్మగాధ తలపోయుడు మీవలె నుప్పుపుల్సుతో
పెరిగన దేహమే కదా!’’
కవి ఈటెలపోటులు మాటలుగా వాడాడో, లేక మాటలే ఈటెలపోటులుగా మారాయో అర్థంకాదు. మీ శరీరం వలె నా శరీరం కూడా ఉప్పు పులుసుతో పెరిగిందే కదా! కోరికలు నాకూ ఉంటాయి. నేను కూడా నీవలె చెడు తిరుగుడు కలవాటుపడితే మీ పరువు ప్రతిష్ఠలు కీర్తి సంపదలేమయ్యేవి? ఒక్కసారి ఆలోచించు అని ధ్వనింపజేస్తూ వడిలిపోయిన పండ్లిచ్చింది. వానిని పట్టి చూచి బాలుడు వాని నావలకు నెట్టివేశాడు. నవ్వింది మాంచాల.
‘‘సానిసంతలోన జవ్వనమ్ముడివోవు
పురుషులకు రసవిచారమేల?’’
అన్నది. బాలునికి దిమ్మ తిరిగింది. నాచన సోమన ఉత్తర హరివంశంలో ఊర్వశి నరకునితో-
‘‘సంతనెన్నడో జవ్వన మమ్ముకొన్న గడసాని ననుం గవయం దలంచితే?’’ అంటుంది. దానిని కవి ఇక్కడ ఎంతో ఔచిత్యవంతంగా వాడుకొన్నాడు. శ్రీనాథుని బాలచంద్రుని యుద్ధపు పోకళ్లు కూడా ఇందు గోచరిస్తాయి. బాలచంద్రుడు నరసింగరాయల తల ఖండిస్తాడు. బ్రహ్మనాయుడు బాలుని నిందిస్తాడు. బాలుని తండ్రిని తిరస్కరించి రణరంగంలో ఎందరినో హరించి మరణిస్తాడు. అతని మిత్రులందరు హతులవుతారు. మాంచాల పురుషవేషంతో సమర రంగానికి వచ్చి రణమొనర్చి వీరమరణం పొందుతుంది. కావ్యం విషాదాంతంగా ముగుస్తుంది.
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-మొవ్వ వృషాద్రిపతి