వినమరుగైన

లోవెలుగులు ( ముట్నూరి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీ తలపాగకుచ్చు ఠవణించిన
ఠీవియె ఠీవి, యే మహీ
నేతకు చేతగాదు గద
నీ నడకంగల రాజసమ్ము; కృ
ష్టా తరళాంబు సంభవ
నినాదము పొందుదు గాదె. తద్వచ
స్పీత తరంగనాద వివశీకృత
సర్వజనానుమోదమున్’’
అని ముట్నూరి కృష్ణరాయని దివ్యమూర్తికి నిలువెత్తు నీరాజనిచ్చారు కాటూరి కవి. 1943లో ఆ మహనీయుణ్ణి ప్రతిదినం సందర్శిస్తూండేవాణ్ణి నేను బందరులో. ఎవరో ఏ జమీందారో అనుకొనేవాణ్ని. సందేహం కల్గి ఆరా తీస్తే- ఆయన కృష్ణాపత్రిక సంపాదకులు- ముట్నూరి కృష్ణారావు మహోదయులని చెప్పారు. జన్మచరితార్థంగా సంభావించారు. కుచ్చు జారవిడిచిన కోరపాగాతో, మోకాళ్ళదాకా జీరాడే ఖద్దరు లాల్చీతో, కాళ్లకు బందరు నాటు చెప్పుల జోడు వేసుకొని, చేత సింహతలాటపు పొన్నుగర్ర పట్టుకొని దివ్యతేజస్సు విరజిమ్మే ముఖారవిందంతో ఆ నిరంతర వౌనముద్రాలంకారుడు బందరు పురవీధుల్లో రాజఠీవి ఒలికిస్తూ నడిచిపోతుంటే సందర్శించటం మహత్తర భాగ్యం. ఆయన పలుకే బంగారం. తప్పనిసరై నోరు కదిపితే గంగా ప్రవాహమే.
కృష్ణారావుగారు చదివింది ఎఫ్‌ఏ. అయినా ఆయన గురువుగారు రఘుపతి వేంకటరత్నం నాయుడుగారే ఆయన వద్దకు వచ్చి కార్లయిల్ గూర్చి, ఎమర్సన్ గూర్చి తన అభిప్రాయాలు ఆయనతో ఒరపిడి పెట్టుకొనేవారు. వందేమాతరం ఉద్యమ నాయకుడు బిపిన్ చంద్రపాల్ సాహచర్యం లభించినా, ముట్నూరి వారు ఆయనకే జీవితం అంకితం చేయకుండా, స్వతంత్ర ప్రవృత్తితో పత్రికా సంపాదకత్వంతోనే సంతృప్తిపడి జీవించి, ఆంధ్రప్రజానీకాన్ని ఉజ్జీవింపజేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో గాంధీ మహాత్ముణ్ణి ముట్నూరి అనుసరిస్తున్నప్పుడొకచోట రాట్నం వడకటం అని చెప్తూ, ఎటువంటి పనో చెప్పటానికి మాట రాక తటపటాయిస్తుంటే ఒ్ఘష్ఘూౄళశఆ అనే పదం అందించిన ఆనాటి కృష్ణారావు సమయస్ఫూర్తి మరువనిదైంది మహాత్ముడికి. ఏ ఆంధ్రుడు కనిపించినా ముట్నూరివారి క్షేమం ముందుగా అడిగి ఆయన్ను సంస్మరించుకొనేవారు గాంధీజీ. మహాత్ముని సత్యానే్వషణ, శ్రీ అరవిందుల శివారాధన, రవీంద్రకవీంద్రుల సౌందర్యోపాసన ముట్నూరివారి త్రికరణాలు.
కృష్ణాపత్రికలో ముట్నూరి వారి సంపాదకీయ వ్యాసం చదవందే ప్రజలు నిద్రపోయేవారు కారు. ఆ వ్యాసాల్లో ఉదాత్త్భావ సమన్వయం, సముచితోదాత్త శైలిలో సంపాదించేవారు. శుక్రవారం ఉదయానికే పఠన మందిరాలు పాఠకులతో కిక్కిరిసిపోయేవి. ఏ శీర్షిక కాశీర్షికగా కత్తిరించి, పెక్కు ప్రతుల ఫైళ్లలో పెట్టి ఉంచేవారు. సంపాదకీయాలు కొందరందుకొంటే, వడండ్ల శీర్షికలందుకొని హర్షాతిరేకులయ్యేవారు కొందరు. నావంటివారు లోవెలుగులు లేఖలు పఠించుకొంటూ ఉల్లాసపడేవారు.
తెలుగులో లేఖా సాహిత్య ప్రక్రియ నాదరించిన రచయితలు వ్రేళ్ళమీద ఉంటారు. అందులో ముట్నూరివారు కనిష్ఠ్ధాష్ఠుతులు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

కీ.శే. బొడ్డుపల్లి పురుషోత్తం