వినమరుగైన

ఆంధ్రుల సాంఘిక చరిత్ర( సురవరం ప్రతాపరెడ్డి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు శ్రీ రెడ్డిగారి గ్రంథంలోని కొన్ని అభిప్రాయాలతో, పదాల వివరణతో విభేదిస్తూ జాబు వ్రాశారు. వాస్తవమే! కాని ఇవన్నీ ఒక సంస్థ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేసినందువల్ల ఏర్పడిన దిష్టిచుక్కలు మాత్రమే! శ్రీశ్రీ అన్నట్లు ‘చరిత్ర అంటే తారీఖులూ, దస్తావేజులూ కాదు’. అది చారిత్రక విభాత సంధ్యల మానవ వికాస గాథ, శ్రీ రెడ్డిగారు వేయి సంవత్సరాల తెలుగు జీవనాన్ని తవ్వి పెకలించి, శుభ్రం చేయాలి. అయితే వారికి వున్న పని ఎక్కువ. పనిముట్లు తక్కువ. హిందువులు ఇహలోక చరిత్రను పట్టించుకోలేదు. తురకలు ఎన్నో భవనాలను, శిల్పాలను కూల్చారు; చిత్తరువులను, తాళపత్ర గ్రంథాలను కాల్చారు. పాశ్చాత్యులు మన చరిత్రను వక్రీకరించారు. స్థానిక చరిత్రలలో కల్పనలు జాస్తి. జానపద సాహిత్యం పోషణలేక ఖిలమైపోయింది. అయినా తెలుగు భాషకు నన్నయవలె, తెలుగువారి చరిత్రకు శ్రీ రెడ్డిగారు మార్గ నిర్మాణం చేశారు. అదీ అద్భుతంగా! శ్రీ రెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలుగువారికి తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది. అది ఆంధ్ర కా సామాజిక ఇతిహాస్ అనే పేరుతో హందీలోకి అనువదింపబడి ఎందరో భారతీయులను అలరించింది. అందుకే శ్రీ వేటూరి వారు రెడ్డిగారికి ఒక కార్డు వ్రాస్తూ, ఈ గ్రంథం ఇంకా 4 రెట్లు ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రాళ్లపల్లివారు ఈ గ్రంథాన్ని ఏకబిగిన చదివాననీ, ఎన్నో నేర్చుకొన్నాననీ జాబు వ్రాశారు. శ్రీ నార్లవారు ఈ పుస్తకంమీద ఆంధ్రప్రభలో మన తాత ముత్తాతలు అను ఒక సంపాదకీయమే వ్రాశారు. ఇంతకంటే నికషపలాలు వేరే కావాలా? శ్రీ రెడ్డిగారు ఒక టైమ్ మెషీన్ సృష్టించారు. ఆ కాలయంత్రం ద్వారా మనలను వేయి సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయి, అప్పటినుండి ఇప్పటివరకు గల తెలుగు జీవనాన్ని మన కళ్లముందుంచారు. వారికి రాజోద్యోగం చేసి, లక్షలార్జించే అవకాశాలున్నా ఆత్మాభిమానంతో ఆంధ్రుల చరిత్రను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ రాజ్యంలో తెలుగువారి కొనూపిరులకు ఊపిరులూదారు. ఒక పద్యంలో సి.నారాయణగారెడ్డి గారన్నట్లు, సురవరంవారు ‘‘మూర్ఛపోయినట్టి తెలుగుజాతి సంస్కృతికి టీకలు తీసిన మల్లినాథుడు’. ఎవరో సురవరంవారి పేరును తమాషాగా చమత్కరించారు. ‘వారి రచనలు చింతనా పరులకు సుర. వారి సేవ తెలుగువారికి వరం. వారి త్రోవ నిర్భయ ప్రతాపం’ అని. నిజంగా సురవరం ప్రతాపరెడ్డిగారు సార్థక నామధేయులు. వారిని గురించి ఎంత చెప్పినా కొండను అద్దంలో చూపడమే అవుతుంది. ఇప్పుడు చేసిందీ అదే!
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

అయపోయంది

కె.వి. కోటిలింగం