వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరువైయవ శతాబ్దము గడిచి, ఇరువై యొకటవ శతాబ్దమునకు అడుగిడిన వేళ, గత శతాబ్దములో వెలువడిన ఉత్కృష్ట గ్రంథాలపై విశే్లషణలను రూపొందించడంవల్ల చారిత్రక ప్రయోజనము సిద్ధించుట తథ్యము.
ఇందులో భాగముగ యిపుడు చోటుచేసుకున్నది ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం, శ్రీ ఖండవల్లి బాలేందు శేఖరం గార్లచే సమకూర్చబడిన గ్రంథము ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి. ఇది మొదట ప్రచురింపబడినది 1951లో. ఆ తరువాత యిది అనేక ముద్రణములనందినది. ఇపుడు ఈ సమీక్షా ప్రసంగమునకు ఆకరమైనది 1981లో ప్రచురితమైన ఆరవ ముద్రణము. దీనిని విద్యా విషయక ప్రచారకులు బాల సరస్వతి బుక్ డిపో కర్నూలు వారు. నాడు ఇరువది రూపాయల వెలకు ప్రచురించినారు. మొదట ముద్రించినవారు కూడా ఈ సంస్థవారే. ఆ పిదప ముద్రణ మందినదేమో తెలియరాదు. ఇన్ని ముద్రణములు పునర్ముద్రణములేగాని, సమీక్షా ముద్రణములు కావు. బహుశః ఇది సమగ్రమైనదని, సవరింపనవలసిన ఆవశ్యకము లేదని భావింపబడుట దానికి కారణములు గావచ్చును. తెలుగున ఒక పుస్తకము ఇన్ని ముద్రణములందుట చాలా అబ్బురము. విశ్వవిద్యాలయములలో కొంత కాలమునకు ముందు తెలుగు ఎం.ఏ పాఠ్య ప్రణాళికలో ఆంధ్రుల చరిత్ర సంస్కృతులు ఒక పాఠ్యంశముగా బోధింపబడుచుండెడిది. ఇన్ని ముద్రణలు పొందుటకు అది కూడా ఒక కారణము కావచ్చును. ఆంధ్రప్రదేశ్ విధాన సభాధ్యక్షులుగా పనిచేసిన ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారు ఈ గ్రంథమునకు ఆశీస్సుల నొసగుచు సమగ్రమైన ఆంధ్రుల చరిత్ర యొకటి ఇప్పటివరకు లేని లోపము, ఈ రచన వలన దీరుచున్నది. దీనిలో రాజకీయ చరిత్ర, సాంస్కృతిక చరిత్ర, ఇది యది యననేల, ఆంధ్రదేశమును గూర్చియు, ఆంధ్రులను గూర్చియు, జిజ్ఞాసువగు వాడు కోరు విషయములన్నియు ఒకే చోటనే కలవని నాకు తోచినది. ఈ విషయములను గూర్చిన యొక సర్వస్వముగా దీనిని పేర్కొనవచ్చును అని వ్రాసి యున్నారు. 1951లో ప్రథమ ముద్రణ సమయమునాటికి వీరు హైదరాబాద్ మేయరుగానున్నారు. సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ఇంత సంపూర్ణమైన ఆంధ్రుల చరిత్రను తెలుపు గ్రంథము తెనుగులో యిదొక్కటియే యేమో ఆశ్చర్యార్థక పూర్వక అభినందన సందేశమిచ్చి యున్నారు. ఇది 1957లో వచ్చిన ద్వితీయ ముద్రణ సమయము నందలిది. మారేమండ రామారావు గారు ఉపలబ్ధమగు సామగ్రియొక్కయు, గ్రంథముల యొక్కయు, వ్యాసముల యొక్క యు సహాయమున ఆంధ్రుల చరిత్ర సంస్కృతుల స్వరూప స్వభావములను సంగ్రహముగానైనను తెలియజేయు గ్రంథమొకటి మిక్కిలి అవసరమైనది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు