వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాశాలలో చదువుకొను విద్యార్థులకును, సామాన్య పాఠకులకును ఇట్టి గ్రంథమ మరియు అవసరమైనది. ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి గ్రంథము ఈ కొరతను తీర్పనుద్దేశింపబడినది అని వ్రాసి యున్నారు. దీనికి తేదీ లేదు. తరువాతి ముద్రణములలో ఎట్టి సంస్కరణమలు చోటుచేసుకొనకుండుటకు, ఈ ప్రముఖుల అభిప్రాయములు కొంతకు కొంత కారణమైయుండవచ్చును. ఇక గ్రంథకర్తలు తమ గ్రంథమును గూర్చి ఇది యొక మధుకోశము. మకరందతాందిల మందార సుమము కాదు అని ప్రథమ ముద్రణమున తెలిపియున్నారు. దీనిని బట్టి గ్రంథకర్తలు దీనిని సమగ్రమైనదిగనే భావించినారని తలపవలసి యున్నది. ఇందు మాడపాటి వారి అభిప్రాయము, గ్రంథకర్తల మాట ఆంధ్రప్రదేశ్ కూడ కాదు. ఆంధ్రరాష్ట్రావతరణమునకు పూర్వము నాటివి. సోమశేఖర శర్మగారిది ఆంధ్రప్రదేశ్ కూడ ఏర్పడిన నాటిది. మారేమండ రామారావుగారి అభిప్రాయ విషయమున తేదీ లేదని ముందు తెలుపబడినది. శ్రీ మారేమండ రామారావుగారు తమ పరిచయమును కొనసాగించుచు శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరంగారలు ఆంధ్రుల చరిత్ర సంస్కృతుల యెడ గాఢమైన అభిమానము గల విద్యాధికులు. ఇందు శ్రీ లక్ష్మీ రంజనంగారు చాలా కాలమునుండి ఎం.ఏ తరగతి తెలుగు విద్యార్థుల కాంధ్రచరిత్ర సంస్కృతులను బోధించుచున్నారు. ఈ సోదరుల ఆంధ్రుల చరిత్ర సంస్కృతుల యెడ తమకు గల పరిచయభిమానుముల నీ గ్రంథ రూపమున ప్రశంసనీయముగా వెలువరించినారు. ఇది ఆంధ్రుల చరిత్రము. ఆది నుండి నిన్న మొన్నటివరకును సూచింపబడినది. అందలి ముఖ్య రాజవంశముల చరిత్రతో బాటుగా, ఆయా కాలములలోని సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు వర్ణింపబడినది. గ్రంథకర్తలు ప్రామాణిక గ్రంథములను, వ్యాసములను ఆధారము చేసికొని ఈ గ్రంథమును రచించిరి. ఈ గ్రంథమునందు సుప్రసిద్ధ పరిశోధకులందరి యభిప్రాయములను పేర్కొనబడినవి. విషయ విన్యాసము ఆంధ్రుల చరిత్ర సంస్కృతులను సులభముగా గ్రహించుట కనువైనదిగా నున్నది అని ముగించినారు.
సత్యము. ప్రత్యక్షముగా, పరోక్షముగా, ఆంధ్రుల చరిత్రను, సంస్కృతిని గ్రంథరచనా కాలము నాటికి స్పృశించిన నలుబది గ్రంథములను, గ్రంథకర్తలు ఉపయుక్త గ్రంథములుగా సూచించి యుండుట దీని కుపబలకము. ఇందుకు ఉదహరించిన వారి గ్రంథములే గాక, ఇంకా....

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు