వినమరుగైన

విజయశ్రీ -కరుణశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర సాహిత్య ప్రపంచంలో వెలసిన వీరరస ప్రధానమైన కావ్యాల్లో విజయశ్రీది ఒక విశిష్ట స్థానం. స్వాతంత్య్ర సమాదరణం, నిరంకుశత్వ నిరాదరణం, సమైక్యతత్త్వం, సంస్కృతి ప్రియత్వం, దేశభక్తి, విదేశ విరక్తి రాసిపోసుకున్న కురుక్షేత్ర వీర కావ్యం విజయశ్రీ. కావ్యకర్త కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీగారు. ఆయన తనకు అత్యంత కీర్తి ప్రతిష్ఠలను సంపాదించి పెట్టిన కావ్యత్రయంలో ఉదయశ్రీని తన హృదయంగా, కరుణశ్రీని తన జీవితంగా చెబుతూ విజయశ్రీని తన శిరస్సుగా పేర్కొనటం గమనింపదగిన అంశం. ఇందువల్ల ఏ మనిషైనా తల ఎత్తుకొని స్వేచ్ఛా పరిమళాలు పీలుస్తూ జీవించాలనే కవి ఆత్మీయతా ముద్ర అభివ్యక్తమవుతున్నది.
విజయశ్రీ కావ్యం మొదటినుండి చివరి వరకు భారత కథను పైకి వ్యక్తీకరిస్తున్నట్లుగా అంతర్లీనంగా భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ గాథను స్ఫురింపజేస్తూ ముందుకు సాగిపోతుంది. కనుకనే ఇది చక్కని ధ్వని కావ్యం అయింది. అంతేకాదు, ఏభై సంవత్సరాలుగా పాఠకుల ప్రశంసలు అందుకొంటూ అచ్చులో ఇరవై తొమ్మిది ముద్రణలకు నోచుకున్నది.
ఈ కావ్యంలో మొత్తం 205 పద్యాలు, ఐదు విభాగాలూ ఉన్నాయి. మంత్రాలోచనం- స్కంధావారం- విషాదం- ప్రబోధం- విజృంభణం అనే శీర్షికలతో పంచ పాండవుల మనోభావాలు ప్రతిబింబిస్తాయి.
ధర్మజ భీమార్జున నకుల సహదేవులు ద్రౌపదితోపాటు అన్నమాట ప్రకారం అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తిచేసి తిరిగి వచ్చారు. శ్రీకృష్ణుని వంటి మహనీయుణ్ణి రాయబారిగా పంపినా ఫలితం లభించలేదు. పాండవుల కర్తవ్య సమాలోచనంతో కావ్యం ప్రారంభమవుతుంది.
‘‘ఐనవి సంధి సంబరము లాయుధముల్ ధరియింపుడయ్య! దా
పైనది వీరభారత మహా రణరంగము; సర్వదా వృధా
యైనవి సంప్రదింపులు - తథాస్తు- జయాపజయమ్ము లేవి ఎ
ట్లైనను మీవి వారివి గుణాగుణముల్ గ్రహియించి రందురున్’’
అని కాగల కార్యాన్ని నిర్దేశించే శ్రీకృష్ణుడూ,
‘‘నెయ్యమునకు మేమంపిన/ కయ్యమునకు దింపినారు కౌరవులు; వృథా
యయ్యె మదాశయ; మిక నా/ దయ్యమెరుగు కురుకులంబు దశ ఏమగునో!’’ అని అయిష్టంగానో యుద్ధోన్ముఖుడయ్యే యుధిష్ఠిరుడూ,
‘‘రా రాజెవ్వడు రాజ్యమేలగ? అపార స్నార దోస్సార మే
పారన్ రాజుల నాజులన్ గెలిచి, నా డాసేతుల శీతాచల
క్ష్మారాజ్యమ్మును పాండురాజు వెలయింపన్ నేడిటుల్ కొల్వుసిం
గారమ్మై కుడువంగ బుట్టిరి దొరల్ గాంధారి గర్భమ్మునన్’’ అని గర్జిస్తూ మీసం మెలివేసే భీమసేనుడూ,
‘‘పచ్చని రాజవంశ వని పాడొనరింప జనించినాడు కా
ర్చిచ్చయి రేడు; సూత సుతు స్నేహము దానికి తోడు; గాడుపై
కచ్చెలు రేపె నా శకునిగాడు; రగుల్కొనె మంట మింట, వి
వ్వచ్చుని వింట నింక శరవర్షము తప్పదు విశ్వశాంతికై’’
అని వీరాలాపాలతో గాండీవాన్ని సవరించె అర్జునుడూ, ‘‘్భజాగ్రముల్ పొంగ పురోగమింతురో!/ ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో!/ శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో!/ కరమ్ములన్ మోడ్చి ఏరిక్రమింతురో!’’ అని భర్తలను శత్రు సంహర్తలనుగా మార్చడానికి ప్రయత్నించే ద్రౌపదీ, రణోత్సాహంతో ఖడ్గాలను కదిలించే నకుల సహదేవులూ మొదటి విభాగమైన మంత్రాలోచనంలో మనకు కనిపిస్తారు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-జంధ్యాల జయకృష్ణ బాపూజీ