వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది సర్వతా విసర్జింపదగినది’’ ఇది విలువైన మాట. పాటింపదగినది.సంస్కృతి నిర్వచనము గావించిన తరువాత ఆంధ్ర దేశ భౌతిక వర్ణన గావించినారు. అందు ఆంధ్ర దేశమునందలి కొండలు, గుట్టలు, నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు - అవి నెలకొన్న ప్రదేశములు, వాటి రూపురేఖా విలాసములు. వానివలన ఉపయోగములు పేర్కొనినారు. అట్లే పండుపంటలు, వృద్ధి చెందు పశుసంతతిని, లభ్యమగు ఖనిజ సంపద, పరిశ్రమలు, వానికిగల అవకాశములు, రేవులు మొదలగువానిని మొదటి అయిదు అధ్యాయములలో సంతరించినారు. ఆరవ అధ్యాయమున ఈ దేశమునకు గల పూర్వపు పేర్లు మండలములను గూర్చి ప్రసంగించిరి. ఇది అంతయు వీనిని గూర్చి ఆయా గ్రంథములందు గల విశేషములను సంపుటీకరించిరి. ఇందు మంజీర దేశము అని బౌద్ధ గ్రంథములలో ఉటంకింపబడినది నేటి తెలంగాణామునకు సరిపోవుననిరి. దీనికి కారణము మంజీర అనునది అచ్చట ప్రవహించుటను కారణముగా చూపిరి. ఆ వెంటనే మంజీరికా దేశము కళింగమునకు దక్షిణమున నున్నట్లు బౌద్ధ గ్రంథములు వివరించి యున్నట్లు పేర్కొనిరి. ఇవి పరస్పర వ్యాఘాతములు. ఈ పొరపాటు పూర్వ చారిత్రకులు గావించినది. దీనిని యథాతథముగా గ్రహించుట వీరు గావించిన పొరపాటు. మంజీర దేశము నేటి కృష్ణా జిల్లా యందలి దివి తాలూకాకు వర్తించును. దీనికి కారణము అచట మాజేరు (మంజీర) అను ప్రవాహముండుట. కుబేరకుడు పాలించినదీ ప్రాంతమునే. ఇక తెలుగు తెనుగు శబ్దముల విచారము, ఆంధ్ర శబ్ద విచారము కూడ, పూర్వ గ్రంథములందలి చర్చనే గ్రహించిరి. అందు పండిత ప్రముఖులందరు తెలుగునకు ఆకరముగా గ్రహించిన, విద్యానాధుని వక్కణమునే గ్రహించిరి. అదే నేడును పండిత లోకమున కుదురుకొనినది. అది శ్రీశైలం, ద్రాక్షారామము, కాళేశ్వరములనెడి ప్రసిద్ధ త్రిలింగ క్షేత్రములనుట. ఆ త్రిలింగ శబ్దమే తెలుగునకు ఆకరమైనదను భావము. ఇట్లే ఇతర అభిప్రాయములను గ్రహింపబడినవి. అయితే త్రిలింగ రూపము పండిత కల్పితమని అంగీకరించిరి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు