వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్రాత విషయమున గల ఈ మార్పును అప్పకవీయము గుర్తించి చెప్పినది. తెనుగు శబ్దము విషయమున గల తెన్ అగు అనగా దక్షిణము అని ద్విగ్వాచిగా గ్రంథకర్తలు గ్రహించిరి. ఇదియును పండితుల ఊహ. నిజమునకు తెనుగు అనునది ఒక గడ్డి. తెనుగు బాడి అను గ్రామము విశాఖ జిల్లా యందు గలదు. తెనుగు ఉచ్ఛారణమున తెలుగు అయినది. ఆ గడ్డి విస్తారముగా పెరిగిన భూభాగము తెలంగాణము. కాణమనగ భూభాగము లేక భూమి. ఇది వాస్తవ స్థితి. ముందే చెప్పినట్లు వీరు గావించినది పూర్వక విషయముల సంకలనమగుట. ఇట్టివి చోటుచేసుకొనినవి. ఆ తరువాతి అధ్యాయములలో రాజ్య వంశముల స్థాపనము, ఆయా పాలనా కాలములందలి విశేషములు సవివరముగా నీయబడినవి. ఆంధ్ర దేశ చరిత్ర ఒక్కచోట చేర్చుటవలన, సామాన్య పాఠకునికి మిగుల సౌకర్యమేర్పడినది. పరిశోధకులెట్లును మూలమును పరామర్శింతురు. ఇది ప్రధానముగా సామాన్య పాఠకులను, విద్యార్థులను ఉద్దేశించి వ్రాయబడినది. అయితే అచ్చటచ్చట అలంకారిక రచనలు కన్పించును. అది సామాన్య పాఠకులకు కొంత ఇబ్బందిని కలిగించును. ఆంధ్రముపై, ఆంధ్ర భాషపై, ఆంధ్ర జాతిపైగల మక్కువ గ్రంథకర్తలచే ఈ పని చేయించినది. ఈ ప్రవృత్తి స్వపచో వ్యాఘాతమును కల్పించినది. ఆంధ్ర భాష విషయమున గూర్చి ఎనిమిదవ ప్రకరణమున, ఆంధ్రముపై సంస్కృత స్వభావమున గూర్చి వ్రాయుచూ, దీనివలన సంస్కృతము ఊత లేక ఆంధ్ర భాష విలువజాలని దుఃఖస్థితి సంభవించినది. ఆ వెంటనే సంస్కృత భాషా సాహచర్యము తెనుగునకు చేసిన మేలు మరువరానిది. ఉదాత్త రస భావములు గల వాఙ్మయమునకు, విజ్ఞానప్రదమైన శాస్తమ్రులకును గీర్వాణ భాష పెన్నిధి వంటిది అని వ్రాసిరి. సంస్కృత పదములపై మోజు సాగరసీమవాసుల భాషలో నెక్కువగా నచ్చొత్తినది. తెలంగాణమునందు, రాయలసీమ ప్రాంతమునకు అచ్చ తెలుగు మాటలెన్నియో చక్కనివి నేటికిని జనుల వాడుకలో నిల్చియున్నవి. తెనుగు తొల్లిటి నుడికారము ఈ మండలములో నింకను సజీవమైయున్నదని వ్రాసి యున్నారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు