వినమరుగైన

ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి( ఖండవల్లి లక్ష్మీరంజనం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్లనుటకు కారణము కూడ, పండిత లోకములో పరంపరీణముగ పాదుకున్న అభిప్రాయమే. అది ఏమనగా తెలుగు, ఆంధ్రము ఒకే భాషకు గల పేర్లని భావించుట. కాని నిజమునకు ఈ రెండును వేర్వేరు భాషలు. ఆంధ్రము ప్రాకృతము. తెలుగు తెలంగాణమునకు చెందినది. ఈ భేదము గుర్తింపక పూర్వ పండితులెల్లరు రెంటిని ఏక భాషగా పొరపడుట ఈ అపోహకు మూలము. ఈ కారణముగనే ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ కృతముగాదని భావించుటయు జరిగినది. కాని అందరును ననె్నచోడుని చాళుక్యులు తెలుంగు నిలిపిరి ఆంధ్ర విషయంబున అను వాక్యమును అనువగు అన్ని చోట్ల ఉటంకింతురు తప్ప, అతడట్లు చెప్పుటకు కారణమేమియో విచారించిన వారు గారు. ఈ గ్రంథకర్తలును అట్లే భావించిరి. అట్లే కాకతీయుల మొదటి ఆవాస విషయము గ్రంథకర్తలిట్లు వ్రాసిరి.
‘ఈ రాజ వంశమునకు స్థాపకుడగు మొదటి బేతరాజును కాజీపేట శాసనము కాకతిపుర ప్రభువుగ తెల్పుచున్నది. త్రిపురాంతకనందలి శాసనము వలన నీ బేతరాజు కులపురము కాకతియను ప్రదేశమని తెలియనగుచున్నది. ఇవి శాసనస్థ విషయాలేనని పేర్కొనినారు. ఆ పిదప కాకతియను పేరును, దానికి మిక్కిలి సమీపముననున్న నామాంతరములును గల ప్రదేశములాంధ్ర దేశమున గంజాం విశాఖపట్టణము, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలయందు నేటికిని కలవు. కావున కాకతి పదమును మనము స్థలనామముగ, తమ్మూలకముగ వంశనామముగను కూడా పరిగణించుట తప్పు కానేరదు అని వ్రాసియున్నారు.
శాసనములలో కాకతిపురమని స్పష్టముగా చెప్పి యుండగా, మన పరిగణనముతో పని ఏమియో తెలియరాదు. అంతేగాక కాకతి లేక తత్సంబంధమైన నామములుగల జిల్లాలను పేర్కొన్నవారు, అనంతరము కాకతిపురమెచ్చట నుండెడిదో తెల్పుట కష్టసాధ్యమని వ్రాయుట వింత. అంత మాత్రమేగాక, పై జిల్లాలో నుదహరింపక కాకతిపురము వరంగల్లు జిల్లాలోని మధిర, మానుకోట ప్రాంతములందుండెనని యూహింపవచ్చునని వ్రాయుటలోని సామరస్యము బోధపడదు. ఇట్టి పరస్పర విరోధ వాక్యములు మరికొన్ని గలవు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

బాలేందు శేఖరం పు యార్లగడ్డ బాలగంగాధరరావు