వినమరుగైన

రసరేఖలు( సంజీవ్ దేవ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్‌దేవ్ పేరు వినని సమకాలీన సంస్కృతీపరులు ఆంధ్రదేశంలో ఉండరని నా నిశ్చితాభిప్రాయం. సంజీవ్‌దేవ్‌ఘారు ఒక సమగ్ర సంస్కార చిహ్నం.
మానవజాతి విభిన్న దేశాలలో విభిన్న కాలాలలో అనేక రూపాలలో ఏ విజయాలను సాధించిందో వాటిని నిరంతరం తను అవగాహనా పరిధిలోకి ఇముడ్చుకుంటూ వాటి సారాన్ని తన జీవన మార్గంగా చేసుకొనటమే సంజీవ్‌దేవ్ సంస్కారలక్షణం. అందుకనే ఆయన విశ్వ సంస్కృతికి వారసుడు. భౌతిక, మానసిక, అతిమానస, ఆనందమయకోశాల మాహార భావన ఆయన చింతన సౌందర్య జీవనాన్ని అనుష్టాన పరిపుష్టం చేసుకొనే జీవన సౌందర్యం వారిది. ఎక్కడెక్కడ సౌందర్య రేఖలున్నాయో వాటిని తన జీవన నిర్మాణానికి సూత్రాలుగా చేసుకొనటం వారి జీవనంలోని సౌందర్యం. ఈ సాధనలో ప్రయత్నాలన్నీ రసరేఖలు అన్న వ్యాస సంపుటంలో కనిపస్తాయి.
తన పుస్తకాలకు పెట్టే పేర్ల పద సంపుటిలోనే వారి జీవన ప్రాధాన్యం కనిపిస్తుంది. రసరేఖలు అన్న శీర్షికలో రస శబ్దం సౌందర్యానికి సాధనమైన జీవన మర్గానికి, గమ్యమయిన ఆనందానికి కూడా పర్యాయపదంగానే అన్వయించుకొనాలి.
సంజీవ్‌దేవ్ భాషలో సంయమనం వుంది. నాజూకు వుంది. ప్రతి వాక్యానికి సమతూకం వుంటుంది. ఇంగ్లీషు నుడికారానికి గూడ సొగసయిన తెలుగు నిర్మించుకుంటారు. ఇవన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అంశాలు. వారి వ్యాసారారంభాలతోనే వారికలాన్ని గుర్తుపట్టవచ్చు.
రసరేఖలు అనే పుస్తకం సంజీవ్‌దేవ్ జీవిత విస్తృతిని పరిచయాల వ్యాప్తిని- తాత్త్విక జిజ్ఞాసా గాడతను కళానేతృతను చిత్రకళా విశే్లషణను- హేతుబద్ధ చింతనాభిలాషను వారి బహుముఖీన సంస్కారాన్ని ప్రదర్శిస్తోంది.
చిత్రకళను యధాతధంగాచూచి మెచ్చుకొనటం కన్నా విచక్షణతో విశే్లషణాత్మకంగా చూడటానికి అధిక పరిజ్ఞానం అవసరం. ఇట్లాంటి పరిజ్ఞానం ఇవ్వగల కళా విశే్లషకులు తెలుగులో చాలా అరుదు. ఉన్నవారిలో గూడా సాంకేతిక చర్చకు ఇజాల నేపథ్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారే ఎక్కువ.
సంజీవ్‌దేవ్‌గారి చిత్రకళా విశే్లషణలో సాంకేతిక నైపుణ్యాల చర్చ కన్న రసభావోచితమయిన చర్చ అధికంగా వుంటుంది. తెలుగులో చిత్రకలా విమర్శకు అనవసరమైన పదజాలం గూడా పుష్కలంగా లేదు.
సంజీవ్‌దేవ్‌గారే వాటిని కల్పన చేసుకున్న సందర్భాలు చాలా వున్నాయి. ఆంగ్ల పదాను వీలయినంత వరకు వాడకుండానే చిత్రకళా సాంకేతిక విషయాలను గూడావివరించటం వీరి విశేష ప్రయోగం. సంజీవ్ దేవ్‌గారి విమర్శలో రూప నిర్మాణం గురించి- విషయ విషయ సంబంధం గురించి మాత్రమే కాక విశ్వలయ జీవనలయ ప్రాణస్పందన చేతనా భేదాలు మొదలైన ప్రత్యేక కోణాలనుండి కూడా వివరిస్తారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

వావిలాల సుబ్బారావు