వినమరుగైన

రసరేఖలు( సంజీవ్ దేవ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లామా గోవిందమార్గాన్నిలక్ష్యాన్ని సమన్వయిస్తూ ‘రూప జగత్తును అధిగమించి రూపాతీత జగత్తును అందుకోవాలనే సాధనలో లామా గోవిందకు రూపసాధన ఏ మాత్రం అడ్డురాలేదు’ అని లోచూపు చూస్తారు. ఇట్లాగే తనా పరిచయం చేసిన కళాకారులందరి తత్త్వాన్ని వారి చిత్రాలనుండి వెలికితీస్తారు.
చిత్రకారుల గురించిన సంజీవ్‌దేవ్ వ్యాసాలు కళా విశే్లషణలు మాత్రమే కాదు- జీవిత చరిత్రలు వ్రాసేవారికి ఒరవళ్లు కూడా. చిత్రకళను చూచి ఆనందించటం వివేచనతో అధ్యయనం చెయ్యటం ప్రారంభించదలచిన వారికి సంజీవ్‌దేవ్ వ్యాసాలు బాలశిక్షలు మాత్రమే గాదు పండిత శిక్షలు కూడా.
కళామర్మాలను సౌందర్యసీమలను అంతర్వీక్షణతో చూడగల సంజీవ్‌దేవ్‌కు ఈ కళామార్గమే విశ్వతత్త్వాన్ని అవగతం చేసుకొనటానికి మార్గం కూడా అయింది. సంజీవ్‌దేవ్‌ల కళా సమీక్షకుడు ఎంత బలంగా ఉన్నాడో కళాస్రస్ట గూడా అంత బలంగా ఉన్నాడు. అతని తత్త్వ జిజ్ఞాస తన కళాస్రష్టత్వానికి నేతృత్వానికి అంతర్వీక్షణాన్ని సమకూర్చింది. అతనిలో కళావేత్త ముందు మేల్కొన్నాడా! తాత్త్వికుడు ముందు మేల్కొన్నాడా! చెప్పలేను గాని రెండు అంశాలు మొలకెత్తే బీజంలోని రెండు దళాలు లాగ ప్రారంభం నుండే ఉండి ఉంటాయి. రసదృష్టితో వ్రాసిన వ్యాసాలు కొన్ని, తత్త్వ జిజ్ఞాసలో వ్రాసిన వ్యాసాలు కొన్ని కలబోసిన రసరేఖలు సంపుటి సంజీవ్‌దేవ్‌గారి మనోమూర్తిని స్పష్టం చేస్తుంది. జార్జి శాంతయానా గురించి మీరు వ్రాసిన వ్యాసం చదివితే సంజీవ్‌దేవ్‌గారి తాత్త్వికాభిప్రాయాలను ఊహించవచ్చు. బాహ్య జగత్తుకు, అంతర్జగత్తుకు, స్థూల జగత్తుకు, సూక్ష్మ జగత్తుకు, సమాన ప్రాధాన్యం ఇవ్వటం- స్థూల జగత్తులోని ఇంద్రియ గ్రాహ్య విషయాలు సూక్ష్మజగత్తులోని అతీంద్రియ విషయాలు సామరస్యంతో అవగాహన చేసుకొనటం తర్కానికి రసానికి సమాన ప్రాధాన్యం ఇవ్వటం. భావావేశపు రసతరంగిణిలో పడి దారి తెన్ను లేక కొట్టుకొని పోకుండా హేతువాదపు చుక్కానిని స్వీకరించటంలో శాంతయానాకు సంజీవ్‌దేవ్‌కు సామ్యాలు కనిపిస్తాయి.కళాతత్త్వ నిశ్చయాలకు వస్తే పూర్తి అనుకరణగాని పూర్తి ప్రకృతి నిరాకరణగానిత్తమ శిల్ప సృష్టి కాదంటారు. అంతర్భహిర్జగత్తుల లయమయ సమ్మేళనమే ఉత్తమ శిల్పసృష్టిగా సమన్వయం చేస్తారు. కళలో నీతి ప్రధానవాదం సౌందర్య ప్రధాన వాదం అని రెండు వివాదాలు చిరకాలంగా సాగుతున్నాయి. కాని నీతిని నిర్లక్ష్యం చేయరు. అవినీతిని కళ బోధించరాదని మాత్రం స్పష్టం చేస్తారు. నీతి అవినీతి పరిధులను కళ అతిక్రమిస్తుందని, దీనికి నీతితోడు అయితే ఉత్తమ కళ అని తీర్మానిస్తారు.
కళారసికుడుగా, రూప మర్మజ్ఞుడుగా, శిల్ప సమీక్షకుడుగా శిల్పతత్త్వం పరిశీలించి, రసరూపం గురించి అపారజ్ఞానం కలిగిన ఆనంద సి.కుమారస్వామితో సంజీవ్‌దేవ్ ఆలోచనలకు చాలా సామ్యాలున్నాయి. జీవన తత్త్వంలో జార్జి శాంతయాన, కళామర్మజ్ఞతలో ఆనందకుమారస్వామి సంజీవ్‌దేవ్‌గారి ప్రధాన రంగాలలో సామ్యంగా కనిపిస్తారు.రసరేఖలు చదివి ప్రక్కన పెట్టే పుస్తకం కాదు. అధ్యయనం చేయవలసిన పుస్తకం. ఇది చదవటం అంటే ఉత్తమ సంస్కార సభ్యతల చంద్రశాలలో సేద తీర్చుకొనటం అన్నమాట.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సమాప్తం

వావిలాల సుబ్బారావు