వినమరుగైన

బుడుగు ( ముళ్లపూడి వెంకటరమణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుడుగు చదువు సంజెలు గురించి చెప్పుకొనే ముందు బుడుగు దగ్గర పనిచేసి మానేసిన పదిమంది ప్రైవేటు మాస్టార్లు గురించి చెప్పుకోవాలి. ప్రైవేటు మేష్టార్లు గురించి బుడుగు ఒక పరిశోధన చేసి ఒక ‘్థసిస్’ తయారుచేశాడు. అందులో చాలా పాయింట్లు ఉన్నాయి.
ప్రైవేటు మాష్టార్లు అందరూ చెడ్డవాళ్లు. చిన్నపిల్లలకు చదువు చెప్పడం వాళ్లకు రాదు. పైగా శొంఠి పిక్కలు తీస్తామంటారు. ఈడుకు తగని లెక్కలు చేయమంటారు. దబాయిస్తారు. పకోడీలు తేరు. చాక్లెట్లు తెస్తారు. పైగా చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటారు. వాళ్లలో మొగ మేష్టార్లు, ఆడ మేష్టార్లు, కళ్లజోడులో, నల్లకోటులో, గుండు మేష్టార్లు, పిలక మేష్టార్లు- ఇలా అన్ని రకాలవారు ఉన్నారు.
ప్రైవేటు మేష్టార్లు చేసిన తప్పులు బుడుగుకి తెలుసు. వాళ్లకి ‘కుంచెం’ సలహాలు ఇచ్చాడు. దానివల్ల మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాష్టార్లకి తెలుస్తుంది. పెంకి మాష్టార్లని ఏం చెయ్యాలో మంచి పిల్లలకు తెలుస్తుంది.
చెవికి ‘కీ’ యిచ్చేటప్పుడు ఒక మేష్టరు ఎడమవైపునకు తిప్పుతాడు. ఇంకో మేష్టారు వచ్చినపుడు కుడివైపునకు మెలిపెడతాడు. ఇంకో మేష్టారు వచ్చి ఎడమవైపునకు, ఇలా అయితే చెవి పాడైపోతుంది. కాబట్టి కొత్త మేష్టారు రాగానే ఇదివరకటి మేష్టారు ఏ వైపునకు తిప్పాడు అని అడగాలి. లేదా వచ్చేటప్పుడు ముందుగా పాత మేష్టారుని ఆ విషయం కనుక్కొని రావాలి. ఇంకా...
పెంకిపిల్లలు గుండుమీద కొడితే దెబ్బ తగలకుండా మేష్టార్లు తలపాగా చుట్టుకురావాలి.
చాకెట్లు తేకూడదు. పకోడీలు తేవాలి (పక్కవీధిలో నారాయణ కొట్లోవి అయితే బాగుంటాయి).
పెద్ద పెద్ద మీసాలతో రాకూడదు. చిన్నిపిల్లలకి భయం వేస్తుంది మరి.ముఖ్యంగా మేష్టార్లురోజూ రాకూడదు. ఒకరోజు తలనొప్పి, ఒకరోజు జెరం అని ఎగ్గొట్టాలి.
సాధారణంగా చిన్నపిల్లల్ని చిన్నపిల్లలు అంటే కోపం వస్తుంది. ఎప్పుడూ మని పెద్దవాళ్లతో పోల్చుకుంటారు. అన్ని విషయాలలోనూ, ముఖ్యంగా తమకంటే చిన్నవాళ్ల దగ్గర పెద్దరికం ప్రదర్శిస్తారు.
బుడుగుకి కూడా తాను పెద్దవాణ్ణని నమ్మకం. తనకు ఏడేళ్లు. కాని ఎవరైనా అడిగితే వాళ్లమ్మ ఆరేళ్లు అని అబద్ధం చెప్తుంది. బామ్మ అయితే ఇంకా ఘోరం. నాలుగు వెళ్లింది కాని ఐదో ఏడాది ఇంకా రానిదే అని దబాయిస్తుంది. ఇదే నచ్చదు బడుగుకి. పైగా అందరిముందు ‘బొబ్బ పోచుకుందువుగాని రా అమ్మా’ అనీ, ‘బువ్వ పెత్తనా బులుగూ’ అనీ చిన్న వెధవలకి, చితక వెధవలకి చెప్పినట్లు చెప్తారు. సంబరాలకు వెళ్లినపుడు ‘నేను చిన్నవాణ్ణి కాదు, నన్ను ఎత్తుకోవద్దు’ అని చెప్పినా వినకుండా వాళ్ల నాన్న గోపాలం బుడుగుని ఎత్తుకొంటాడు. బుడుగేమో చాలా అవమానంగా భావిస్తాడు.
గుండు ఉంటే అన్నీ కష్టాలే అని తెలుసుకొన్న బుడుగు ఓ రోజు మద్రాసు క్రాఫింగ్ షాపు దగ్గరకి వెళ్లి క్రాఫింగ్ చేయమన్నాడు. వాడు ఓలా నవ్వాడు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

వావిలాల సుబ్బారావు