వినమరుగైన

బుడుగు ( ముళ్లపూడి వెంకటరమణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన దగ్గర డబ్బులు లేవు అని అనుకున్నాడేమోనని కాణీ చూపించాడు. చూపించాడే కాని ఇవ్వలేదు. ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు అన్న అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి బుడుగుకి. వాడు చెయ్యను అనేసరికి చెళ్లున కొట్టి పారిపోయాడు. జటకా బళ్లకోసం చూశాడు. తెలిసినవాళ్లు అయితే తాను పిలిస్తే బండి కట్టరని, తెలియనివాడి కోసం, కొత్తవాడి కోసం చూశాడు.
ఒకసారి బాబాయి సీతకు లవ్‌లెటర్ వ్రాశాడు. బుడుగు చేతికిచ్చి సీతకు ఇచ్చి రమ్మన్నాడు. బుడుగు వెళ్ళేసరికి సీతా వాళ్ల నాన్న బయటే కూర్చొని ఉన్నాడు. ఉత్తరం లాక్కున్నాడు. ధూమ్ ధామ్ అన్నాడు. అప్పుడు బాబాయని ఎలాగైనా రక్షించాలి అని అనిపించింది బుడుగుకి. ‘ఒరేయ్ సీత నాన్నా! ఆ ఉత్తరం బాబాయి కాదు రాసింది. నేనే రాశాను’ అని పరిగెట్టికెళ్లాడు బుడుగు. ఓసారి నాన్న అద్దం పడేసి బద్దలు కొట్టాడు. రాధ చూస్తే కొప్పడుతుంది అని భయపడుతున్నాడు. అప్పుడు బుడుగు తానే అద్దం బద్దలు కొట్టాననని నేరం తన మీద వేసుకున్నాడు.
ఓ రోజు బుడుగు కుక్కను పెంచుకుందామని, కుక్కని ఇంట్లోకి రమ్మని తోక పట్టుకొని లాగుతున్నాడు. అంతలో వీధిలో వెళ్తున్న లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడుగారు ‘‘బుడుగూ, అలా తోకను లాగకు, కరుస్తుంది’’ అన్నాడు. ‘‘తోక ఎక్కడైనా కరుస్తుందా?’’ అని ఆశ్చర్యపోయాడు బుడుగు. అంటే తోకను లాగితే అప్పుడు కుక్కకు నొప్పి పుడితే మనల్ని నోటితో కరుస్తుందన్నమాట అని విశే్లషించుకున్నాడు.
బుడుగుకి పకోడీలు అంటే ఇష్టం. జట్కాబండి, రైలు ఇంజను తోలడం అంటే ఇష్టం. తోలేటప్పుడు చెవి వెనుక పెట్టుకోవడానికి బీడీలు దాస్తున్నాడు ముందుచూపుగా. కానీ తలంటు పోయించుకోవడం, ఒళ్ళు నలుచుకోవడం అంటే మాత్రం విసుగు, కోపం.
ఒకసారి బుడుగుకి అర్జెంటుగా డబ్బు కావాలసి వచ్చింది. నానే్నమో ఊళ్లో లేడు. అమ్మనడిగితే ‘లేదు పో, ఇంట్లో అసలే ఇబ్బందిగా వుంది’ అన్నది. ఇల్లు గడవడానికి డబ్బులు ఇవ్వకుండా ఊరెళ్లిన నాన్నమీద కోపం వచ్చింది బుడుగుకి. లావుపాటి పక్కింటి పిన్నిగారి దగ్గర ఒక అర్ధణా అప్పు అడిగాడు. ఓ కాణి పెట్టి బొంగరం కొనుక్కొని, మిగతా డబ్బుతో బియ్యం బస్తా, బొగ్గులు కొందామనుకున్నాడు బుడుగు. కాని లోకులు నమ్మరు కదా!
బుడుగుకి ఎంతో జీవితానుభవం వుంది. కాని నిజం అనేదాన్ని ఎప్పుడు చెప్పాలో, ఎప్పుడు చెప్పకూడదో తెలియడంలేదు. ఎల్లప్పుడూ నిజమే చెప్పడంవలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
నాన్నతో సంబరానికి వెళ్లినపుడు ఒక వ్యక్తి కనబడ్డాడు బుడుగుకి. ఎప్పుడూ తలపాగ పెట్టుకొనేవాడు. ఆ రోజు తలపాగ లేదు. వాడి గుండు అప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు బుడుగు. ఆశ్చర్యపడుతూ ‘నాన్నోయ్! చూశావా, వీడిది బోడిగుండు’ అన్నాడు. వాడికి కోపం వచ్చింది. ఇంటికి వచ్చాక నాన్న కోప్పడ్డాడు, వేళాపాళా ఉండొద్దూ నిజం చెప్పడానికి అని.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

సి.హెచ్ . సుశీల