వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశేష ఆంధ్ర పాఠక లోకాన్ని కొన్ని సంవత్సరాలపాటు తన ఊహాగానంతో ఉర్రూతలూగించిన లత ఆంధ్ర సాహితీ సుందర నందనవనంలో సుగంధ పరిమళాలు వెదజల్లిన సాహితీ సుమలత. మహారచయిత్రి, కళాప్రపూర్ణ శ్రీమతి తెనే్నటి హేమలతాదేవి పేరు విననివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లతగా పాఠకులకు పరిచయమై తనదైన శైలిలో, తన మదిలో మెదిలిన ఆలోచనా తరంగాలను, ఊహాగానం పేరుతో ప్రముఖ సచిత్ర వారపత్రిక ఆంధ్రప్రభలో ఒక శీర్షికగా ప్రతివారం వెలువడింది. ఊహాగానం కోసం పత్రిక రాగానే నేను ముందు చదవాలంటే నేను ముందని ఇంట్లో వాళ్ళని పరుగులు పెట్టించిన లత, రాలిపోయిన ఆకులమీద, కాలుజారిన పతితలైన అభాగినులపైన కన్నీరు కార్చగల జాలి, నక్షత్రాలను మాలకట్టి తలలో పెట్టుకోవాలనిపించే భావుకత, మహాభారతంలో ధర్మరాజంత వాజమ్మ, స్వార్థపరుడు లేడని చెప్పగల ధైర్యం, ప్రభుత్వం, బహుభార్యా నిషేధం తెచ్చి ఆడవాళ్ళ నెత్తిన మొట్టికాయలు వేశారని చెప్పగల తెగింపు, ‘జీవితం అంటే ఏమిటి?’ అని తన్ను తాను ప్రశ్నించుకునే వైరాగ్యం- యివన్నీ కలబోసి మల్లెలు, మరువాలు, కనకాంబరాలు కలిపి కట్టిన కదంబంలాంటివి ఆమె ఊహాగానాలు.
ఇది దరిదాపు 600 పేజీల పుస్తకం. ఇవి ఆమె ఆలోచనా తరంగాలు అనుకోవచ్చు. ఆలోచనలు ఎప్పుడు, ఎటు వెళ్తాయో చెప్పడమే కష్టం. ఇక ఊహాగానాలు, ఊహల వాహనాలెక్కి ఏ ప్రపంచపుటంచులలోకి తీసుకుపోతయ్యో, ఏ కవి ఇంటి ముంగిట వాల్తాయో చెప్పడం మరీ కష్టం. అయినా ఈ 97 ఊహాగానాలూ చదువుతుంటే నాలుగు రకాలు కన్పిస్తాయి మనకు. మొదట్లో వ్యక్తుల బలహీనతలు లేదా వారి వింత ప్రవర్తనలమీద మొదలుపెట్టి, తర్వాత వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే సాంఘికాచారాలమీద ధ్వజమెత్తి, ఆపైన కొందరు కవుల సాహిత్యంమీద వారి ఆరుచులు చూపించి ఆఖరుగా ఆ జగన్నాట సూత్రధారి ఆడించే ఈ జీవిత నాటకంమీద, ఆ ఈశ్వరుడు శృతిచేసే విశ్వవీణాగీతికల మాధుర్యాన్ని కాస్తంత తాగించి ముగిస్తుంది.
ఈ విధంగా ఒక క్రమ పరిణామం కనపడుతుంది. అయితే ఏది ఎక్కడ ముగిసి రెండోది ప్రవేశిస్తుందనేది చెప్పడం మాత్రం కష్టమే. లత మాటలో లతను గురించి చెప్పాలంటే ‘రస పిపాసిని, సౌందర్య మనస్విని, ఉమర్‌ఖయాం శిష్యురాలు’.లతగారి ప్రతి ఊహాగానాలలో కూడా ఒక పద్ధతి వుంటుంది.
ఆంధ్ర, ఆంగ్ల సంస్కృత, హిందీ భాషలలో బాగా పరిచయమున్న ఆమె ఏ పద్యమో, శ్లోకమో లేక ఆంగ్ల కవి చెప్పిన మాటలో తీసుకుని దానిలోని భావాన్ని వివరిస్తున్నట్లే వివరిస్తూ ఆపై తన అనుభవాలను కలిపి, చివరగా ఒక విసురు, ఒక చెణుకు లేదా ఒక సిద్ధాంతామో తనదైన శైలిలో చెప్పి ముగిస్తుంది.
ఉదాహరణకు మొదట్లోనే సంస్కృత పదభూయిష్టమైన ఒక చాటువును తీసుకుని, పదగుంభనతో తమ పాండిత్య ప్రకర్షను చాటుకోవాలనుకునేవారి మీద ఒక విసురు విసురుతూ, ఎంత అర్థంకాని భాషలో రాస్తే అంత గొప్పవారయినట్లు అనుకుంటారు వీళ్లు అంటూనే మరోమాట అంటుంది. అదేంటంటే...

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

ఎ. తేజోవతి