వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనిషి ఎందుకో ఏ విషయాన్నయినా సూటిగా కాకుండా డొంక తిరుగుడుగా చెప్పడానికి ఇష్టపడతాడనుకుంటాను’ అంటూ ముగిస్తుంది.
ఈ ఊహాగానాల్లో లతగారు స్పందించని అంశమే లేదనిపిస్తుంది. ఇవి దరిదాపు నలభయి అయిదు సంవత్సరాల క్రితం, అంతకుపైన వ్రాసినవి. వీటిలో వివాహ, సాంఘిక అసమానతలు వ్యక్తుల వింత ప్రవర్తనలు, ప్రేమ, దాంపత్యం, ఆకర్షణ, కవులు, కవిత్వాలు, వేదాంతం ఇలా చాలా చాలా అంశాలు ఆమె ఊహల్లో కదలాడి, కొన్ని మనకు హాయి కలిగిస్తే మరికొన్ని చురకవేస్తే ఇంకొన్ని ఆలోచింపచేస్తాయి. మొదట మొదట ఆమె వ్యంగానికి కాస్త చాదస్తమున్నా పెద్ద మనసుకల అమ్మమ్మ, మేనమామ, మామ కొడుకు ఆలంబనగా అయితే, తర్వాత మామగారు, బావగారు, మరిది వగైరాలు ఆలంబన అవుతారు. ఆపైన ఈ ఆలంబనలు లేకుండానే చెప్పదల్చుకున్నది సూటిగా చెప్పేస్తుంది కాస్తంత హాస్యం జోడించి.
ఉదాహరణకు జార్జి బెర్నార్డ్ షా చెప్పిన మాటలు ‘‘ప్రపంచంలోని సువర్ణాక్షరాలతో లిఖించగలిగిన సూత్రమేమిటంటే అలాంటి సూత్రమేదీ లేదనేదే’’ అంటూ ఆ సూత్రాలు కాలానుగుణంగా మారుతుంటాయి అంటుంది. వివాహ వ్యవస్థను తీసుకుని ‘సంతతికి రక్షణ కల్పించే నిమిత్తం ప్రారంభమై ఒక స్ర్తికి ఒకే పురుషుడు అన్నారుగానీ, ఒక పురుషుడికి ఒకే స్ర్తి అనలేకపోయారు’’ అని అధిక్షేపిస్తూనే, నాతిచరామి అన్న సూత్రాన్ని ఎవ్వరూ పాటించడంలేదు. సంఘ భయం వున్నవాళ్ళు చాటుగానూ, లేనివాళ్ళు బహిరంగంగానూ ఇంకోచోటు చరిస్తూనే వున్నారు’’ అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పి ‘‘మన వివాహ వ్యవస్థలో లోటు వున్నదనుకుంటాను’’ అంటూనే, ‘‘సామాన్యంగా మనిషి ఏ కాలంలో ఏ సూత్రానికి తల వొగ్గినా బలవంతుని భయంవల్ల తప్ప మామూలుగా తన అంతరాత్మకు తోచినట్లుగానే నడుచుకుంటాడు’’ అని ముగిస్తుంది.
మన సంఘ పరిస్థితులను గురించి వ్రాస్తూ, ‘‘మమత వున్నచోట పెళ్లి చేసుకోకూడదు. పెళ్లిచేసుకున్నవాడిమీద మమత ఉండదు. ఆత్మవంచన చేసుకుంటూ బ్రతకడం ఆడదానికి శాపం’’ అని సిద్ధాంతీకరిస్తుంది.
ఇది అందరి విషయంలో నిజం కాకపోవచ్చు. అంతేకాదు,

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

ఎ. తేజోవతి