వినమరుగైన

ఊహాగానం (తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాన్ని శాపంగా మార్చుకోకుండా మమత వున్నచోటనే మనువాడే స్వేచ్ఛను కోరుకోవచ్చుగా ఆడవాళ్ళు అనిపిస్తుంది మనకు.
ఇలాంటి చేదునిజాల్నే కదా, ఒక చక్కని పద్యమో, గీతంతోనో మొదలుపెట్టి తన ఊహల ఉయ్యాల ఎక్కి ఆ పద్యం వ్రాసిన కవి ఏ ఆవేశం అలముకున్న క్షణంలో తన కవితా విపంచిక మీటి ఆ గీతికను అందించి ఉంటాడో కూడా తను చూసి పాఠకుల్ని ప్రేక్షకులుగా మార్చి మన మనోనేత్రాల ముందు చూపించగల భావనాపటిమ లతగారిది. ఉదాహరణకు,
‘‘అంతనే వెర్రినై పోదునయ్య నిన్ను / పోలిపోవుదు / నిన్ను బోలి నాట్య/ మాడబోవుడు లజ్జి బోనాడి’’- అన్న కృష్ణశాస్ర్తీ పద్యం తీసుకుని ‘‘సర్వప్రపంచమూ తెరమరుగై కేవలం ఆ ఒక్క విరాట్ స్వరూప మొక్కటే మనోగోచరమవుతున్న తరుణంలో, ఆ విశ్వవర్తనానికి ఆవేశుడైన కవి ఆడి పాడాలనుకోవడంలో సిగ్గెందుకు’’ అంటూ ప్రశ్నించి, ఒక మహాయోగి లేదా ఒక మహాకవి మాత్రమే అలా ఉన్మాదిలా నర్తనం చెయ్యగలడు, కానీ ఒక మహాయోగి దాన్ని వ్యాప్తం చెయ్యలేడు. ఒక మహాకవి మాత్రమే తనలో పుట్టిన ‘తరుణారుణ గీతికాసుమాల్ని విశ్వవీణమీద చూపించి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోగలడు’’ అంటుంది. ఇది ఆమెకు మహాకవుల పట్ల వున్న గౌరవానికి నిదర్శనం మాత్రమే కాదు, భావనాపటిమతోబాటు ఆమెకున్న భాషాపటిమ కూడా నిదర్శనం.
ఇలా మొదలుపెట్టి మామూలు యువతీ యువకులు, సినీ నటుల్ని అనుకరిస్తూ వెర్రి మొర్రి వేషాలు వేయడం సాధారణశైలిలో చెబుతూ తనదైన శైలిలో ఒక విసురు విసిరి పూర్తిచేస్తుంది.
ఇంకాఉంది
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఎ. తేజోవతి