వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అతి సహజమైన శరీర వాంఛకు ప్రేమ అనే బురఖా కప్పి తమను తామే మోసం చేసుకుంటున్నారు’’అని అంటే కొందరికి కొరుకుడుపడదు మరి.
అంతమాత్రం చేత ఆమెకు ప్రేమంటే గిట్టదు అనుకోవడానికి లేదు. మరో ఊహాగానంలో ప్రేమను నిర్వచిస్తూ, ‘‘ప్రేమే ప్రేమకు మూలం. విశ్వమంతా ప్రేమబంధంతోనే చైతన్యమవుతోంది. ఈ జీవితంలో విముక్తికి కూడా ప్రేమే హేతువు’’ అంటుంది. అంటే చౌకబారు ప్రేమ సాహిత్యాన్ని ఏవగించుకుంటున్నది కానీ అసలు ప్రేమను కాదు అనేది తేటతెల్లమవుతోంది.
ఇంత కొంటెతనం వున్నా లతగారికి తెలుగు భాషమీది ఆమెకున్న అభిమానం అపారం. ఆమె అంటుంది, ‘‘తెలుగు కవి, లావణ్య మాధుర్యాలు తియ్యడంలో నేర్పరి. తెలుగు భాషను సృష్టించింది ఏ మధుమాధురీ సమయంలోనో, అందుకే ఇంత తియ్యదనం’’ అని. ఆమే గనుక యింకా బ్రతికుంటే ఈ ఇంగ్లీషు మీడియం మోజులో అమ్మా నాన్నలాంటి పదాల్నే మర్చిపోతున్న ఈ దుర్గతిని చూస్తే ఎంత విలవిలలాడేదో అనిపిస్తుంది నాకు.
లత ఒక విధంగా స్ర్తివాద రచయిత్రి. అమెరికాలాంటి దేశాల్లోని విచ్చలవిడి విడాకుల్ని ఖండించినా, జుట్టుపట్టి బయటకీడ్చినా గడప దగ్గర చేరి, ‘‘మీ పాదాల దగ్గర ఇంత చోటిస్తే చాలు’’అని ఏడ్చే హిందూ స్ర్తిలను అసహ్యించుకున్నా, స్ర్తిలను నిందిస్తే మాత్రం ఆమె సహించలేదు. పాండురంగ మహాత్మ్యంలో, ‘కాపుకోడలు కంచంత కాపురమ్ము’ పోగ్టొకుని నిగమశర్మతో లేచిపోయిన సందర్భంలో ‘ఉవిదుకు బుద్దిపెడతల నుండు గాదె’ అన్న తెనాలి రామకృష్ణుని మాటలు ఆమెకు గుండెలో సూటిగా గుచ్చుకుని, అదే ఏ స్ర్తినో వ్రాస్తే ‘‘పురుషులకు బుద్ధి పెడతల నుండుగాదె’’ అని వ్రాసేదేమో అంటూ అసలు రుూ ప్రపంచంలో పతిత అనిపించుకున్న ప్రతి స్ర్తి మగవాడ్ని నమ్మటంవల్లనే’’ అలా అయిందని నింద మగవాళ్లమీదనే వేస్తుంది.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకాఉంది

ఎ. తేజోవతి