వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పస్ర్తిల రచనల్ని గురించి చెబుతూ, ‘‘స్ర్తి హృదయపూర్వకంగా రాసినదేదయినా ఎంతో పచ్చిగా వుంటుంది. ఆమె ఏదీ దాచకుండా వ్రాస్తుంది. స్ర్తి స్వభావమే అంత, ముద్దుపళని రాధికా స్వాంతనం మొదలు లత ఊహాగానం దాకా, పైగా నారీలోకాన్ని అపార్థం చేసుకుంటే వారి లోకజ్ఞాన శూన్యతకు విచారించాల్సిందే అన్నదంటే ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోవాల్సిందే మరి!
కానీ ఒక్కటి మాత్రం నిజమేమో. ఎంత నగ్న సత్యమైనా చేదుమాత్రకు సుగర్ కోటింగ్‌లా కాస్తంత సుతారపు వల్లెవాటు వేస్తేనే అందంగా వుంటుందేమోనని నా అభిప్రాయం.
లతగారి దృష్టిలో ఆడదాని బలహీనత ఒక్కటే. అది మగవాడిని తండ్రిగా, భర్తగా, బిడ్డగా ప్రేమించకుండా వుండలేకపోవటం. ఆ ప్రేమలోనే తన మీద అధికారం కూడా వాళ్లకే ఇచ్చి చేతులు దులుపుకు కూర్చోవడంలో ఆమె ఆనందం అనుభవిస్తుంది. ఆ నిస్వార్థ ప్రేమా వాత్సల్యం లేకుండా ఆడజాతి బ్రతుకలేదు. దాంతో తనను కట్టే తాళ్ళను తనే తెచ్చుకుంటుంది. ఒకచోట ప్రేమ దొరక్కపోతే దాని కోసం అడ్డదార్లు తొక్కటం కూడా ఆమె బలహీనతల్లో ఒకటి అని వొప్పేసుకుంటుంది.
మనిషికి అంతో యింతో తృష్ణ, అవసరమైనప్పుడు క్రోధం ప్రదర్శించకపోతే ప్రగతి అసాధ్యం అంటూ, ‘‘కామం అంటే ఒక్క శరీర వాంఛే కాదు, కామం అంటే కోరిక. అది లేకపోతే జీవితమే లేదు. ఆశావీధిలో కోరికల్ని ఆకాశవీధిలో గోరువంకలాగా ఎగురవేసుకుంటూ జీవితం గడపడంలోనే ఆనందముంది. ఆనందం వున్నపుడు పాపం వుండదు. అలా అయితే మోక్షకామన కూడా కామమే అవుతుంది గదా అని వాదిస్తుంది’’. పైగా, ‘‘వేదాంతుల దృష్టిలో శరీరవాంఛకు మించిన పాపం లేదు. కానీ శరీర వాంఛలు సృష్టికి మూలమైనప్పుడు మోక్షకారకుడైన జగన్నాధుడు మోక్షదూరమైన కామాన్ని తన సృష్టిలో అంత ముఖ్య విషయం ఎందుకు చేసినట్లు అని నిలదీసి ప్రశ్నిస్తుంది. అయితే ఆమె దృష్టిలో పాపం ఒక్కటే.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

ఎ. తేజోవతి