వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఆ ఆనంద పారవశ్యంలో మనుష్యుల మనస్సులతో ఆడుకోవడం మాత్రమే’’ అని తేల్చేస్తుంది.
లతకు రాధామాధవుని తలిస్తే చాలు, కాలం పరుగులు పెడ్తుంది. ‘‘జలజాతాసన వాసవాది..’’ అంటూ మొదలెట్టి మనల్ని ‘‘ఆ అద్భుత సౌందర్యరాశి సత్యభామాదేవి మందిరంలోకి తీసుకెళ్లి, లతాంతాయుధు కన్నతండ్రి మోకరించిన ఆ సుందర దృశ్యాన్ని ఊహాగానం చేస్తూ, అలాంటి కమనీయ దృశ్యాలు మానసపటంమీద చిత్రించుకోగల్గితే జీవితం ధన్యం’’ అంటుంది.
అంతేకాదు తన ఊహలకు జోడుగా మనక్కూడా ఊహల రెక్కల తగిలించి అవి టపటపలాడించుకుంటూ విహంగమై ఆ బృందావనాంతరసీమల్లో మల్లికానికుంజాల మధ్య విన్పించే మధుర మంజుల మురళీగానాన్ని విన్పింపచేయగల ఉద్విగ్నత ఆమెది. ఆ రాధామాధవుల రాసక్రీడను మన మనోనేత్రం ముందు నిల్పగల ఆ కృష్ణ్భక్తికి ఆమెను ధన్యురాలను చేస్తుంది.
‘‘రేపనునది నీయది గాదీప్రొద్దే నీది’’ అన్న ఉమర్‌ఖయాంను కోట్ చేస్తూ, ‘‘రేపు అన్న విషయం ఆలోచించకుండా ఎంతకాలం జీవించగలం’’ అనే వాస్తవాన్నికూడా గుర్తుచేస్తుంది. కానీ మళ్లీ వేరే ఊహాగానంలో, వెర్రి నిషేధాల సిద్ధాతాన్ని పట్టుకు వేలాడుతూ సెంటిమెంటుకు బానిసలుగా అఘోరిస్తున్న మనం గాలిబ్‌నీ, ఉమర్‌ఖయ్యాంనీ అప్పుడప్పుడూ తల్చుకోకపోతే జీవితం ఇనుప ఖచ్చడం అవుతుందని ఆమె భావన. అలాగే కాశ్మీర దేశపు మహారచయిత్రి హచ్చ్భాటూన్ తీసిన ప్రతి నిట్టూర్పూ ఒక సాహితీ పరిమళంగా కాశ్మీరాన్ని ఆక్రమించుకుందని చెబుతూ ‘‘ప్రేమ, ఆకర్షణ అనేవి బలవంతంతోనూ, మొగమాట పెట్టడంతోనూ దొరకవు. అవి పర్వతంమీద నుంచి ప్రవహిస్తున్న నదిలా దానికది పొంగి రావాలి’’ అంటుంది.
ఆమె ఊహాగానాల్లో ఆదిభట్ల, శ్రీనాధ కవి సార్వభౌముడు, వేమన, బాపిరాజు, సుమతీ శతకకారుడు, శ్రీశ్రీ.. అందరూ దొర్లిపోతారు. శ్రీశ్రీ కవితను గురించి, ‘‘ఒక లక్ష నక్షత్రాల మాటలు, ఒక కోటి జలపాతాల పాటలు ఆయనకు విన్పించి కవిత ఆయన్ను పునీతుడ్ని చేసిందంటూనే, మరొక్కసారి మీ భువనగీతికను శృతి చెయ్యకూడదూ’’ అంటూ అభ్యర్థిస్తుంది
.రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

ఎ. తేజోవతి