వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంచుకుంటున్న చేపపిల్లల ఆహారంకోసం డబ్బు తగలేసే ధనికులతో ‘‘చేపపిల్లల ఆహారంపై చూపే శ్రద్ధను పేవ్‌మెంట్స్‌మీద తిండిలేక పడున్న మనిషి పిల్లలమీద, మీ తోడి జీవులమీదా, తోబుట్టువుల మీదా చూపి దయవుంచండి’’ అని సూటిగా చెప్పడమే కాదు, వ్యంగ్యంగా ‘‘గొప్పవాడైన మనిషెప్పుడైనా నిస్వార్థుడిగానే వుంటాడట. తన జాతి గురించి ఆలోచించేకంటే పిల్లలు మొదలైన ఇతర జాతుల సేవే వారి జీవిత పరమార్థం’’ అంటూ వ్యంగాస్త్రాన్ని సంధిస్తుంది కూడా.
రచనని గురించి చెబుతూ ‘‘రచనకు విశ్వజనీనమైన ప్రేమ ఒకవైపు, మానవుని కృషిమీద అచంచలమైన ఆత్మవిశ్వాసం మరోవైపు కన్పించే ఏ రచన అయినా హృద్యంగా వుంటుందంటుంది. నిజమే మరి. కళ గురించి చెబుతూ, ‘‘సౌందర్యమొక్కటే కళకాదు యదార్థ విషయం ప్రతిదీ కళే. నిజమైన కళ ప్రకృతిలాగానే రసిక హృదయాన్ని ఉయ్యాలలూగిస్తుంది’’ అంటుంది.
పైగా భగవంతుడికి ‘‘డబ్బు పెట్టి గుడి కట్టించి హృదయంలేని బొమ్మగా గుళ్ళో నిలబెట్టినంత మాత్రం చేత మోక్షం రాదేమో. భగవంతునికి కావలసింది ఆయనను అన్నిట్లోనూ చూడగలిగి, అన్నింటినీ అదే గౌరవ భావంతో ఆదరించడం’’ అన్నమాటలు ఎంత చక్కని మాటలు?ఆమె ఎంత కటువుగా ఒక్కోసారి పలుకుతుందో అంత సున్నితత్వమూ వుంది. కన్నకొడుకును మట్టిచేసేందుకు డబ్బులు లేక శవాన్ని ఒడిలో పెట్టుకుకూర్చుని ఏడుస్తున్న దాసీ మనిషి మాతృ హృదయం మీద, వారి దుస్థితిమీద వ్రాస్తూ ‘‘చరిత్రహీనుల అస్తమయాలూ, రాలిపోయే ఆకులూ ఒకటే. ఊడ్చిపారేస్తారు బ్రతికి వున్నవాళ్లు’’ అన్న మాటలు మన గుండెల్ని పిండేస్తాయి.
పసిడిబుగ్గల మిసిమి పసందులు, పసిపాపల పెదవి అంచుల్లోని పాలతుంపర్లను చూపించగల ‘లత’ వరద ఉధృతిలో వున్న కృష్ణవేణమ్మ ప్రళయ భయంకరమైన స్ర్తిమూర్తిని దర్శించిన లత, ఆకర్షణను గురించి చెబుతూ వారి వారికి సరిపడ్డవారు దొరికితే ఆ అదృష్టవంతులు పతివ్రతలుగా, సతివ్రతులుగా వుండగలుగుతారు. ఆ వాంఛా పరిపూర్తికాకపోతే అయ్యేదాకా అనే్వషిస్తారు. వారికి యితరుల మాటలు, అపకీర్తి తృణప్రాయం అని తెగేసి చెప్పిన లత క్రమంగా ఆమె ఊహాగానాల్లో ఒక తాత్వికత, ఒక పరిపక్వత కన్పిస్తాయి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

ఎ. తేజోవతి