వినమరుగైన

సాక్షి( పానుగంటి లక్ష్మీ నరసింహారావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్ల సాహిత్యంలోని సెటైర్సు పోలిన వ్యంగ్య రచనలు. అధిక్షేపవచన కావ్యాలు. ఎక్కువ భాగం ఉపన్యాసాల రూపంలో వున్నాయి కాబట్టి వీటిని ఉపన్యాస వ్యాసాలు అంటే బాగుంటుంది.
పానుగంటివారి సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. అవి వారి అల్లుడు ద్రోణంరాజు వెంకట రమణారావు గారిచేత 1905లో ప్రారంభింపబడ్డ సువర్ణలేఖ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఇవి సుమారు ఇరవై ఎనిమిది వ్యాసాలు. తరువాత రచనకు అంతరాయం కలిగింది. మరల 1920 సెప్టెంబరునుండి రెండు సంవత్సరాలపాటు ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వారం వారం ప్రకటింపబడ్డాయి. ఇవి ఎనభై రెండు వ్యాసాలు. 1922 సెప్టెంబరు నుండి మళ్లీ విరామం. తిరిగి 1927 సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా ఆంధ్రపత్రికలోనే పది వ్యాసాలు మాత్రం వెలువడ్డాయి. 1928 మార్చిలో ఆగిపోయిన రచన 1933 మార్చిలో పునఃప్రారంభమై, ఇరవై వ్యాసాలు వెలువడ్డాయి. తరువాత మరి సాక్షి జాడలేదు. పానుగంటి వారి సాహిత్యంపైన విశేషమైన కృషి చేసి పరిశోధన గ్రంథం వెలువరించిన డాక్టర్ ముదిగొండ వీరభద్రశాస్ర్తీగారు ఈ వ్యాసాలు నూటనలభైగా వక్కాణించారు. పానుగంటివారిని గురించి ఎన్నో విషయాలు చెప్పినవారి కృషి శ్లాఘనీయం.
సాక్షి వ్యాసాలను మొదట ముద్రిపించినవారు పిఠాపురం రాజావారు. తరువాత వావిళ్లవారు వాటిని ఆరు సంపుటాలుగా ముద్రించారు. ఇటీవల అభినందన పబ్లిషర్సు విజయవాడవారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి వ్యావహారిక భాషా పరిచయ వాక్యాలతో మూడు సంపుటాలుగా ముద్రించారు. వీటికి ముందుమాట వ్రాస్తూ, మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారు సాక్షి వ్యాసాలను తెలుగువారి బృహత్యంహితగా కొనియాడారు. అయితే ప్రస్తుతం సాక్షి వ్యాసాల సంఖ్య నూట నలభై ఎనిమిదిగా కనిపిస్తుంది. పత్రికకు సాక్షి పునరుద్ధరణ నిమిత్తం వ్రాసిన లేఖలను కూడా వ్యాసాలు పరిగణించటంవల్ల వివిధ సందర్భాలలో పానుగంటివారు స్వయంగా చేసిన ఉపన్యాసాలను కలపటంవల్ల ఆ సంఖ్య నూట నలభై నుండి నూట నలభై ఎనిమిదికి పెరిగింది.
ఆంగ్ల సాహిత్యంలో మంచి పాండిత్యమున్న పానుగంటివారికి ఎడిసన్, రిచర్డు ష్టీలు అనేవారు వ్రాసిన స్పెక్టేటరు వ్యాసాలు సాక్షి వ్యాసాల రచనకు ప్రేరణ కలిగించాయి. స్పెక్టేటరు కల్పిత వ్యక్తి. అతను స్పెక్టేటరు క్లబ్బు ఏర్పాటుచేసి సమాజంలోని లోపాల్ని వ్యంగ్య ధోరణిలో విమర్శించాడు. పానుగంటివారి సాక్షి కూడా కల్పిత వ్యక్తే. ఇతడూ సాక్షి సంఘం ఏర్పాటుచేసి, సంఘంలోని లోపాలను ఎత్తిచూపాడు.
1913లో సాక్షి సంఘం ఏర్పడ్డది. దీనిలో సభ్యులు అయిదుగురు. సాక్షి, జంఘాలశాస్ర్తీ, కాలాచార్యులు, వాణీదాసుడు, బొఱ్ఱయ్య సెట్టి. సాక్షి సంఘ నిర్మాణం అనేవ్యాసంలో సంఘ నిర్మాణ ఉద్దేశ్యం, సభ్యుల స్వరూప స్వభావాలు వివరింపబడ్డాయి.
సంఘంలో జరిగే అనేక నేరాలకు రాజకీయ దండన ఒకటే సరిపోదు. చాలామంది దాన్నుండి డబ్బుతోనో, తెలివితేటలతోనో తప్పించుకుంటారు.

ఇంకా ఉంది
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పింగళి వెంకట కృష్ణారావు