వినమరుగైన

సాక్షి( పానుగంటి లక్ష్మీ నరసింహారావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథవారి నవలా రచనలో ఈ పోకడ కొంత కనిపిస్తుంది. ఒక సాక్షి వ్యాసాల ప్రేరణతో వచ్చినవి వదరుబోతు వ్యాసాలు. రచయితలు తమ పేర్లు గోప్యంగా వుంచారు. ఒక్క పప్పూరి రామాచార్యుల పేరు వినపడుతున్నది.
తాము ప్రసిద్ధులు కానందువల్ల పాఠకులు నిరాదరిస్తారని శంకో, స్వార్థరాహిత్యమో కారణం కావచ్చు. 1917 నుండి అనంతపురంలో పక్షానికొకసారి ఇవి ప్రచురింపబడ్డాయి. మొత్తం వ్యాసాలు యాభై కాగా ఇరవై రెండు మాత్రం లభించి 1932లో పుస్తకరూపం ధరించాయి. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు దానికి పీఠిక వ్రాశారు. 1920లో ఆంధ్రపత్రికలో పడ్డదాకా సాక్షి వ్యాసాలు ప్రాచుర్యం పొందలేదని వాటిని వదరుబోతు వ్యాసకర్తలు చూడలేదని ఎడిసనే వీరికి ప్రేరణని రాళ్ళపల్లివారి అభిప్రాయం. సాక్షి రచనలో వున్న వేగం పదును వీటిలో లేవు. వదరుబోతు వ్యాసాలు ధ్వని ప్రధానంగా, సున్నితంగా వుంటాయి. ఇవి అంత ప్రజాదరణ పొందలేదు.
పానుగంటివారి జీవిత చరమదశ చాలా దుర్భరంగా గడిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిఠాపురం రాజావారికి వీరిపై ఎందుకో అనుగ్రహం తప్పింది. మామూలుగా ఇచ్చే గౌరవ వేతనం నూట పదహారు రూపాయలు ఆగిపోయాయి. ఆ మహాకవి దుస్థితి ఏమిటో యర్రమిల్లి లక్ష్మీ నారాయణగారు ఆంధ్రపత్రికలో ప్రకటించిన లేఖలోని పానుగంటివారి మాటలే చెబుతాయి.
‘‘నాకెవరూ దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు యాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును’’-
మరొకసారి ఈ దేశంలో కవితా శ్రీనాథునికి ఈ దుస్థితికి పట్టింది.
వీరు 1940 అక్టోబరు 7న స్వర్గస్థులైనారు. ఆధునిక వచన రచనకు మార్గదర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ పానుగంటివారు చిరస్మరణీయులు.

సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పింగళి వెంకట కృష్ణారావు