వినమరుగైన

వదరుఁబోతు (పప్పూరు రామాచార్యులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావున సంఘమునందలి లోపములను వెలికితీయుటయే ప్రధానోద్దేశముగా గల వదరుఁబోతు వ్రాయసగాండ్రకు తమ పేరు మఱుగుంచుకొనుటయే కార్యసాధన మార్గముగా తోచియుండును అని, ఇప్పటికీ అనగా 1932 నాటికి కూడా ఆ వ్యాసకర్తల ఉద్దేశములట్లే యుండుటచే ఇప్పుడును వారి నామములు మఱఉగుననే ఉంచబడినవి. అనగా మొదట వ్యాసములు పత్రికలో ప్రచురించిన పదునాలుగేండ్ల తరువాత కూడా, వ్యాసకర్తలు తమ పేర్లు ప్రకటించుకొనుటకు ఇష్టపడలేదన్నమాట.
పైదానికి కొనసాగింపుగా తెలుపబడిన విశేషాములు మరి కొన్ని గలవు. ‘ఈ వదరుఁబోతు జన్మించినది, పనిచేసినది, సన్యసించినది కూడ అనంతపురమందే. అప్పటికి అనగా 1917, 18 సంవత్సరాలలో అనంతపురం నుందుడినది ఒక్కటే ప్రెస్సు. అది స్వామి విలాస ప్రెస్సు. చేతి డమ్బు ఎక్కువ లేక, అధికారములేమియు లేక యున్న వారు ఆ కాలములో పక్షమున కొకతూరి క్లుప్తముగా నాలుగైదు పుటల వ్యాసములను ముద్రిపించు భగీరథ ప్రయత్నమూ పనిచేసినవారు తప్ప నితరులెరుగలేరు. ఎట్లోకష్టపడి ముద్రిపించి వ్యాసములను కాలణా అనగా కానీకి, అనగా నేటి ఆర నయాపైసల కొకటి చొప్పున వీధిలో అమ్మి పోస్టుకర్చులు పెట్టుకొని బైటకెందరికో ఉచితముగా పంపి, ఎన్నో ప్రతులు తిరిపెము పంచి, సుమారు రెండేండ్లకు మించి దీనిని నడిపి తుదకు సుప్రసిద్ధ కారణములచేత వదరుఁబోతు వాయి అనగా నోరు మూసి కొనినదని వ్రాయుట జరిగినది. ముందు పక్ష పత్రికలలో ప్రకటింపబడినవి వ్రాసినారుగాని, ఆ పత్రికల పేర్లు తెలుపలేదు. కాని పుస్తకమునందలి ఇతర సమాచారమువలన ఆ పత్రిక పేరు సాధన అని తెలుస్తోంది. రెండు వ్యాసములు మాత్రము పినాకినిలో ప్రచురింపబడినవను సమాచారముకూడా వుంది. ఇక ఈ వ్యాసములు ఆగిపోవుటకు సుప్రసిద్ధ కారణములు గలవని వ్రాయడం జరిగింది. ఆ సుప్రసిద్ధ కారణములేమై వుండును. ప్రస్తావనలో వివరింపకున్నను, ఆ కారణములు తెలియుటకు కొన్ని ఆధారములు వ్యాసములలో ఉన్నవి.

ఇంకా ఉంది

బాలేందు శేఖరం యార్లగడ్డ బాలగంగాధరరావు