వినమరుగైన

వదరుఁబోతు (పప్పూరు రామాచార్యులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవి తెలిసికొనుటకు పూర్వము మరి ఒకటి రెండు విశేషములు తెలియవలసి వున్నది. అవి ఏమంటే పత్రికలలో ప్రకటింపబడిన మొత్తము వ్యాసములు ఏబది. కాగా పుస్తక రూపమున సంతరింపబడినవి ఇరువది రెండు మాత్రమే. దానికి కారణములు కూడా ప్రస్తావనలో పేర్కొనిరి. అవేమనగా, కర్తలు స్థలాంతరములకు బోయి కార్యాంతములను జిక్కిపోవుట చేతను, ఒకతూరి వ్రాసి పంచిపెట్టుట చేత, తాము తలపెట్టిన పనియైనదిగావున నీ వ్యాసములను భద్రపరచి యుంచవలసినంత యక్కర వారికంతగా లేకపోవుటచేతను పై వ్యాసములలో ననేకములు దురల్భములైనవని వ్రాయుచు, ఈ ఇరువది రెండు వ్యాసములైనను, వానిని భద్రపరచిన శ్రీ పక్క గురురామాచార్యులవలన లభించినవని వ్రాశారు. మరి తలపెట్టిన కార్యము పూర్తియైనదని భావించినవారు పుస్తక రూపమన ఏల తెచ్చిరను సందేహమును కూడ సమాధానమును వారే ఈ విధముగా సంతరించి యున్నారు. ‘వ్యాసకర్తలుదాసీనముగా నున్నను కాలమెంత మాఱినను ఇంకను ఈ వ్యాసములు చేయవలసిన ప్రబోధ కార్యమునకవకాశము గలదని తోచుటచే దీనిని పుస్తక రూపమున ప్రచురించవలసెను. తక్కినది ‘్భగ్యాయుత మతఃపరం నఖలు తాద్వాచ్యం’ అన్నాడు వేరొక సందర్భమున కాళిదాసు అని ప్రస్తావనను ముగించారు.
ఇది సత్యము. వ్యాసముల స్వభావమును బట్టి, వాని అవసరమింకను, ఇంక మున్ముందును కలదనుట చదువరులకు స్పష్టమగును. ఎవరికైన మిగిలిన వ్యాసములు లభించిన, దయతో ఇచ్చినచో, అవకాశము లభించినప్పుడు చేర్చి ప్రకటింతుమని కూడా వ్రాశారు. కాని రెండవ ముద్రణము నాటికి అనగా 1986 నాటికి కూడ అవి దొరకలేదు. ఇక దొరకనను ఆశయు లేదు.
అది అట్లుండగా, వదరుఁబోతు వ్యాసములు ఆగిపోవుటకు గల సుప్రసిద్ధ కారణాలు గలవని గదా వారు వ్రాసినది. వానిని తెలియుటకై కొంత ఊహపోహ విచారము గావింపనవకాశము గలదు. వానిని విచారించుటకు ముందు ఈ సాధన పత్రికా నిర్వాహకులెవరో తెలియుట అవసరము. ఇప్పటి ప్రచురణమున శ్రీ పప్పూరి రామాచార్యుల ఛాయాచిత్రము గలదని చెప్పటం జరిగినది. వారిపై భక్తితో ద్వితీయ ముద్రణకు కొందరు ధన సహాయం చేసి రామయ్య పద్యాలు పేరుతో శ్రీ రామాచార్యులవారి పద్యాలను, కుంటిమద్ది శేషశర్మగారి పీఠికతో ఈ ద్వితీయ ముద్రణమునకు అనుబంధముగ ప్రకటింపబడినవి చెప్పడం జరిగింది. ఆ పీఠికలో వారు రామాచార్యుల వారిని గూర్చి ఇలా వ్రాశారు. ‘రామాచార్యులు జగమెరిగిన పురుషులు. విజ్ఞానజ్యోతి, వివేకము, నిస్వార్థ రాజకీయ నేతృత నిరర్గళోపన్యాసకత, నిరాఘాట వ్యాసరచన, సాహిత్య విమర్శకత, పత్రికా సంపాదకా గణిత్వము పురాణ పాటవము కలిగి కరుడుగట్టిన వ్యక్తి. వారి వ్యాసములు సాధన పత్రిక ద్వారా ఆంధ్రలోక మెరిగినదే. వారి సంపాదకీయములన్నియు రసతుందిలములే. వదరుఁబోతు వ్యాసములు సారస్వతమున విశిష్టస్థానము నలంకరించినవి. కల్లుపెంటయు మద్య నిషేధ ప్రచారమునకు రంగమెక్కినదే. దీనిని బట్టి తెలుస్తున్న విషయాలు రామాచార్యులవారు గొప్ప సాహితీవేత్త. పురాణములు, కావ్యములు, శాస్తమ్రులు ఔపోసన పట్టిన వ్యక్తి.

ఇంకా ఉంది

బాలేందు శేఖరం పు యార్లగడ్డ బాలగంగాధరరావు