వినమరుగైన

వదరుఁబోతు (పప్పూరు రామాచార్యులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర బృహస్పతిగారి భార్య, తానేమి తక్కువ చదివితినా యని, ఆంధ్ర తార బిరుదమును పూనవచ్చునని వ్యంగ్యముగ నపహసించిరి. ఇక వదరుఁబోతు వ్యాసములు వాయిమూసుకొనెనన్న ఆశ్చర్యపడవలసినదేమ్నుది. ఈ పుస్తక ప్రచురణ నేపథ్యమింతటిది. ఇట్టిది.
ఇక వ్యాసముల విషయము చూతము. అన్నింటికి కాదుగాని కొన్నింటికి వ్యాసభాగములో తాము చర్చించినదానికి సారభూతముగ, ప్రసిద్ధుల వాక్యములను ఉద్ధృతము గావించిరి. అందు కూనలమ్మ పదాలు, వేమన పద్యాలు, భగవద్గీతా శ్లోకములతోపాటు, ప్రసిద్ధ ఆంగ్ల రచయితలు, డేనియల్, సర్ జాన్ లుబ్బోక్, ఫిలిప్ లిట్టన్, ఆడిసన్ మున్నగువారి ప్రవచనములు, మరికొన్ని సుప్రసిద్ధ సూక్తులు గలవు. ఇక వ్యాసములలో తడిమినవి కొన్ని గలవు. వీనివలన రామాచార్యులవారి బహుముఖమైనప్రజ్ఞ, ఆయా రచనలతో వారికిగల గాడ పరిచయము వ్యక్తమగుచున్నవి.
ఇక వ్యాసములు అనేక విషయములకు పరివ్యాప్తమైనవి. వీరి కలము చాలా పదునైనది. అయితే విమర్శ ఎంత ఘాటుగానున్నను, పాఠకుడు లోలోన నవ్వుకొనునట్లు చేయుటతోపాటు, ఆలోచనకు గురిచేయును. ఉహరణకు ఒకచో ట అనగా ప్రకృతమును వదిలి, తమ పాండిత్యమే లోకమునకు మూలాధారముగా భావించు ఛాందసులను విమర్శించిన తీరినట్లున్నది. సృష్టికర్త స్ర్తిలింగము ప్రసాదించియున్నను ‘కళత్ర’ శబ్దమునకు నపుంసక లింగమును దమంత నారోపించి లేని తంటాలు పడుచు వెనె్నమ్ముల కంటులాగు శాస్తమ్రు గుణపాఠము చేసి వైయాకరణులానందింతురట. పెరటి వాకిట పదుగురిలుసొచ్చి యిల్లాలి యోగక్షేమములరయుచున్న గూడ తెలియనేరక వసారాలో జిరిచాపపై గూర్చుండి గుణితము వేయుచు నాకసమున చంద్రుడు విశాఖ కడకేగు కాలము తేలినంత దమ శాస్తమ్రున గాకున్న ప్రపంచమే యుండదని జ్యోతిష్కులు ఆనందము పొందురట. మాకు అది ఇమ్మని, ఇది ఇమ్మని దైవమును ప్రార్థించువారిని గూర్చి, దేవుడు సర్వజ్ఞుడు గదా, నీకేది కావలయునో అతనికి తెలియదా! తిర్యగ్జంతువులు దైవప్రార్థన చేయుచున్నవా అని ప్రశ్నించినారు. అయినను తాను నాస్తికుడను కానని, తెలియని మతములకై, అర్థముకాని గ్రంథముల చదివి లేనిపోని స్వర్గసుఖమునకై అర్రులు సాచుట కన్న మన యింట, మననూర, మన దేశమున, మన సంఘమున, మన జీవితముల నుపయుక్తములుగ జేయుట మిగుల ముఖ్యమని తమ ఆశమును ప్రకటించినారు.
ఇక ప్రస్తుతము వెలువడుచున్న పుస్తకములను గూర్చిన హేళన మొకటి చూడము. పుస్తకము పేరు ఆంధ్ర కాళిదాస ప్రహసనము. రచయిత వృద్ధ సరస్వతి కొండలరాయశర్మ. ఇక అందలి విషయము సూచింపబడిన తీరు. పీఠిక 24 పుటలు, అభిప్రాయములు 24 పుటలు, గ్రంథ విషయము ఏడు పుటలు, ప్రకటనలు 68వ పుట నుండి ఎన్ని పుటలో తెలుపలేదు. ఇక దీనికి అభిప్రాయములిచ్చినవారు ఆంధ్రశుక్రాచార్య, ఆంధ్ర నాటక వృద్ధ పితామహ, చారిత్య్ర మాతామహ, నవలామన్నధ, అవధాని రావణాసుర, వాగ్దేవి భయంకర మున్నగువారు. పెండ్లి శుభలేఖలు ఆడంబరముగా అచ్చువేయించి, వచ్చిన అతిథుల భోజన భాజనములను పట్టించుకోనివారి గూర్చి, నేటి నాటకముల తీరుతెన్నుల గూర్చి విమర్శించిరి.
మరియొక వ్యాసమున, నలుగురు యువకులు, ప్రపంచమున గల ఉత్కృష్టమగు సుఖమును వాంఛించి, దైవమును ప్రార్థింప, అతడు ప్రత్యక్షమై మీ నలుగురికి నాలుగు విధములైన వరములిచ్చుటకు సాధ్యపడదు. అందరును అపేక్షించునది సుఖమే గనుక, మీరందరు కలిసి ఒక్కటే వరమును కోరుకొనుమనగా, అట్లైన తమకు నాలుగు రోజులు గడువడిగిరి. అట్లేయనెను దైవము. అందొకడు ఆరోగ్యము కోరుకుందామని, మరియొకడు ఐశ్వర్యమును కోరుదమనెను.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

యార్లగడ్డ బాలగంగాధరరావు