వినమరుగైన

కొత్త పాళీ ( తాపీ ధర్మారావు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కృత ప్రభావం దానితో ముడిపడి వున్న సామాజిక భావజాలం కారణంగానే ప్రాచీన కాలపు తెలుగు సాహిత్యం నిర్జీవంగా తయారైందని ఆయన నిరూపించారు. వ్యవహారిక భాషావాదానికి రావలసినంత ప్రచారం రాలేదని, సామాన్యులకు కూడా దాని గురించి తెలియడం అవసరమనే భావనతో ప్రత్యేకంగా ఈ రచన చేశానని ముందుమాటలో రాశారు. చిన్న చిన్న వాక్యాలతో గొప్ప భావాలను స్ఫురింపజేయగల నేర్పు వున్న తాపీ వారు ఈ పుస్తకంలో ఇచ్చిన శీర్షికలు, ఉపశీర్షికలు, అర్థవంతంగానూ ఆకర్షణీయంగానూ అమరాయి. రచనాశైలి కూడా చురుక్కుమనిపించుతూ సాగిపోతుంది. పాళీ అన్నా, స్టీలు ముక్క అన్నా, పేనా ముల్కి అన్ని అంతా ఒక్కటే- ఆత్మారాముడిలాగా! దీనినే ఇంగ్లీషులో నిబ్ అంటారు. ఇప్పుడు కొత్తపాళీ అన్నా అన్ని జిల్లాలవారికి ఒక్కలాగా తెలుస్తుందనుకుంటాను అని మొదట్లోనే ఇంగ్లీషు సాయంతో అర్థం వివరించడం ద్వారా ఆయన ప్రజలకు అర్థం కావడం ముఖ్యమనే అంశాన్ని స్పష్టం చేస్తారు. సంప్రదాయ కావ్యాలపై అపారమైన పట్టు వున్న వ్యక్తి గనుక తాపీవారు వాటిలోని పటాటోపాన్ని, అసంబద్ధతను, వైరుధ్యలను శక్తివంతంగా ఎత్తిచూపిస్తారు. సామాజిక నేపథ్యంలో సాహితీ పరిణామాన్ని వివరిస్తారు. మొదట సాహిత్యం ప్రజల భాషలో అర్థమయ్యే విధంగావుండేది. కాని కులీన వర్గాలు, పైతరగతులవారు దాన్ని కృతకంగా మార్చారు. సామాన్యులకు అంతుబట్టని విధంగా సంస్కృత భూయిష్టం చేశారు. అనవసర వ్యాకరణ సూఅతాలలో బంధించి వేశారు. యతి ప్రాసలు అందంగా వుంటాయంటారు. నిజమే కాని వాటికోసం ఎన్ని పాట్లు పడ్డారు? ఎన్ని వ్యర్థ పదాలను తెచ్చి నింపారు? కేవలం వ్యాకరణ అవసరం కోసమే ఒనరన్, గావుత వంటి నిరర్థక పడికట్టు పదజాలం ఎలా పెరిగిపోయింది? అని ప్రశ్నిస్తూ, వీటన్నిటినీ సోదాహరణంగా వివరించారు. కేవలం భాషలోనేగాక భావాలలో కూడా పాండిత్య ప్రదర్శన కోసం ప్రాచీన కవులు అసంబద్ధమైన ప్రయోగాలకు పాల్పడిన తీరును తాపీవారు తూర్పారపట్టారు. అంధానుకరణ కారణంగా నూతనత్వం అడుగంటిపోయిందని తేల్చారు. కుకవి నిందలో పెద్దన పద్యాన్ని ఉదహరించి మార్కండేయ పురాణాన్ని అనుకరించిన ఆయనకే ఇది ముందుగా వర్తింతుందని నిస్సంకోచంగా ప్రకటించారు. భావ వ్యక్తీకరణకు అడ్డుపడే నాలుగైదు సూత్రాలను సవరించుకోకపోవడంవల్ల మొత్తానికే ఎసరు వచ్చిందని ఆయన వ్యాఖ్యనిస్తారు. బెంగాళీలు, తమిళులు, కొన్ని ఇతర దేశాలవారి వలె మనం ముందుగా మేల్కొనక పోవడం తెలుగు వ్యాకరణం ప్రాణంమీదకు వచ్చిందని విచారం వ్యక్తం చేస్తారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

తెలకపల్లి రవి