వినమరుగైన

కొత్త పాళీ ( తాపీ ధర్మారావు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే పురుషుని గురించి చెప్పాలంటే నాలుగైదు మాటల తర్వాత తడుముకోవలసిందే. ఇది నాటి కవుల దృష్టిని ప్రతిబింబించుతుంది. అయితే ఇలాటి అనౌచిత్యాలను సవివరంగా పేర్కొంటూనే తనకు ప్రాచీన సాహిత్యంపట్ల అగౌరవం లేదని, దాన్ని చదవాల్సిందేనని చెప్పడం ఆయన వాస్తవిక దృష్టికి నిదర్శనం. ఉన్నంతలో జాగ్రత్తగా రాసిన కవుల గురించి కూడా ప్రత్యేకంగా తెలిపారు.
సాహిత్యంలో జాతి జీవితం ప్రతిబింబించాలి అనేది ఈనాడు లోకం అంగీకరించిన సూత్రం. ఈ సూత్రానికి అనుగుణంగా వుండాలంటే కవి ప్రజలలో ప్రజలతో బ్రతకాలి. ప్రజల జీవితం గ్రహించాలి. దానిలోని చెడుగును నిర్మూలన చేయడానికి మంచిని పెంచడానికి తన శక్తిని ఉపయోగించాలి. జీవితానికి వికాసం కలిగించాలి. దానిని అభ్యుదయ మార్గంలో నడిపించడం ప్రతి వ్రాతగాడికి ప్రధానమైన పని అని చివర్లో ఆయన ఇచ్చిన సందేశం.తాతాజీ తను చెప్పిన మార్గంలోనే తనే పద్యాలు, గేయం కూడా రాసి జత చేయడం ఈ పుస్తకానికి కొసమెరుపు. ఆనాటికే మహాప్రస్థానం వంటివి వచ్చేసిన మాట నిజమే అయినా సనాతన కాలంలో పుట్టి సాంప్రదాయం నుంచి సంస్కరణ వైపు వచ్చిన తాపీ వంటి వ్యక్తి చెప్పడంలో ఒక ప్రత్యేకత వుంది. ఛందస్సుల సర్ప పరిష్యంగాలు వీడి, నిఘంటవుల శ్మశానాలు దాటి తెలుగు సాహిత్య ప్రస్థానం కదం తొక్కుతున్నదనే సత్యాన్ని ఆయన కవితాత్మకంగా వర్ణించారు.
గొంతులో ఒక యగ్ని
కొత్తగా రగిలింది
తంత్రులన్నీ ఒక్క పుంతలో బడ్డాయి
ఇంతింత అనరాని వింత బలమొచ్చింది
స్వార్థగానము మానరా
ఓ కవీ సార్థకానికి పూనరా!
ప్రజల కవివై గొంతు
రగిలించి పాడితే
బక్కడొక్కలు రేగి ప్రళయ మారుత మట్లు
తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్చి
లోకాల నూగించవా
ఓ కవీ శోకాల తొలగించవా!
ఈ చరణాలతో ముగిసే కొత్తపాళీ నిజంగానే కొత్త గొంతులకు కొండంత బలం చేకూర్చింది. గురజాడ అన్నట్టు భాషలో ప్రజాస్వామ్యం ఆధునిక యుగ లక్షణం. ప్రజాస్వామికవాది, ప్రగతిపథగామి, అనే్వషి అయిన తాపీ ధర్మారావు కొత్తదనాన్ని నిర్వచించి కొత్త భావాలను నిర్దిష్టపరచే కృషి చేయడం సహజ పరిణామమే.
భాషాకోణం నుంచి మాత్రమేగాక పాత సాహిత్యాన్ని సవిమర్శకంగా తెలుసుకోవాలనుకునే వారికి కూడా ఈ గ్రంథం దిక్సూచిగా ఉపయోగపడుతుంది. బ్రతికివుండి చనిపోవడం, చనిపోయి బతకడం అనే ప్రయోగాల గురించి రాసిన తాపీ వారి ఇలాంటి రచనల ద్వారా నిస్సందేహంగా చిరస్మరణీయులుగా వుండిపోతారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సమాప్తం

తెలకపల్లి రవి