వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగుప్త 11 మహారాజు 400 ఎ.డిలో రాజ్యం పరిపాలిస్తున్నపుడు, ఆయన ఆస్థాన విద్వాంసులలో (నవరత్నరము) ఒకరైన ‘అమరసింహుడు’ అనే కవి ‘అమరకోశం’ అనే గ్రంథం రచించారు. ఈ గ్రంథం వెలకట్టలేనిది. దీనిని వ్యాకరణ పరంగా రచించడంవలన దీనిని ‘నామలింగనుశాసనం’ అని కూడా పేర్కొంటారు. దీనిని సులువుగా నోటితో వల్లె వేసేటట్లుగా శ్లోకం రూపంలో రచించారు.
1 శ్లోకం
స్వస్వర్గనాకత్రిదివత్రిదశాలయాః సురలోకో ద్యౌ దివౌ త్రివిష్టపమ్
స్వః- స్వర్గః -నాకః- త్రిదేవః - త్రిదశాలయాః - సురలోకః - ద్యౌః- దేవః- త్రివిష్టపమ్
స్వః= స్వర్గము (స్వః= స్ర్తి, పురుష లింగములో ఉపయోగించినపుడు స్వీయ అని అర్థం, ఇక్కడ స్వః అనునది అవ్యయము అనగా మార్పు లేనిది; స్వర్గః = స్వర్గము, నాకః=స్వర్గము, త్రిదేవః=స్వర్గము, త్రిదశాలయః = స్వర్గము, సురలోకః = దేవతలు యొక్క లోకం (స్వర్గము), ద్యౌః = స్వర్గము, దివౌః=స్వర్గము, త్రివిష్టపమ్ = స్వర్గము. ఇవి అన్నీ కూడా స్వర్గము యొక్క వివిధములైన పేర్లు.
2, 3, 4 శ్లోకాలు
అమర నిర్ఘర దేవా త్రిదశా విబుధా సురాః సుపర్వాణస్సుమనస
స్ర్తిదివేశాదివౌకశః ఆదితేయాదివిషదోలేఖా అదితినందనాః ఆదిత్యా
ఋభవోస్వప్నా అమర్త్యా అమృతానందసః బర్హిర్ముఖాః క్రతుభుజో
గీర్వాణాదానవారాయః బృందారకా దైవతాని దేవతా స్ర్తియామ్
అమర = దేవతలు, మరణం లేకుండా ఉన్నవారు, నిర్ఘర=ముసలితనం లేనివారు, దేవతలు, దేవాః=దేవతలు, త్రిదశః=3న10 దేవతలు, విబుధాః = తెలివిగలవారు, సురాః=దేవతలు, సుపర్వాణః = స్తుతింపబడేవాళ్లు (దేవతలు), సుమనసః=మంచి మనస్సు కలిగినవారు, త్రీదివేశాః = ముల్లోకములను పాలించేవారు, దివౌకసః= ఆకాశంలో నివసించేవారు, దేవతలు; ఆదితేయః = అదితి పుత్రుడు, సూర్యుడు, దివిషదదః దేతవలు, లేఖ = విదియనాడు కనిపించే చంద్రుడు, అదితినందనాః అదితి పుత్రులు, ఆదిత్య = సూర్యుడు, అదితి పుత్రుడు, ఋభ్వ = కోరికలు తీర్చేవారు, దేవతలు; అస్వప్నాః = అ+స్వప్న= లేదు + కలలు = కలలు లేనివాడు, దేవతలు, అమర్త్యాః=అమరులు, దేవతలు; అమృతాందసః = దేవతలు, బహిర్ముఖాః - దేవతలు, క్రతుభుజః = దేవతలు, గీర్వాణః (నిర్వాణ) = శరీరం వదలి వెళ్ళుట, దానవారాయః = దానవ + అరాయ = దానవ + శత్రువులు = దేవతలు, బృందారకాః= దేవతలు, దైవతాః= దేవతలు. ఇవి అన్ని దేవతా గణముల యొక్క పేర్లు.
5వ శ్లోకం
ఆదిత్య విశ్వవస్తుషితా ‘్భస్వరా’నిలా మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ (గణదేవతాః)
ఆదిత్యాః=అదితి సంతివారు, దేవతా సమూహములు, ఇవి 12; విశ్వః=దేవతా సమూహమలు, ఇవి 10; వసవః = దేవతలు, వీరు 8; తుశితాః = దేవతా సమూహములు, ఇవి 36; అభాస్వరాః = దేవతా సమూహములు, ఇవి 64; అనిలాః దేవతా సమూహములు, ఇవి 48; మహారాజీకః = దేవతా సమూహములు; ఇవి 220, సాధ్యాః = దేవతా సమూహములు, ఇవి 12; రుద్రాః = దేవతా సమూహములు, ఇవి 11; వీరందరూ దేవతా గణములు (సమూహములు), స్వర్గలోకమునకు సంబంధించినవారు.
ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152