వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీగవరపు వనజ 7382762152
6వ శ్లోకం

విద్యాధరోప్సరో యక్షరక్షో గంధర్వ కినె్నరాహో / పిశాచో గుహ్యకస్సిద్ధ్భోతో (అమి దేవయో నయః)
వీరు అందరూ దేవతలకు జన్మించినవారు.
విద్యాధర= కళ్ళకు అంజనం రాసుకునేవారు (ఉదా: జీమూతవాహనుడు మొదలగువారు), అప్సరః= అప్సరసలు, ఊర్వశి, మేనక మొదలగువారు; యక్షః = యక్షులు, కుబేరుడు మొదలగువారు; రక్షః = లంకాపురిలో నివసించేవారు, (యక్షులు సృష్టికర్తను భక్షించుదామని అనుకున్నారు, రక్షులు రక్షిద్దాం అనుకున్నారు. కాలక్రమేణా రక్షులు రాక్షసులుగా మారిపోయారు; గంధర్వులు=సంగీతకారులు (ఉదా: తుంబురుడు); కినె్నరులు = అశ్వముఖం గలవారు; పిశాచాలు= దుష్టశక్తులు; గుహ్యకులు=నిధి రక్షకులు (ఉదా:మణి, భద్ర మొదలగువారు); సిద్ధః=సిద్ధులు (ఉదా:విశ్వవసువు); భూతః=్భతములు (దా:రుద్రులు); వీరందరూ గంధమాదన పర్వత ప్రాంతము (దీనినే హేమకూట పర్వత ప్రాంతముగా కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో హేమకుండం అనే సరస్సు ఉన్నది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని గడవాల్- హిమలయము అంటారు. ఇవి ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఉంది. బద్రినాథ్ గుడి ఈ ప్రాంతంలో వున్నది) నివశిస్తున్నారని పురాణాలలో చెప్పబడింది. బ్రహ్మ మనస్సులో నుంచి ఒక సరోవరం పుట్టింది. దాని పేరే ‘మానస సరోవరం’. అందువలననే అది చాలా పవిత్రమైనది. విద్యాధరులు, కినె్నరులు, అప్సరసలు మొదలగువారు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ సరోవరంలో జలక్రీడలు ఆడుతారని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు కూడా చాలామంది యాత్రికులు చూశామని చెప్తున్నారు. ఐతే వారి రూపము మానవులకు కనిపించదు. వెలుగు కిందికి దిగుతున్నట్టు కనిపిస్తుంది అని, జలకాలు ఆడుతున్నట్టుగా చప్పుళ్ళు వినిపిస్తాయని, వెలుగు తిరిగి పైకి వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నదని చెప్తారు.
7వ శ్లోకం
అసురా దైత్య దైతేయ దనుజెంద్రారి దానవాః శుక్రశిష్యా దితిసుతాః పూర్వదేవాస్సురద్విషః
అసురాః= రాక్షసులు; దైత్యాః=దితిపుత్రులు; దైతేయః=దితి వారసులు; దనుజాః = రాక్షసులు; ఇంద్రారయ = ఇంద్ర+అరయ = ఇంద్రుని యొక్క శత్రువులు (అరయ = శత్రువు), రాక్షసులు; పూర్వదేవాః = (పూర్వ=ముందు), దేవతల కంటే ముందు పుట్టినవారు(రాక్షసులు); సురద్విషః దేవతల శత్రువులు (ద్విష=శత్రువులు), రాక్షసులు. ఇవి అన్నీ రాక్షసుల పేర్లు.
8,9,10 శ్లోకాలు
సర్వజ్ఞ స్సుగతో బుద్ధ ధర్మరాజస్తతాగతః / సమస్త భద్రో భగవాన్మారజిల్లోక జిజ్జినహా / షడభిజ్ఞో దశబలోద్వయవాదీ వినాయకః మునీంద్ర / శీఘ్రనః శాస్తామునిః శాఖ్యమునిస్తు యః / స శాఖ్య సింహః సర్వార్దసిద్ధః శౌద్ధోదనిశ్చ సః / గౌతమశ్చర్కబందుశ్చ మాయాదేవిసుతశ్చ సః
సర్వజ్ఞః=అన్ని తెలిసినవాడు, సుగతః=అన్ని తెలిసినవాడు, బుద్ధః=బుద్ధుడు, అన్ని తెలిసినవాడు; ధర్మరాజు = న్యాయానికి రాజు, తథాగత= అన్ని తెలిసినవాడు, సమస్త్భద్రః=అందరినీ బాగా చూసుకునేవాడు; భగవాన్ = దేవుడు, అన్ని తెలిసినవాడు; మారజిత్ =(మార) చావుని (జిత్) జయించినవాడు; లోకజిత్=లోకాన్ని జయించినవాడు; భగవాన్ = దేవుడు, అన్ని తెలిసినవాడు, జినః=అన్నీ తెలిసినవాడు; షడభిజ్ =షడ్ +అభిజ్ఞ=ఆరు జ్ఞానములు కలవాడు, బుద్ధుడు; దశబలః=10 శుక్తులు కలవాడు; అధ్యాయవాది = మొదటినుంచి చివరివరకు అన్ని తెలిసినవాడు; వినాయకః దారిచూపేవాడు; మునీంద్ర= ముని +ఇంద్ర = ఋషిలలో గొప్పవాడు; శ్రీఘనః =బుద్ధుడు; శాస్తముని = మంగళకరమైన ముని; శాఖ్యముని=శాఖ్య అనే ఆదివాసి తెగకు చెందిన సన్యాసి (వీరు ఇక్ష్వాకు వంశ వారసులు); శాఖ్యసింహ= శాఖ్య తెగ సింహము; సర్వార్ధసిద్ధ = అన్నీ తెలుసుకున్నవాడు; శౌద్ధోదని = శుద్ధోదనుని పుత్రుడు; గౌతమ=గౌతమడు, గౌతమ అనేది ఇంటి పేరు; ఆర్కబంధు=సూర్యుని (ఆర్క) యొక్క చుట్టము (బంధు); మాయాదేవిసుత = మాయాదేవియొక్క పుత్రుడు. ఇవి అన్నీ బుద్ధదేవుని యొక్క, జిన (విష్ణువు భగవాన్ రిషభదేవ్‌గా అవతరించి జైన మతం స్థాపించాడు) యొక్క వివిధములైన పేర్లు. జ్ఞానోదయం కాక ముందు బుద్ధ భగవానుని పేర్లు గౌతమ సిద్ధార్థ, శాంఖ్యముని, సిద్ధార్థ అంటే జ్ఞానము కలిగినవాడు.
ఇంకా ఉంది