వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుసుమేషు= కుసుమముల (పువ్వుల) బాణములు కలిగిన వాడు, కామదేవుడు; అనన్యజ = అనన్య +జ= తనకు తానుగా + జన్మించినవాడు = పూల ధనస్సు పట్టుకున్నవాడు, కామదేవుడు; రతిపతి = రతి+్భరత = కామదేవుడు ; మకరమ ధ్వజ = మకర+్ధ్వజ = మకరం అనే చేప +జండా, జెండా పై చేపబొమ్మ కలిగిన వాడు, కామదేవుడు; ఆత్మభూః= ఆత్మ+్భః = స్వయం+ జన్మించుట = స్వయంగా జన్మించుట , కామదేవుడు ; మకరం అనగా మొసలి అని అర్థం, ఇక్కడ మకరం అనేది ఒక అందమైన చేప పేరు, గ్రీకు పురాణాల్లో కామదేవుని ‘‘ఈరోస్’’ అని పశ్చిమ దేశాలో ‘‘క్యూపిడ్’’ అని పిలుస్తారు.
23 శ్లోకం
అరవింద అశోకమ్ చ చూతమ్ చ నవమల్లిక
నీలోత్పలం చ పఞ్చతే పంచబాణస్య సాయకః॥
అరవిందం= కలువ; అశోకం = అశోకం; చూతమ్ = మామిడి; నవమల్లిక = మల్లె పూలు; నీలోత్పలం = నీలం, కలువ; పంచై; ఈ ఐదు రకముల పూలు; పంచబాణః= ఐదు బాణములు! సాయకః= ప్రేమికుల మీద ఎప్పుడు వదలబడేటట్టు తయారుగా ఉంటాయి. వీటిని కామదేవుని యొక్క పూలబాణాలు అని చెప్తారు.
24 శ్లోకం
ఉన్మాదనస్థాపనశ్చ శోషణ స్తంభనస్థ
సమ్మోహనశ్చ కామాశ్చ పంచబాణః ప్రకీర్తిదాః॥
ఉన్మాదం= ప్రేమలో బాధపడుట; తాపం = శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధపడుట, శోషమ్= స్పృహ తప్పుట; స్తంభనం= స్తంభించుట; సమ్మోహనం= వశీకరించుట; కామ= కోరిక; ప్రకీర్తి= తెలియచెపుట; ఈ కోరిక యొక్క 5 బాణములు, ప్రేమను తెలియ జేస్తాయి. ఇవి కామదేవుని యొక్క భౌతిక బాణములు
25 శ్లోకం
బ్రహ్మసుర్విశ్వకేతుః స్యాదనిరుద్ధ ఉషాపతిః॥
బ్రహ్మసు= బ్రహ్మ+సు= బ్రహ్మ+కొడుకు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్న (కృష్ణ, రుక్మిణీ దంపతుల పుత్రుడు, కామదేవుని అవతారము) ని పుత్రుడు, అతని సార్దక నామము బ్రహ్మసు, విశ్వకేతు= అనిరుద్ధుడు పట్టలేని పరాక్రమవంతుడు అతను అన్ని విషయములలోనూ శ్రీకృష్ణునితో సమానమైన వాడు, అందువలన అనిరుద్ధుని విశ్వకేతు (విశ్వా న్ని పాలించేవాడు) అని పిలుస్తారు. స్యాద = వేగవంతమైన వాడు; అడ్డులేనివాడు, ఉషాపతి= ఉషా+పతి = ఉష (బాణాసురుని కూతురు) యొక్క పతి
26 శ్లోకం
లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా
ఇందిరా లోకమాతా మా క్షీరోదతనయా రమా
భార్గవి లోకజననీ క్షీరసాగర కన్యకా॥
లక్ష్మి= విష్ణుదేవి యొక్క దేవేరి, లక్ష్మీదేవి ఐశ్వర్యమునకు , అదృష్టమునకు శ్రేయస్సునకు దేవత; పద్మాలయ= పద్మ+లయ = పద్మ+నివాసం=, పద్మము పైన కూర్చుండుట, లక్ష్మి; పద= ఒక చేతిలో కమలము పట్టుకున్న లక్ష్మీదేవి, కమల= పద్మము వంటి ముఖము కలిగిన లక్ష్మీదేవి; శ్రీహరిప్రియ= శ్రీహరి+ప్రియ = విష్ణువు + ప్రియురాలు = విష్ణువు యొక్క ప్రియురాలు, ఇందిర =అందమైనది, సూర్యుని లాగా వెలుగు కురిపించేది, లక్ష్మీదేవి, మా = తల్లి , లక్ష్మీదేవి; క్షీరోదతనయ= క్షీరోద + తనయ= పాలసముద్రము+ కూతురు = పాల సముద్రం యొక్క కూతురు.
..ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152