వినమరుగైన

మహాప్రస్థానం -శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక అడుగు ముందుకేయ్’’ అన్న గురజాడ ప్రేరణ శ్రీశ్రీ కాలాన్ని పూర్తిగా ఆవహించింది.
‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్’’ అన్న గురజాడ హెచ్చరిక శ్రీశ్రీ యుగాన్ని ‘‘మందగించక అడుగు ముందుకు వేసేట్లు’’ చేసింది. అందుకే శ్రీశ్రీ మందగించిన దేశాన్ని;
పదండి ముందుకు / పదండి త్రోసుకు /పోదాం పోదాం పైపైకి- అంటూ హృదయాంతరాళం గుర్జిస్తూ గుండెలు నెత్తురులు తర్పణ చేస్తూ మరో ప్రపంచానికి మహాప్రస్థానం సాగించారు.
ఎముకలు కుళ్లిన / వయస్సు మళ్లిన / నెత్తురు మండే / శక్తులు నిండే / సైనికులారా రారండి-
మందగించే వారిని వెనక్కి నెట్టేస్తూ, నెత్తురు మండే విప్లవశక్తుల్ని ఆహ్వానిస్తూ తెలుగు కవి సమయానికి కొత్త శీర్షికనిచ్చాడు శ్రీశ్రీ. ఆ శీర్షిక ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు కవిత్వానికే కాక సమస్త సాహిత్యానికీ తరతరాల సాహిత్య శీర్షిక అయింది.
‘‘మరో ప్రపంచం / మహా ప్రపంచం / ధరిత్రి నిండా నిండిన’’ విప్లవాల యుగం-
ఇరవయ్యవ శతాబ్దాన్ని ఆవహించింది- ఆ మేరకు పీడితులు తాడితులు బాధాసర్పదష్టులు తిరుగుబాటును జీవిత విధానం చేసుకున్నారు.
ప్రతి ఛాందస యజ్ఞోపవీతం వైప్లవ్యగీతంగా మారుతూ, అనలవేదిక ముందు అస్రనైవేద్యంగా పరిణతి చెందుతూ స్మరిస్తే పద్యంగా సాక్షాత్కరించే చైతన్యాల యుగసంధి ఆ కాలం.
అందుకే ప్రతి సంస్కారీ ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతీయడానికీ, విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారపోయడానికీ, భువన ఘోషకు వెర్రి గొంతుకలిచ్చి మ్రోగడానికీ సిద్ధపడ్డాడు. ప్రతి సామాన్యుడూ భువన భువనపు బావుటాగా పైకి లేవడానికి సిద్ధపడ్డాడు.
మహాప్రస్థానం కవి సమయంగా రూపొందిన నాడు జగమంత బలివితర్దిగా మారింది. నరజాతికి పరివర్తన అనివార్యమైంది. నవజీవన శుభ సమయం, అభ్యుదయంగా రంగప్రవేశం చేసింది. పుడమితల్లి పురుటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. పుడమికీనాడే పుట్టినరోజుగా సమస్త ప్రపంచంలో జ్వాలాతోరణం విస్తరించిన విక్రాంతివేళ మహాప్రస్థాన యుగ సందర్భం.
‘‘ప్రపంచమొక పద్మవ్యూహంగా’’ కనపడిన కాలంలో మహాప్రస్థాన భావజాలం, ‘‘కవిత్వమొక తీరని దాహం’’గా నినాదాన్ని చేబట్టి మొత్తం కవితా ప్రపంచానే్న పునర్నిర్విచించింది.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)
*
- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -

-జ్వాలాముఖి