వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

56,57,58,59 శ్లోకములు
అగ్ని వైశ్వానరో వహ్ని ర్న ర్వీతృహోత్రో ధనంజయః
కృపీటయో నిజ్వలనో జాతవేదాస్త నూనపాత్
బర్షిః సుష్మా కృష్ణ వర్మా శిచిశే్కష ఉషర్బుధః
ఆశ్ర్యాశో బృహద్భానుః కృశానుహు పావకణాలః
రోహితాశ్వో వాయసఖః శిఖావానషుక్షణిః
హిరణ్యరేతా హుభుగ్ దహనో హవ్యవాహనః
సప్తార్చిర్దమునాః శుక్త్ర శ్చిత్రభానుర్విభావసుః
శుచిరప్పిత్తవౌర్వస్తు వాడవో వాడవానలః
అగ్ని= నిప్పు, అగ్ని బ్రహ్మ నుదురు నుంచి జన్మించినట్టు కథక సంహితలో మైత్రేయ సంహితలో చెప్పబడింది. అతనే పరబ్రహ్మ స్వరూపమని అతనితో వెలుగు, పగలు, రాత్రి ఏర్పడ్డాయి; వైశ్వానరో= అంతా నిండి ఉన్నవాడు, అగ్ని; వహ్ని= హోమం ను అందుకునేవాడు , అగ్ని; వితిహోత్ర=్భక్తులను పవిత్రుని గావించేవాడు, అగ్ని; ధనంజయ= ఐశ్వర్యం ను గెలిచేవాడు, అగ్ని; కృపీటయోని= దివ్యమైన జలం యొక్క పుత్రుడు, అగ్ని; జ్వలన = మెరుస్తున్నవాడు, మండుతున్నవాడు, అగ్నిః= జాతవేద=అన్ని జన్మల జ్ఞానం కలిగినవాడు, అగ్ని; తనునాపత్ = స్వంతముగా సృష్టించబడ్డ వాడు, అగ్ని;
బర్షి= పాకాడేవాడు, అగ్ని; సుషమ=అన్నిటిని తగ్గించేవాడు, అగ్ని; కృష్ణవర్మ = నల్ల(కృష్ణ) పొగను ఉత్పత్తి చేసేవాడు. అగ్ని; శోచిస్కేశ= శోచిస్ +కేశ= పొగ జుట్టులా కలిగినవాడు, అగ్ని; ఉసూర్బుః= ప్రతి గృహంలో ఉదయం జ్వలించేవాడు అగ్ని; ఆశ్రస్య== తనతో ఉండే ప్రతి వస్తువును దహించేవాడు, అగ్ని,; బృహత్భాను=వెలుగును సృష్టించినవాడు, అగ్ని కృష=క్షీణించేవాడు, అగ్ని పావక= శుద్దిచేసేవాడు, ఈ పేరుగల పుత్రుడు కలిగినవాడు ,అగ్ని; అనల= 8 వసువులలో ఒకడు, అగ్ని ; రోహితాశ్వా = రోహిత+అశ్వ = ఎరుపు+ అశ్వము= ఎరుపురంగు అశ్వం కలిగినవాడు, అగ్ని; వాయుసఖా= వాయు +మిత్రుడు= వాయువుమిత్రుడుగా కలిగినవాడు, అగ్ని; శిఖావన్ = జ్వాలలు ముడులుగా కలిగినవాడు, అగ్ని; అశుశుక్షని= ఎండబెట్టేవాడు, క్షీణించేవాడు అగ్ని; హిరణ్యరేత= హిరణ్య+రేత= బంగారు+బీజం =బంగారు బీజం కలిగినవాడు అగ్ని; హుతాభుక్= నైవేద్యములు, బలి స్వీకరించేవాడు, అగ్ని;
దహన =అన్నిటినీ దహించేవాడు అగ్ని; హవ్యవాహన== హవ్య+వాహన= దేవతలు సమర్పించే నైవేద్యమలు+ అందించుట = దేవతల నైవేద్యములను అందచేసేవాడు అగ్ని; సప్తార్చి =సప్త +అర్చి= 7+నాలుక (జ్వాల)= 7 జ్వాలలు, అవి కాళి, కరాలి, మనోజవ, సులోహిత (ఎక్కువ ఎరుపు) సుదూమ్రవర్ణ( ముదురు ఎరుపు) స్పులింగిని (అగ్ని మెరుపులు ,అగ్ని కణములు) విశ్వదాస, అగ్ని;దమున = శుద్దముగా ఉండేవాడు అగ్ని; శుక్ర = శుచి గలవాడు అగ్ని; చిత్రభాను= వెలుగుతో నిండినవాడు ,అగ్ని; విభావసు= అగ్ని; శుచి=అన్నిటిని శుభ్రం చేసేవాడు, అగ్ని; అపపిత్త= జాలం లో పిత్తస్వరూపంగా ఉండేవాడు, అగ్ని; ఔర్వ= సముద్రం అడుగున అగ్ని; బడబ= సముద్రములో ఉండే అగ్ని; బడబానల= సముద్రము నుండివెలువడే అగ్ని జ్వాలలు.
60 శ్లోకం
వహ్నెర్ద్వ యోర్జ్వాలాకీలావర్చిర్హైతిః శిఖాః స్ర్తియామ్
త్రి స్ఫులింగగోగ్రికణః సంతాపః సంజ్వరః సవౌ॥
వహ్ని= మంట, జ్వాల = మంట, ద్వయో = వహ్నిలో కానీ, జ్వాలలోకానీ ఏదైనా ఒకటి, కీల = మంట, అర్చి = మంట, ఇవి అన్నీ 5 విధములైన మంటలు ; స్ఫులింగ = నిప్పురవ్వ, ; అగ్నికణాః=అగ్ని కణములు; ఇవి 2 రకముల నిప్పు రవ్వలు; సంతాప= వేడి, ప్రకాశము (మిణుగురులు = వేడి లేకుండా ప్రకాశిస్తాయి) ; సంజ్వర = వేడి జ్వరము ; ఇవి 2 విధములైన వేడి
ఇంకా ఉంది

- తీగవరపు వనజ, 7382762152