Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళిపెద్దలం
*
-షణ్ముఖశ్రీ-
*
సంతానలక్ష్మి: నిల్చోవాల్సిన పని లేకుండా వచ్చి కూర్చోగలిగాం! ఏమి జనం ఏమి జనం.
సంతోషరావు: అవును మరి. ఎవరికైనా పంచాంగ శ్రవణం అంటే ఇష్టమేగా. తమ తమ రాశిఫలాలలు తెలుసుకునేందుకు నాస్తికులు, ఆస్తికులు, ఆస్తులున్నవారు అవస్థలు పడుతున్నవారు, ఎన్నికల్లో ఇరుక్కుపోయినారూ ఒకరేమిటి? అందరూ వస్తారు. స్వార్థమే పరమార్థం కదా! అందుకే ఆదుర్దా అందరిలోనూ వుంటుంది.
సంతానలక్ష్మి: అరుగో పంచాంగం చదివే ఆయన పంచెకట్టుతో, మీసకట్టుతో వేదిక గట్టెక్కాడు.
పంచాంగం: చదివే ఆయన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
సంతోషరావు: ఈయనెవరోగానీ ప్రార్థనను క్లుప్తంగానే ముగించాడు.
సంతానలక్ష్మి: వచ్చిన వాళ్ళంతా వాళ్ళ రాశిఫలాల విషయంలో ఎంత టెన్షన్ పడుతుంటారో ఆయనకు బాగా తెలుసు. ఇంతకూ ఆయన రాశి ఏమిటో! ఆయన కాస్త టెన్షన్ పడుతున్నట్లే వున్నారు.
సంతోషరావు: మనం ఇలా కొట్టుకు చస్తున్నాంగాని, దేవుని దృష్టిలో అందరూ సమానమేగా! పాపం ఈ పంచాంగం చదివే ఆయనమటుకేం చేయగలడు. ఎంతటివారైనా ఆ తొమ్మిది గ్రహాలూ, ఆ పనె్నండు రాశులమధ్యా నలగాల్సిందే కదా!
పంచాంగం: ఈ వికారినామ సంవత్సరంలో మేషం నుండి మీనం వరకూ
చదివే ఆయన : రాశిఫలాలు.
సంతానలక్ష్మి: అబ్బాయిదే రాశి.
సంతోషరావు: అరవకు. అందరూ నిశ్శబ్దంగా ఆయన చదివది వింటున్నారు. మనం కూడా విని ముచ్చట్ల కుంపట్లు పెట్టుకుందాం. (పంచాంగకర్త చదివే రాశి ఫలాలు వినవస్తుంటయ్)
సంతానలక్ష్మి: తొందరగానే ముగించాడు. ఇక పోదాం. అన్నట్లు మరిచాం, మన అబ్బాయికి సంబంధం చెప్పే ఆయన వస్తాడన్నారుగా!
సంతోషరావు: అవునవును వస్తానన్నాడు. పద పద వెళ్దాం.
దృశ్యం-7
సంతానలక్ష్మి: ఆటోవాడు ఆ వీధులూ, ఈ వీధులూ తిప్పి మనల్ని అల్లకల్లోలం చేయకుండా జాగ్రత్తగానే ఇల్లు చేర్చాడు. అతనెవరో మనింటి మందు అటూ ఇటూ తిరుగుతున్నాడు.
సంతోషరావు: (్భయం భయంగా) ఆ! ఆ! అయనే సంబంధం చెబుతానన్నాయన.
సంతానలక్ష్మి: అంత మెల్లిగా, నీరసంగా చెబుతారేమండీ. త్వరగా తలుపు తీసి, లోపలికి తీసుకెళ్దాం. కాఫీ ఇచ్చి సంబంధం విషయం కూపీ లాగుదాం.
సంతోషరావు: ఆ! ఎవరు?
క్లేశవరావు: ఆ! నేనేనండీ కేశవరావును. ఇందాకటినుండీ రింగిస్తూనే వున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అందుకని ఎకాయకీ ఇంటికే వచ్చాను.
సంతోషరావు: (్భయపడుతూ లోపల్లోపల) అసలే వీడి దృష్టి మంచిదికాదని మోహనరావు చెప్పాడు. పండగరోజు వీడు మనింట్లో పాదం పెట్టడం కూడా అంత మంచిది కాదు. వీడితో బయటనే మాట్లాడి పంపించేస్తాను.
(పైకి) ఇదుగో నినే్న. తాళం తీసుకొని నువ్వు లోపలికెళ్లు. మేమిద్దరం అలా బయటకు వెళ్ళొస్తాం.
సంతానలక్ష్మి: (తనలో) ఏమిటో ఈ పిచ్చిమేళం. నాకెందుకు నేను తలుపు తీసుకొని లోపలికెళ్తాను.
(తలుపు తీసి లోపలికెళ్లిన చప్పుడు)
సంతోషరావు: రండి కేశవరావుగారు. మనం అలా చల్లగాలికి నడుస్తూ మాట్లాడుకుందాం. కొన్ని కొన్ని విషయాలు ఆడవాళ్ళ ముందు మాట్లాడకూడదు. ముఖ్యంగా పెళ్లి సంబంధాల వంటివి అసలే పనికిరాదు. అందుకే మిమ్మల్ని ఇలా బయటకే తీసుకువచ్చాను. మరోలా అనుకోకండి.
క్లేశవ రావు: మీరు చెప్పింది నిజమే. మరేం ఫరావాలేదండీ.
సంతోషరావు: కొంచెం కాఫీ ఏమన్నా త్రాగుతారా! అదుగో ఇక్కడే టీ బంకు ఉంది.
క్లేశవరావు: అబ్బే ఏమొద్దండీ మాట్లాడుకుందాం.
సంతోషరావు: రాశీఫలాలు విందామని గుడికి వెళ్లి వచ్చాం. మీకు బాగా ఆలస్యం అయినట్లుంది. చెప్పండి.
క్లేశవరావు: అమ్మాయి వాళ్లింటి పేరు రెటమతంట. సిగపట్ల గోత్రంట. మీకు బాగా సరిపోతుంది. మీ ఇంటి పేరు సతమతం కదా. మీది చిటపట గోత్రంట కదా.
సంతోషరావు: అరే ఆశ్చర్యంగా ఉంది. మాగ్రోత నామాలన్నీ మీకెలా తెలిశాయి. ఈ మధ్యనేగా మీరు నాకు పరిచయం అయింది.
(ఇంకాఉంది)
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.