వినమరుగైన

మహాప్రస్థానం -శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిలేదీ కదిలించేదీ/ మారేదీ మార్పించేదీ
పాడేదీ పాడించేదీ/ పెనునిద్దర వదిలించేదీ
మున్ముందుకు సాగించేదీ/ పరిపూర్ణపు బ్రతుకునిచ్చేదీ
కావాలోయ్ నవకవనానికి
పాత పద్ధతులు కల్పనలు, కవి సమయాలు పదబంధాలు ప్రసంగితను కోల్పోయిన కాలంలో కొత్తదనాన్ని ఇంజెక్ట్ చేయాల్సిన నెత్తురు కవి సమయం కావాల్సి వచ్చిన యుగ సందర్భంలో మహాప్రస్థానం ‘నవ కవిత’ను యుగ చైతన్యంగా నిర్వచించింది.
ప్రాణవంతమైనదే కదులుతుంది- అలా ప్రాణవంతమైన పీడిత జాతి కదలి చరిత్రను సృష్టిస్తున్న విప్లవాల యుగాన్ని మహాప్రస్థానం ఆవహించుకొని సమాజాన్ని జీవితాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మార్పించే మహాశక్తిగా తాను ముందు మారి ప్రపంచాన్ని మార్చడానికి ప్రబోధగీతంగా వచ్చింది.
గతాన్ని ఇంకా ఇంకా కౌగలించుకొని పురావైభవాల్ని పాడే ప్రాణరహిత సాంప్రదాయాన్ని పుటం పెట్టి పెను నిద్దర వదిలించేదిగా, మునుముందుకు సాగించేదిగా కవితా ప్రయోజనాన్ని ఎలుగెత్తి చాటింది మహాప్రస్థానం- అంతవరకు వచ్చిన కవిత్వం తన చుట్టూ తాను తిరిగి జీవితాన్ని వికలాంగంగా మార్చి కరుణను శాపగ్రస్తంగా స్వీకరించింది- శృంగారాన్ని జాఢంగా అనుభవించింది- హాస్యాన్ని కుసంస్కారంగా అభినయించింది. ఈ నేపథ్యాన్ని చూపిన మహాప్రస్థానం ‘‘పరిపూర్ణపు బ్రదుకిచ్చే’’ కవి సమయం కోసం ఉద్యమించింది- తెలుగు కవిత్వంలో తనకు తానుగా తన కలాన్ని కూడా వెంట నడిపించడానికి ఉద్యమించిన కవితావేశం మహాప్రస్థానం. దాని ఆదర్శం ‘పరిపూర్ణపు బ్రతుకు’ అంతవరదాకా కవిత్వం పాక్షిక బతుకునే రసనిర్దేశం చేసింది. వికలాంగంగా కవిత్వాన్ని ఏకపక్ష రస నిష్పత్తిగా వుంచేసింది.
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పలుకవలె’’నన్న గురజాడ తన స్కంరణవాద యుగ పరిమితిని దాటి చెప్పలేకపోయిన దాన్ని విప్లవాల యుగంగుర్తించి కవిత్వ లక్షణం మానవుడి ‘పరిపూర్ణపు బ్రతుకు’ను ఈయడంగా భావించి ఉద్యమించింది- చైతన్యం దాని స్వభావమైంది. మార్పు దాని లక్ష్యమైంది- ముందుకు సాగడం దాని ఉద్యమమైంది. ‘పరిపూర్ణపు బ్రతుకు’ దాని స్థారుూ భావమైంది.
ప్రపంచ పద్మవ్యూహాన్ని చేదించడానికి తీరని కవిత్వ దాహం ఒక దీర్ఘకాలిక యుద్ధమైంది. ఈసంస్కారం ఇరవయ్యవ శతాబ్దపు విప్లవాలకు బావుటాగా నిలిచింది. స్వార్థపరులు కృత్రిమంగా గీసుకున్న అన్ని రకాల ఎల్లలు సంఘటితపడితే శ్రామిక శక్తుల విప్లవాలతో నేలమట్టం అయ్యాయి.
అందుకే ఈ ప్రపంచ విప్లవ చైతన్యం మహాప్రస్థాన నిబద్ధతలో
నా గీతం ఏయే శక్తులలో ప్రాణ స్పందన పొందిందో?
అంటూ నిరాశోపహతుల్లో ప్రాణస్పందన కలిగించింది.
‘‘్భకంపాలూ, ప్రభుత్వ పతనాలూ, విప్లవం, యుద్ధం, అన్నీ మహాప్రస్థాన చైతన్యంగా పీడిత వర్గాల విముక్తి యుద్ధాల్లో విశ్వరూప సాక్షాత్కారంగా వీరావేశం చెందాయి.
మహాప్రస్థానం బోల్షివిక్ విప్లవం కలిగించిన సాహిత్యం చైతన్యం- మార్క్సు స్వప్నం, లెనిన్ తపస్సు, స్టాలిన్ సేద్యం కలగలసిన విప్లవ యుగ సంస్కారం మహాప్రస్థానం- అది పీడిత జాతి విముక్తి గీతం- కవిత్వ అభూత కల్పనల రోగం నుండి బయటపడ్డ ఆరోగ్య చైతన్యం-
అంతవరకు కవిత్వం అదృష్టవంతుల్ని మాత్రమే పట్టించుకుంది. శాపగ్రస్తుల్ని, పీడితుల్ని, తాడితుల్ని, ప్రాచీన స్మృతులూచే శిశువు చిత్రనిద్రల్ని, రోగార్తుని రక్తనాళ సంస్పందనల్ని త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనల్ని, కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షసరతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవుల్ని, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యాల్ని, సమ్మెకట్టినకూలీల, వారి భార్యాబిడ్డల ఆకలి చిచ్చుల్ని, హాహాకారాల్ని, ఆర్తారావాల్ని పట్టించుకొని మమేకం చెంది, లక్ష నక్షత్రాల మాటలతో, కోటి జలపాతాల పాటలతో, శతకోటి సముద్ర తరంగాల మ్రోతలతో అమోఘ మగాధ చింత్య, మమేయం, ఏకైకంగా సాహిత్య ప్రపంచం ముందు కవితా సంస్కారంగా ముందుకు తెచ్చిన 20వ శతాబ్దపు ఏకైక సంఘీభావ తాదాత్మ్యం మహాప్రస్థానం. నభూతో నభవిష్యతి మహాప్రస్థానం కవిత్వానే్న ‘పునీతం’ చేసిన యుగచైతన్యం-
మహాప్రస్థానం ఘోషవల్ల విలాపాగ్నులకు, విషాదాశ్రులకు కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ కవి సమయాలయ్యాయి. సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు, శ్రామిక జీవ సౌందర్యం కవి సంస్కారాలుగా అభివృద్ధి చెంది కొన్ని తరాల్ని కవిత్వీకరించాయి.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)
*
- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -

-జ్వాలాముఖి