వినమరుగైన

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ 8897853339
*
ఏ.వి.రావు:మాక్కూడా చాలా ఆనందంగా వుంది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు మీరు దొరకడం మా అదృష్టం. మా సినిమా ఆరంభమైనట్లే.
హీరో: మీ సినిమా ఆరంభం కావడం మంచిదే. కానీ ఇంతటితో మమ్మల్ని వదిలేయండి. మీ సినిమాలో మమ్మల్ని మాత్రం హీరో, హీరోయిన్లను చేయకండి. ఆ బాధలు మేం పడలేం. మమ్మల్ని ఇలా బ్రతకనీయండి.
జయరావు: మీరేం బాధపడనక్కర్లేదు. మా సినిమా కథలో వెనకటి విషాద చిత్రాల్లోలా బాధలు పడటాల్లాంటివేమీ వుండవ్. మానసిక సంఘర్షణ అనేది అసలే ఉండదు. ఆరంభం నుంచీ అంతం దాకా ప్రేమించుకోవడమే ప్రేమించుకోవడం. నేటి తరానికి కావాల్సింది ఇటువంటి కథే కదా!
ఏ.వి.రావు: మా సినిమా అయ్యేంతవరకూ హాయిగా ప్రేమించుకొంటూనే వుండొచ్చు. మా చిత్రం రిలీజు కాగానే పేరు ప్రఖ్యాతులతో మంత్రులు, పురప్రముఖుల సమక్షంలో రాజదర్బారు సెట్ వేయించి మీ పెళ్లి మేమే ఘనంగా జరిపిస్తాం. ఆ ఖర్చంతా మాదే! ఊ.. అనండి. మీరొప్పుకుంటే మా సినిమా టాపే. లేకపోతే మాకు రొప్పే. ఒప్పేసుకోండి. కాదనకండి ప్లీజ్.
హీరో: ఇంతకూ కథేంటి?
ఏ.వి.రావు: వెరీ సింపుల్. హీరో బీదవాడు. అతని పేరు నోఇస్ర్తి. అంటే ఉతికిన డ్రెస్సువేసుకుంటాడు. డబ్బున్న హీరోయిన్‌తో పరిచయం అయ్యాక హైక్లాసు డ్రస్సుల్లో క్లాసుగా ఉంటాడు. హీరోయిన్ పేరు నోవస్ర్తి. నేటి ఫ్యాషన్‌కు తగినట్లుగా వంటికి అంటీ అంటనట్లుగా వుండే డ్రెస్సు వేసుకుంటుంది. అందువలన వస్తమ్రే ధరించని స్ర్తిలా, సమ్మోహనాస్త్రంతో కుర్రకారును వెర్రెత్తించేలా మెరిసిపోతుంటుంది.
జయరావు: అబ్బ చెప్పావురా!
ఏ.వి.రావు: ఇంకేమీ ఆలోచించకండి. ఒప్పేసుకోండి.
హీరో: మీ పిక్చర్ని ఎప్పటిలోపల పూర్తిచేసి ఎపుడు రిలీజు చేస్తారు.
జయరావు: ఎప్పుడు రిలీజైతే మీకేమిటండీ! అప్పటిదాకా మీకు ప్రతిరోజూ వాలంటైన్స్ డే.
ఏ.వి.రావు: ఇంకా ఏమిటి మీ డౌట్.
హీరో: ఏం లేదు. మీ పిక్చర్ ఆలస్యిమైతే జూనియర్ హీరో వెలుగులోకొస్తాడు. అపుడు మీరు మమ్మల్ని వదిలేసి టీవీ సీరియల్‌లాగా వాడితో సినిమా తీయాల్సి వస్తుందేమో?
జయరావు:ఓ అదా! మీ అనుమానం.
హీరోయిన్: అది అతని అనుమానం. నా అనుమానం చెప్తా వినండి. మాకు అడ్వాన్స్ ఎంతిస్తారు? ఎప్పుడిస్తారు? అగ్రిమెంట్ అనేది వున్నదా? అసలు మీ పిక్చర్ బడ్జెట్ ఎంత? మిగతా నటీనటులెవరు? డైరెక్టర్ ఎవరు? ఇవన్నీ ఏం చెప్పకుండా వుంటే ఎలా?
ఏ.వి.రావు: ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు ఇప్పటివరకు పార్టీయే దొరకలేదు కదా!
హీరో: ఏ పార్టీ?
హీరోయిన్:రాజకీయ పార్టీనా?
జయరావు: డబ్బు పెట్టే పార్టీ. మిమ్మల్ని వాళ్ళకు చూపించి, కథ వినిపించి, వాళ్ళు ఓకె అని డబ్బివ్వగానే మీకు అడ్వాన్స్ ఇస్తాం.
హీరో: అమ్మో! చాలా పెద్ద ప్రాజెక్టేనే! మేమే హీరో, హీరోయిన్లమంటూ మమ్మల్ని కూడా పార్టీలను వెతుకుతూ పార్కుల్లోనూ, పేవ్‌మెంట్స్‌పైన తిరగుతుండమంటారా!
హీరోయిన్: మీ బాధ మాకర్థమైంది. మీ బొకే తీసుకెళ్లి ఆ కొట్టువాడికి ఇవ్వండి. సగం డబ్బొస్తుంది. తీసుకొని వెళ్ళండి.
సెనక్కాయలవాడు: సెనక్కాయలండీ! సెనక్కాయలు! బాబూ తీసుకోండి!
జయరావు:మధ్యలో వీడొకడు. వద్దు, వద్దు. వెళ్ళు.
సెనక్కాయలవాడు: నేనిప్పుడొచ్చింది సెనక్కాయలు అమ్ముకోడానికి కాదు. ఆ అబ్బాయిని, అమ్మాయిని ఆపి మీ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేయడానికి వచ్చాను.
ఏ.వి.రావు:ఎవరు నువ్వు? ఏమిటిదంతా!
హీరో: మీరు మీరు ఏమన్నా చేసుకోండి! మేం వెళ్తున్నాం!
హీరోయిన్: ఇదుగో మీ బొకే!

(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.