వినమరుగైన

మహాప్రస్థానం -శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని ఉద్యమాల్ని సాహిత్య గౌరవం పొందేలా అనివార్యం చేశాయి.
మలయమారుతాలు మారిన సందర్భాల్లో కొత్త కవిసమయాలయ్యాయి.
బాటసారి కళేబరంలో
శీతవాయువు ఆడుకుంటుంది
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలించింది-
ఇదివరకు కేవలం శృంగారానే్న చిత్రించే మలయమారుతం ఇక్కడ జీవిత విషాదాన్ని బొమ్మ కట్టించింది.
దారిపక్క చెట్టు కింద
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసల్దొకతి
(దిక్కులేక మరణిస్తే)
ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళ్లిపోయింది
ఎముక కొరుక్కుంటూ
ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుకు
తొందరగాతొలగె తొండ
కమ్మె చీకట్లు దుమ్మురేగే అంతలోన
‘‘ఇది నా పాపం కాద’’ని
ఎగిరివచ్చె ఎంగిలాకు
దోపిడీ సమాజంలో బాల్యానికి తగిన రక్షణ పోషణ వుండదు. యవ్వనానికి ఆదర్శం క్రమశిక్షణ లభించవు- వృద్ధాప్యానికి విశ్రాంతి, గౌరవం దొరకవు- వర్గ సమాజపు విస్మృత జీవుల గురించి అంతఃకరణతో ఆత్మనివేదనం చేసిన అభివ్యక్తి మహాప్రస్థానం, భిక్షువర్షీయసీ, ఆత్మలోకం దివాలాను సంస్కృతి డొల్లతనాన్ని ముందుకుతెచ్చిన సాహితీ సంస్కారం- ముసలితనం గురించి మహాప్రస్థానం ఎంతగా వాపోయిందో శైశవగీతంలో బాల్యం గురించీ అంతే ఆర్ద్రతను ప్రదర్శించింది మహాప్రస్థానం.
పాపం పుణ్యం ప్రపంచ మార్గం
కష్టం సౌఖ్యం శే్లషర్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా!
శే్లషార్థాలు తెలియని బాల్యాన్ని శే్లషార్థాలతో చెలరేగే వర్గ సమాజం చివరకు ఎంత అవినీతిమయంగా మారుస్తుందో మహాప్రస్థానం పూర్వరంగాన్ని ఆత్మీయంగా చెప్పింది.
బాల్యాన్ని పోగొట్టుకున్న మనుషులు, యవ్వనాన్ని బలిపెట్టుకున్న దౌర్భాగ్యులు, వృద్ధాప్యాన్ని వీధిన విడుచుకున్న పరాజీవులు,
‘‘బ్రతుకుఛాయ చదువుమాయ
కవిత కరక్కాయ సుమీ’’
అంటూ స్వగతాల్లో స్రుక్కిపోతూ దిక్కులేని దీనులగాథల్ని తెరచి ముందుకు తెచ్చి సోకాల్డు సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తుంది మహాప్రస్థానం. వారికి జీవితంలో ప్రతి సంఘటనా సంధ్యా సమస్యే. ‘‘అవతలిగట్టు’’కు చేరలేరు- వారి బాల్యం, యవ్వనం చూడకుండానే నేరుగా వృద్ధాప్యంలోకి విసిరివేయబడుతుంది. దీపం ఆరిపోతుంది.

-సశేషం

--జ్వాలాముఖి