వినమరుగైన

మహాప్రస్థానం -శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరం కలిసి చేసిన
ఈ అందమైన వస్తు సముదాయం అంతా
ఎక్కడో ఒక్కడేవచ్చి ఎత్తుకుపోతూ వుంటే, చూచి
‘‘అన్యాయం, అన్యాయం’’ అని మేమంటే
‘‘అనుభవించాలి మీ ఖర్మం’’ అంటాడు- దోపిడీదారు
‘‘కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
లోకం మిధ్యనేవాళ్లను నిలదీసిన జ్ఞానచక్షువు కూడా మహాప్రస్థానం-
ఇరవయ్యవ శతాబ్దం దాకా సాగిన సమస్త రుగ్మతల్ని ప్రశ్నించి పరాస్తం చేసి సర్వరోగ నివారిణిగా మహాప్రస్థానం సామాన్యుల హక్కుల్లో హక్కుగా నిలిచింది-
పాలికాపు నుదుటి చెమటను పరిమళంగా, కూలివాని గుండె చెరువును దోపిడీ గుండె బరువుగా, బిచ్చగాని కడుపు కరువు వర్గ సమాజం జారే పరువుగా మహాప్రస్థానం పర్జన్య శంఖం పూరించింది.
మంచికీ చెడుకీ నడుమ
కంచుగోడలు నిర్మించిన వారిని
నిశ్చల నిశ్చితాలుగాను వడ్డించిన విస్తరి జీవితాలుగానూ రేఖ చెదిరితే గొల్లుమనే భీరువులుగానూ, రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు మీసాలు దువ్వుతున్నట్లుగానూ శత్రుపక్షాన్ని స్పష్టం చేసి సామాన్యుల పక్షాన నిలిచి సిద్ధాంత ప్రకటన చేసింది మహాప్రస్థానం
మాకు గోడలు లేవు
గోడలు పగులగొట్టటమే మా పని
అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి
తిరుగుబాటు మా వేదాంతం-
పీడితుల పక్షాన నిలిచి పోరాట ప్రకటనా పత్రాన్ని ప్రకటించిన సిద్ధాంతవేత్త మహాప్రస్థానం.
అభిప్రాయాలకోసం
బాధలు లక్ష్యపెట్టనివాళ్లు
మాలోకి వస్తారు
అభిప్రాయాలు మార్చుకొని
సుఖాలు కామించేవాళ్లు
మీలోకి పోతారు
అవకాశవాదుల్ని కూడా యుద్ధరంగ నిర్మాణంలో భాగంగా ప్రకటించిన యుద్ధ తాంత్రికుడు మహాప్రస్థానం. అనేక భాషలు మాట్లాడేవారిని, అనేక స్థలాలలో తిరిగేవారిని అవిభక్త కుటుంబిగా ఏకరక్త బంధువుగా సంబోధించి ‘‘ప్రపంచ పీడిత మానవులలారా ఏకంకండ’’ని ఘోషించిన పీడిత జనపక్షపాతి మహా మహాప్రస్థానమే.
నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే మంచి కాలం వస్తుందా?
సాధు సత్వపు సోదరత్వపు సా
దుతత్త్వం జయిస్తుందా?
కురుక్షేత్రంలో అర్జునుని విషాదయోగం లాంటిదీ ప్రశ్న పరంపర? అయితే తానే శ్రీకృష్ణుడై సమాధానం చెప్పుకున్నారు.

-సశేషం

-జ్వాలాముఖి