వినమరుగైన

ఆంధ్ర పురాణము -మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా రాజవంశాలూ, వివిధ రాజ చరిత్రలూ అనగానే పట్ట్భాషేకాలు, వివాహాలు, దండయాత్రలు, కవిగాయక చత్ర శిల్ప కళాపోషణలు, అగ్రహారాది దానాలు, ఇష్టదేవతాలయ నిర్మాణాలు, ఆయా దేవతల ఉత్సవాలు వంటివి దాదాపు- అంతటా పునఃపునఃపునరుక్తములై ఉంటూంటాయి. అందువల్ల వాటి వార్తాప్రకటన మాదిరిగా తేదీలవారీగా చరిత్రను ఏకరువు పెట్టడం కాకుండా - ఆది నుంచి, విజయరాఘవ నాయకుని వరకు- ఆయా ప్రముఖ వంశాల, ప్రముఖ పాలకుల జీవితాలలోని విశిష్టమనదగిన ఘట్టాలను మాత్రమే ప్రధాన సూత్రంగా గ్రహించి- మధునాపంతులవారు ఈ కావ్యంలో ఉత్కంఠనీ, వైవిధ్యాన్నీ నిలిపారు. ఈ పద్ధతి అనుసరించడానికి ఆయనకు ప్రేరణ, కాళిదాస మహాకవి, రఘువంశ కావ్యరచన. ఈ విషయాన్ని ఉదయపర్వ పర్వాంత పద్యంలో సూచించారు.
ఆంధ్రపురాణంలో శాస్ర్తీగారు తాను చిత్రించదలచిన ప్రతి ఘట్టాన్నీ చారిత్రక దృష్టితోనే చూశారు. ఆయా రాజుల జీవిత చరిత్రల కథనానికే ప్రథమ స్థానమిచ్చారు.
ఉదయపర్వం- ఆంధ్రజాతి మూలాలను అనే్వషించిన సందర్భం అలా వుంచితే- శాతవాహన పర్వంలో దీపకర్ణికథ; గుణాఢ్యునితో శర్వవర్మ వివాదం లో శాతవాహన పాత్ర; చాళుక్య పర్వం లో నన్నయ భారతావరణం, కాకతీయ పర్వంలో రుద్రమ, వీరప్రతాపరుద్ర దేవుల చండ ప్రచండ ఘట్టాలు, విద్యానగర పర్వంలో విద్యానగర సామ్రాజ్య స్థాపన, బుక్కరాయల పరిణత జీవనం, నాచన సోమన కవి ప్రసక్తి; శ్రీకృష్ణదేవరాయ పర్వంలో శ్రీకృష్ణదేవరాయల పట్ట్భాషేకం; ఇంతకుముందే విద్యానగర పర్వంలో ప్రౌఢ దేవరాయల ముత్యాలశాలలో శ్రీనాథ కవి సార్వభౌముని కనకాభిషేకం; విజయపర్వంలో భువన విజయ విశేషాలూ; నాయకరాజ పర్వంలో రఘునాథ నాయకుడు చేసిన మూడు ఉత్కృష్ట కార్యాలు; విజయరాఘవ నాయకుని నిరతాన్నదాన వ్రతం- అనే పనె్నండు ప్రధాన చారిత్రక సందర్భాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. ఆయా వంశాలలో ఇతర పాలకులకు సంబంధించి అవసరమైనంత వరకు క్లుప్తంగా, వార్తామాత్రంగా ప్రస్తావించి మధునాపంతులవారు విడిచిపెట్టారు.
ఏ తరహా కావ్యంలోనైనా సరే నాలుగు ముఖ్యాంశాలను కవి నిర్వహించవలసి వుంటుంది. 1.కథనం, 2.వర్ణనం, 3.పాత్ర చిత్రణం, 4.మనోధర్మ చిత్రణం. పాత్ర చిత్రణం బాహ్యవర్ణన చేస్తే, కథన భాగం బాహ్యమైన అమరిక, భాష, పద్య నిర్మాణ దక్షత చెపుతుంది. ఎటుతిరిగీ వర్ణనం, మనోధర్మ చిత్రణం- అనే రెండు ప్రత్యేక సామర్థ్యాలు ఒక కవి నుంచి మరొక కవిని విడదీసి సత్తాను నిరూపింపజేస్తాయి. ఈ రెండింట కూడా మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు ప్రత్యేక వ్యక్తిత్వం నిలుపుకొన్న కవి.

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ