వినమరుగైన

నూతిలో గొంతుకలు -ఆలూరి బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతటా మరుభూమి, అంతా ఒక వేస్ట్‌లాండ్. మోసం, ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచిన మందారాలు కనిపించని ఒక యంత్ర నాగరికతా యుగం. జీవితాలు బతుకులయి ఛాయల అవమానాల మధ్య మనిషి మనిషిగా మనలేని భయంకర వాతావరణంలో మనిషి దుఃఖానికి మూలకారణం అనే్వషించాలన్న తపన అనాది తత్వవేత్త గౌతముని తలపింపజేస్తుంది. అందుకే ‘నాక్కొంచెం నమ్మకమివ్వు’ అంటూ తోవ ఎక్కడ సోనియా అంటూ ఆమెని వేడుకుంటూ కొంచెం నమ్మకమిస్తే ఒకటేమిటి ఏమైనా చేస్తాను అంటాడు. నందనికుంజాల్లో అమృతఫలాలు పూయిస్తాను కాయిస్తానును అంటూ ఆవేశపడిపోతాడు. ఈ కవి కూడా అప్పటి కవులందరిలాగా ఒకానొక సుదూర స్వప్నాన్ని చూస్తున్నట్టే కనిపిస్తుంది కానీ అంతమాత్రం చేత అది ఒక ఇజానికి కట్టుబడినట్లనిపించదు. ఎందుకంటే జీవితం ఏ ఇజానికీ కట్టుబడదు గనుక అతను ఆ రహస్యాన్ని ఎరిగినవాడు గనుక.
విశ్వసాహిత్యంలోని మూడు ముఖ్యమైన పాత్రలతో మమేకమై ఆవిష్కరించిన నూత్న సంవిధాన కావ్యం నూతిలో గొంతుకలు విశేషఖ్యాతిని తీసుకువచ్చింది. అంతటా మానవుని ఆత్మ సంశయ వేదన. అదే నూతిలో గొంతుకలై వినిపించీ వినిపించకుండా వినిపిస్తుంది. వినిపిస్తున్నట్లనిపిస్తుంది. ఎందుకంటే వారు అభిశప్తులై నహుషులు గనుక. వారు పిలుస్తారు మాట్లడతారు కానీ బైట వ్యక్తులకు వారి పిలుపు ఎక్కడ్నించో దూరంగా అనిపించి అభిప్రాయం స్పష్టంగా అందదు. ఆ పిలుపుల్లో నిజాయితీ వున్నా బలహీనత కప్పేస్తుంది. అభిప్రాయం స్పష్టంగా అందదు. ఆ పిలుపుల్లో నిజాయితీ వున్నా బలహీనత కప్పేస్తుంది. స్వయంగా కవి కూడా గర్వాంధతవల్ల అభిశప్తుడైన నహుషుడా అనిపిస్తుంది.
సంక్లిష్టమయిన ఒక సామాజిక రాజకీయ పరిస్థితిని కళాత్మకం చేసేందుకు మరింత సంక్లిష్టమయిన పాత్రలు అవసరమయ్యారు. వీరు విశ్వ సాహిత్యంలోని పాత్రలయిన హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్. హామ్లెట్‌ది కర్మకు పూర్వమైన సందిగ్ధత, రాస్కల్నికోవ్ కర్మానంతర సందేహస్థితి, వ్యక్తిగత స్వేచ్ఛ వుందనుకుంటున్న సమాజంలో వ్యక్తిగతం సామాజికం ఎలా అవుతుందో చెబుతాడు.
సృష్టిలో అత్యంత శక్తిమంతుడైన మానవుడు స్వేచ్ఛగా, సంతోషంగా తోటి మానవుని పట్ల నమ్మికతో అక్కరతో జీవించటం లేదని ఆవేదన పడుతూ అందుకే కొంచెం నమ్మకమిస్తే పరమ శివుని శూలాగ్రాన తలకిందులుగా నిలబడతాననీ కాలుని మీద కలబడతాననీ ఈ సువిశాల బ్రహ్మాండాన్ని చాపగా చుట్టేస్తాననీ ఇంకా ఏమేమో చిన్నపిల్లల్లా అంటాడు ఒకానొక భావావేశంలో. కానీ ఆ భావన మనకి కన్నీళ్లయి కమ్మేస్తుంది.
నిజమైన కళాకారులందరిలా అతడు కూడా చీకటి నుంచి వెలుగుకు చేసే ప్రయాణానే్వషణలో అర్ధాయుష్కుడైపోయాడు. నూతిలో గొంతుకలుకి వ్రాసిన తొలిపలుకు ఈ తుది వాక్యంతో ముగించాడు. ‘‘నేను చెప్పవలసింది ముగిసిందనుకుంటాను. ఇక వుంటాను’’. బహుశా కవి క్రాంతదర్శి అనటానికిది నిదర్శనం.
ఇక బైరాగి శైలీ సంగతుల మీంచి ప్రయాణిస్తే అసలు ఆ శైలిని చూసినపుడు ఆ శైలితో మమేకమవుతూ అటు కొండలూ ఇటు లోయలూ అంతటా పచ్చిక బయళ్లూ ఆ నేపథ్యంలో విషయాన్నీ, శైలినీ విడదీయటం వీలుపడక ఒక కొండను దట్టమైన మేఘం కమ్మిన అనుభూతి కలుగుతుంది. ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే శైలి, అక్కడక్కడ దేవభాషా పారిజాత పదపరిమళం కమ్ముకుంటుంది. అయితే ఆ పదబంధాలు మన మనసుకేమీ అడ్డుపడవు సరికదా అర్థాన్ని తెలుసుకోవాలన్న ఆశను కలిగిస్తాయి. ఎందుకంటే అది డాండ డడాండడాండ నినదంబులదరగా వట్టి పాండీ ప్రకర్ష కాదు గనుక ఆ కావ్యమంతా హృదయపు అలికిడి కనుక. ఒక్కోసారి జలపాతవేగం ఒక్కోసారి సెలయేటి సవ్వడి, ఒక్కోసారి నిర్వేద నదీ, నిశ్చలత, నూతిలో గొంతుకలు ముందుమాటలో కవి ‘స్వయంగా ఏ కృతైనా దేనికదే భాష్యం, కావ్యం తనంతటతాను వెలువరచలేని అర్థాన్ని ఏ భాష్యకారుడూ వెలువరచలేదు. కావ్యం స్వయంసిద్ధ, దానికి ఏ భాష్యకారుని చేయూతా అనవసరం, పోతే భాష్యకారుడు అపరిణితీ పాఠకులకు సహాయకారి కావచ్చు. సాధారణార్థాలను బోధించవచ్చు. అదే మరో మాట ఎప్పుడో ఒకప్పుడు వయసులో వున్నపుడు ఎక్కడో ఒక కవిత చదివి భావం తెలియకపోయినా కాలక్రమేణా గ్రహించాడట. అటు తర్వాత అతని మనసులోని వేనవేల రేఖలలో ఛాయలలో మెల్లమెల్లగా చెదరివున్న అర్థాలను చేర్చాడట.

-సశేషం

-శివలెంక రాజేశ్వరీదేవి