వినమరుగైన

నూతిలో గొంతుకలు -ఆలూరి బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పక్క వినాశనం మరో పక్క కర్తవ్యం అర్జునుని సంశయగ్రస్తం చేస్తాయి.
‘‘బతుకు చీలుబాటమీద నిలబడి వున్నాను నేను.
ఎటుబోతే వల్లకాడు ఎటుబోతే పూలతోట’’
అనుకుంటున్న అతనిది సమస్త మానవజాతిని గురించిన కవిత.
నిరాశాంధకారంతో మొదలైన కావ్యం ఏదో ఒక దివ్యమైన వెలుగులో అన్ని శాపాలూ తొలగిపోతాయన్న ఆకాంక్షతో అంతమవుతుంది
రాస్కల్నికోవ్ దాస్తవిస్కీ నేరం శిక్షలో నాయకుడు. ఒక సంశయజీవి అతను. కుదువవ్యాపారం చేసుకుంటున్న ఒక ముసలావిడను అర్థోన్మాద దశలో చంపి దాన్ని సమర్థించుకునేందుకు యమయాతన పడతాడు. పశ్చాత్తాం కంటే మించిన మానసిక వ్యధ అనుభవిస్తాడు. ఒక స్నేహిత సోనియా ముందు అతని పశ్చాత్తాప నివేదన అన్ని కవితా నిబంధనల్ని విదుల్చుకున్న ఒక జలపాతశైలి. అనితర సాధ్యమైన సన్నివేశ శైలి ఇది. ఒకానొక అపురూప కవితాత్మక భావ చిత్రణం మన కళ్లముందు అతని వేడికోలు ఒక దృశ్యమై వెంటాడుతుంది. ముక్తిబోధ్ చిత్రాల్లోని ఒక కరుణ రసాత్మక స్వగతం. హృదయాన్ని పట్టి విడవని ఒక భావన.
జీవన సమరంలో ఈ మూడు పాత్రల నేపథ్యంలో ఎందరెందరో మెదులుతారు మనలో, స్వయంగా బైరాగి కావచ్చును. మీరు కావచ్చు. నేను కావచ్చు. జీవితాన్ని పట్టి చూపే ఈ మాటలు- జీవిత మిట కామాతుర కరాళ కంకాళా కేళి, ప్రేమేతర మృతి కాతర కాపాలాల కృపణధూళి. జీవితమిట భీభత్సవోత్సాహ ప్రేతహేల, రుధిర మధువు గ్రోలి సోలి దైత్యుల మత్తిలిన లీల జీవితమిట. సమ్మర్ధం, సంఘర్షం, సంక్షోభం అంటూ మానవబుద్ధి హృదయం మేధ జ్వలిస్తున్నాయంటాడు. కవితాంశ తాత్త్వికాంశ కలిసి చెప్పటం అతని ప్రత్యేకత. హామ్లెట్ స్వగతంలో ఒక చోట కత్తిరించిన ఒత్తులే వెలుగుతాయి. దివ్యంగా బాధాదగ్ధ కంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా అని మానవుడు అడుగు తీసి అడుగు వేసి వెళ్లేలోపున మొదలు మర్చిపోతుంటాడు. తోవ ఎక్కడ అని అడుగుతూ సోన్యాను-
దనుజహస్తపు దీర్ఘరేఖవలె పరచిన రాచబాటలు
సందుగొందుల మారుమోగే తాగుబోతుల వెకిలిపాటలు
జీవితానికి వేయి నాల్కలు లక్ష చీల్కలు కోటికోరలు
తోవతప్పిన నరుని హృదయం ఎక్కడున్నది
అంటూ ఒక అధివాస్తవ చిత్రాన్ని కళ్లముందుంచుతాడు. ప్రయోగాలూ పదచిత్రాలూ గాఢతా అనే్వషణ వీటన్నిటి వెనకా తారాడుతూ అంతటా చీకటి నేపథ్యం శూన్యమైన మానవ జీవితయాత్రకు సంకేతమయిన చీకటి బతుకు నల్లని కుబుసాన్ని ఇదిగో ఇలా పట్టుకున్నాడు.
‘‘అంధకార సాగరాన పయనించిన ఓడ గురుతులుండవు
వల్లకాటి మునివాకిట నాటిన మొక్కలు పండవు
చివరికి చీకటొకటే చలనం లేదు చీకటికి’’
అదీ సంగతి.
నిజమైన కళాకారుల జీవితాలు రాలని కన్నీటి బిందువులనీ, జీవితం స్వయం జ్వలిత హారతి కర్పూరమనీ అంటాడు చండీదాస్, అనీ పాపం ఆవేదనల అనంతంలో అంతమైనాడు.
ఒంటరిగా ఒంటరిగా నీడలవాడనున్న మోడులాగ మ్రోడుల నీడనున్న నీడలాగ తోవ మరచిన ప్రేతంలాగా దిక్కులేని కుక్కలాగ తిరుగుతున్నా తిరుగుతున్నా చీకటిలో చీకటిలో.
సాంఘిక జీవి అయి వుంటే మనిషి ఒంటరిగా వున్నానన్నా మానవుని విషాదకర అనుభూతికి మూలమేమిటి?
వ్యాపార నాగరికతలో వాస్తవ జీవితాల వైరుధ్యాల కారణంగా మానవుల మధ్య సంబంధాలు వారి చైతన్యంలో వక్రంగా రిఫ్లెట్ అవుతాయి. మానవుడు తాను పరిసర ప్రపంచం నించి వేర్పడిపోయానన్న భావనకి లోనవుతున్నాడు. దీన్ని పాశ్చాత్య తత్త్వవేత్తలు ‘్ఘజళశ్ఘఆజ్యశ’ అని అన్నారు. శ్రీ బి.రామచంద్రరావు వివరంగా రాసిన ఒక వ్యాసంలో ‘‘ఈ కావ్యం నేటి పెట్టుబడిదారీ సమాజంలోని మానవుని ఆవేదనతో కవి తాదాత్మ్యం అన్నమాట నిజమే. చిత్తశుద్ధి కల కవి కనుక అతడు దాన్ని అద్భుతంగా చిత్రించాడు. కానీ ఆ ఆవేదనకు తాత్వికుడుగా బైరాగి భాష్యం తప్పు. సత్యమైన హృదయానుభూతిని సత్యవిరుద్ధమైన తాత్విక చింతనతో రంగరించిన కవిత అయినందున పాఠకుడ్ని తికమక పెట్టే పరస్పర వైరుధ్యాలు ఇందులో ఉండటం సహజం అంటూ ఒకానొక చారిత్రక వాస్తవాన్ని (అప్పటికి నిజమైనది) గుర్తించ నిరాకరించాడని అభిప్రాయపడతారు బైరాగి అవతలి పార్శ్వాన్ని మనకి చెపుతూ-
బైరాగికి సైద్ధాంతిక దృఢత్వమే వుంటే అతడు కోరిన ‘ఒక కిరణం ఒక కాంతిక్షణం’ అతని జీవితాన్ని వెలిగించి వుండేవని ఏమయినా తెలుగు కవితారంగంలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న కవి బైరాగి అని అభిప్రాయపడతారు. చీకటిమూలాల అనే్వషణలో బైరాగి గందరగోళపడిపోయారని అంటారు.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-శివలెంక రాజేశ్వరీదేవి