వినమరుగైన

పెనే్నటి పాట -విద్వాన్ విశ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తమండలాలుగా పిలవబడే రాయలసీమ జిల్లాలు విజయనగరంలో రాజుల కాలంలో వైభవంగా వెలుగొందేవి. విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా అలలారుతూ ఉండేవి. 1565 రాక్షసి తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల వశమయింది ఈ ప్రాంతం. వారి ఆధీనంలో ఈ ప్రాంతం ముక్కచెక్కలయి వివిధ ప్రభువుల బందిఖానాలో చిక్కిపోయింది. 1677-78 ప్రాంతంలో ఇది శివాజీకి ఏలుబడి కిందికి వచ్చింది. ఆ తర్వాత నైజాం ముష్కరుల చేజిక్కింది. తిరిగి మైసూరు రాజ్యాధిపత్యంలో నలిగిపోయింది. 1792 ఒప్పందంతో తిరిగి నైజాం ప్రభువుల చేజిక్కింది. 1800 ప్రాంతంలో బ్రిటీషు వారితో ఓడిన నైజాం నవాబు దత్త మండలాలను తూర్పు ఇండియా కంపెనీకి అప్పజెప్పినాడు. అప్పటినుండి ఈ ప్రాంతాన్ని సీడడె డిస్ట్రిక్ట్స్ అని, దత్తమండలాలని పిలుస్తూ వచ్చినారు. దత్త మండలాలనే పేరుతో బానిస వాసనలు కొడుతుండటంవల్ల ఈ ప్రాంతం పేరును నంద్యాలలో జరిగిన మొట్టమొదటి దత్త మండలాల సభలో ‘రాయలసీమ’గా మార్చటం జరిగింది.
రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. విజయనగర రాజుల కాలంలో ఈ జిల్లా ప్రకాశవంతంగా ఉండేది. వీరి కాలంలోనే బుక్కరాయల సూచనపై సింగయ్య భట్ అనే నిపుణుడు బుక్కరాయ సముద్రమనే చెరువును నిర్మించినాడు. నీటిపారుదల సౌకర్యాలపట్ల ఆనాటి ప్రభువులు శ్రద్ధ తీసుకున్నారు. ఈ ప్రాంతంలో కొండలు, వాగులు, చిన్న చిన్న నదులు ప్రవహించే చోట అనుకూలతను బట్టి వీటిని నిల్వ చేయటానికి ఎన్నో జలాశయాలను నిర్మించారు. ఇప్పటికే వారి పరిపాలనా వైదుష్యానికి నిదర్శనాలుగా పెనుగొండలోని పసరిక బావి, పెద్దబావి, కోటనానుకొనివున్న జలాశయం ఉన్నాయి. బుక్కరాయల ఆస్థానంలో మంత్రిగా పనిచేసి చిక్కనడేయ అనంతపురం చెరువును నిర్మించినాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ జిల్లా గొల్కొండ నవాబుల వశమయింది. తరువాత మహారాష్ట్రులు, మొగలులు, కర్ణాటక నవాబులు పాలించినారు. 1800లో తూర్పు ఇండియా పాలన కిందికి వచ్చింది. జిల్లాలో వర్షపాతం అతి తక్కువ. రాజస్థాన్‌లోని ఒక జిల్లా తరువాతి స్థానం అనంతపురం జిల్లాదే.
అనంతపురం జిల్లా చరిత్ర కరువుల చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. జిల్లా కరువు చరిత్ర ఈ ప్రాంత ప్రజల కన్నీటిగాథ. 1803-85ల మధ్య కరువు తీవ్రత గురించి రికార్డులు ఈ వివరాలు అందిస్తున్నాయి. ‘‘1803లో కరువులో కొరత ప్రధానమయింది. 1823లో కరువును ముందుగానే పసిగట్టి కరువు పనులు చేపట్టినారు. 1823 అధ్వాన్నపు సంవత్సరం. ఏ వైపునుండీ వర్షాలు లేవు. 1838 కరువు సంవత్సరం. 1853-54 పూర్తి కరువు కాలం. 1865 తిరిగి కరువు వచ్చింది. సంవత్సరం సంవత్సరం రుతువుల జూదం మూలంగా రైతులు మూలుగులు పీల్చి పిప్పిచేయబడినాయి.
1876-78లో వచ్చిన ధాతుకరువు అత్యంత దారుణమైంది. ఈ కరువు తీవ్రత చాలా హెచ్చు. 1876 మేలో పెనుగొండ ప్రాంతంలో ప్రారంభమయిన కరువు ఆగస్టు నాటికి జిల్లాకంతా వ్యాపించి అతలాకుతలం చేసింది. తినటానికి ఏమీ దొరక్క పిచ్చిమొక్కల్ని, చెట్టు బెరడులను, దేవదారు ఆకులను, చింతపిక్కలను తినవలసి వచ్చింది. ఎటుచూసినా మోడువారిన బతుకులు. బతుకే భారంగా తయారయిన హృదయవిదారక దారుణ దయనీయ మయిన రోజులవి. నాలుగవ వంతు పశువులు జిల్లాలో చనిపోయినాయి. గుంతకల్లు నుండి ఉరవకొండ, రాయదుర్గం, కూడేరు, యాదికి నుండి భోగ సముద్రం వరకు కరువు పనుల పేరిట రోడ్లు వేసే పనులు మొదలయినాయి. ఆనాటి శానిటరీ కమీషనరు ప్రకారం ఆ పనులకు వచ్చే వారందరూ చనిపోవటానికి మాత్రమే ఆ పంచన చేరుతున్నారు. 1878లో గుత్తిలో తీసిన శాంపిల్ జనాభా లెక్కల ప్రకారం 16 శాతం జనాభా తగ్గింది.
ధాతు కరువు నుండి తేరుకోకముందే 1891-92 కరువు జిల్లాను కుదిపివేసింది. ఇట్లా వస్తున్న కరువు విశ్వంగారి చేత ఇలా అనిపించింది.
‘‘రాయలసీమలో కరువు పిలిస్తే పలుకుతుంది
అనంతపురం జిల్లాలో పిలవకపోయినా పలుకుతుంది’’

-సశేషం

--్భమన్