వినమరుగైన

పెనే్నటి పాట -విద్వాన్ విశ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచట నొకనాడు పండె
ముత్యాల చాలు
అట నొకప్పుడు నిండె
కావ్యాలచాలు
అచట నాకప్పు కురిసె
భాష్యాల జల్లు’’
నిజమే! ఇదంతా జరిగిపోయిన కథ. రతనాల సీమ రాళ్లసీమగా, క్షామసీగా మారిపోయింది.
రుూ కాల్వనే
పదిలంబుం బొనరింపవత్తు
రిధి కుప్పల్ గొట్టు కాలమ్ముదాక
దినమ్మున్ బ్రతి రైతు సేయవలె
సర్కారూరకే పన్ను వేయుదురంతే.
ఈ పన్నులే రైతుల బతుకుల్ని తారుమారు చేసినాయి. ఈ పన్నుల విధానమే గ్రామీణ రైతాంగం మూలుగుల్ని పీల్చినాయి.
పూర్వం రాజభాగమనే దాన్ని ఆ ఏడు పండిన పంటలో కొంత భాగాన్ని పన్ను లేదా కప్పం రూపంలో సమిష్టి సంఘం లేదా గ్రామ పంచాయతీ ప్రభువుకు చెల్లించేది. ఈ పద్ధతిని తూర్పు ఇండియా పాలన మార్చివేసింది. ఆనాటి సీమ జిల్లాలో కలెక్టరుగా పనిచేసిన థామస్ మన్రో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినాడు. నేరుగా రైతులతో పన్నుల నిర్ణయం చేసుకోవాలని, అప్పుడప్పుడు రేట్లు మార్చటానికి వీలుండాలని, ఇలా అయితే రైతు నుండి రాబట్టినదంతా మధ్య దళారీలకు పోకుండా అంతా ప్రభుత్వమే కాజేయవచ్చు ననుకున్నారు. భూమిని బట్టి పన్ను రేటును విధించినారు. ఆ ఏడు పంట పండిందా లేదా పంట బాగుందా, పాడయిందా అనేది లేదు. అసలు భూమిని సాగుచేసినారా లేదా అనేది లేదు. పన్ను వేయటమే. ఇంగ్లీషువారి భూస్వామ్య పద్ధతి ప్రవేశించింది. భూమి అమ్మకం, మొదలయిన వాటిల్లో ఆంగ్లేయ ధనిక వర్గ చట్టాలు ప్రవేశించినాయి. ఇదిగో ఈ పద్ధతివల్ల మంచి సేద్యంతో రాజసంగా బతికిన నారపరెడ్డి ‘నాలుగు కాంట్లే సాగుబడి సేయు పట్టాదారు’ నారప్పయినాడు. ఊరి మోతుబరి ‘ఉష్టరియయ్యెను’ ఎట్లా
‘‘సర్కారు సిబ్బంది సరిజేయుటకు కొంత
సాలు జమా బంది పాలు కొంత
పొరుగూరి మన్నీల సరఫరా కింద
అలేకార్ల లంచాల్లోకి కొంత
పేట పెద్ద వకీలు పిళ్లెకు కొంత
కాంపౌండరు మునుసామి పాలు కొంత
కాడిరెడ్లకు కొంత, గుర్రాలకై కొంత
బగ్గీలకై కొంత, భటులకింత
పెద్ద మహడీలు కట్టిన పేర కొంత
పూట పడి అచ్చవలసిన పాలు కొంత
తన వివాహాలు నాల్గింటికిని మరింత
కొంత కొంత యె ఖర్చు కొండంతయ్యె’’
పెళ్లిళ్లకు, పేరంటాలకు విపరీతంగా ఖర్చుపెట్టినా అది మాత్రమే రైతు అప్పుకు మూలమని చెప్పలేమని, 1857 నాటి దక్కన్ రైతు విచారణ కమిటీ చెబుతున్నది. నారపరెడ్డి బతుకు చితికిపోవడానికి పెగ్గలు పోయినందుకు కాదు.
‘‘నించుక ధరలు బడెనే, వరపు
సూపెను, వానలు బిగ్గబట్టె..
రుణ మింతకునంతకు మిద్దెలెక్కే’’
ఆయకాలు మొదలయినాయి. దస్త్రాలు సన్నగిల్లినాయి. వేరుసెనగ వెల నాలుగణాలకు తగ్గింది. ఒక్క రూకకే ఇరవై సేర్ల కొర్రలు, జొన్నలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇందువల్ల నారపరెడ్డి ‘దివాలరెడ్డి’ అయినాడు. నిబద్ధి మనిషి నారపర్డె. అప్పులవాళ్ళు మురిసిపోవటంతో దారిమోటలో వూరి కొట్టానికి చేరినాడు.
ఈ నారపరెడ్డి కొడుకే రంగడు. రంగనికి తోడు తోడు గంగమ్మ. గంతకు తగిన బొంత. ఇద్దరిలోను ఎంతో ఒద్దిక, మార్దవం, సామరస్యం ఉన్నాయి. ఆ ఇద్దరికీ వారిద్దరే.
చూపలేగాని/ మాటల జోలి బోక
వలపులేనగాని/ వాంఛల వంక బోక
పని త్వరతేగాని/ సరసల పాలుగాక
పరస్పర ప్రేమ, పరోపకారబుద్ధి, కవుడులేని నడతతో బతుకులీడ్చుకుంటూ వస్తున్నారు.
ఇన్నియిడుములు
నీ కోసమే భరించుచుంటినని
అతడనడు/ నీ సుఖము కొఱకె
బ్రతుకు చుంటినటంచు
ఆమె పలుకదెపుడు
మాటలేటికి
మనసులో మరులుపొరల?

-సశేషం

-్భమన్