వినమరుగైన

పెనే్నటి పాట -విద్వాన్ విశ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత అన్యోన్యమయిన దాంపత్యం వారిది. పైకి మాటల్లేవు. అన్నీ చేతల్లోనే. నిజానికి ఈ వాక్యాలు ఎంకి-నాయుడుబావల ప్రేమను గుర్తుకుతెస్తాయి.
రంగడు అడవికిపోయి గడ్డో, గాదమో కట్టెలో తెస్తాడు. గంగమ్మ వడ్లో, అటుకులో దంచి నూకలో, తవుడో తెస్తుంది. విసుక్కోవటానికి కూడ
తీరికలేని కాయకష్టం వారిది
రంగడికి అడవిపనికదా..
వేయేండ్ల కొక్క వానకదా..
అక్కడ మాత్రమెట్ల గఱికైన పుట్టు?
ఎపుడో, ఎక్కడో కొంచెం సేపు నానుపు వాన కురిసిందా, ఇక ఆ పల్లెలో పనిచేసుకోవటానికి సంతోషించటానికి సమయమేదీ! కలివిపండ్లు, బలస కాయలు, రేణికాయలు, సీమచింతకాయలు ఏరుకొచ్చుకుని అమ్ముకోవద్దూ, ఆ అడవిలో
నచ్చటి రకాలు ఆకులే చాలు
కొందఱి ఆకలణచు
నిజంగానే 1953 నాటి కరువులో కదరితాలూకా జనం దేదరాకు తిని ప్రాణం నిలబెట్టుకున్నారు.
ఇంకో కటిక వాస్తవం-
‘‘పొలము పని లేని రోజులప్పుడు తిరిగి పడిపోతుంది. తోటివారు ఇంటికి చేర్చి తమ పాటికి తాము తిరిగిపోతారు. అంత తప్పిస్తే ఇంకేమీ సాయం చేయలేని నిస్సహాయ బతుకులు వారివి. ఆ పిల్ల పడే కష్టాలను చూసి చేసేదేమీ లేక రంగడు-
‘‘సమాధి గతుండగు యోగిబోలె
స్తబ్దుడై యుండు’’
‘‘నిన్నయే రేపు వీరికి
నేటివలె రేపు వచ్చును
గుండెల నూపి వదులు’’
గుండెల్ని పిండే ఘటనలు సీమ బతుకుల్లో నిత్యం దొర్లిపోతున్నాయి. ఎవరి పాలనలోనూ న్యాయం లేదు.
గుండెలు కోసి యివ్వగల కూరిమి
కొండలు మోయు తాల్మి
కట్టెండకు నిల్చి
బండలు పెఠిల్లున బ్రద్దలుకొట్టి
బంగరునేచెండుల
పైకి దీయగల చేవ
గలిగిన రాయలసీమ వాసుల బతుకుల్ని తల్చుకుంటూ
తనెట్లా/బ్రదకవలె మఱి!
కూలక ప్రాలమాలి
కాదు. పని యేదీ
ఏడాది కంత కొక్క
మూడు నెలలే పనుల్
ప్రజాసామాన్యానికంతటికీ ముఖ్యవృత్తి వ్యవసాయం కావటం మన దురదృష్టం. భారతదేశ ప్రజల దరిద్రానికి, కరువు కాటకాదులకు, వారు ఎదుర్కొంటున్న దారుణ ప్రమాదాలకు మూలకారణం వ్యవసాయాన్ని నమ్ముకుని ఉండటమే. వివిధ వృత్తులను ఏర్పరచి, పరిశ్రమలను విరివిగా ఏర్పరచి వ్యవసాయంలో ఎక్కువగా వున్నవారిని వాటివైపు మళ్లిస్తేనే ఈ స్థితి నుండి బయటపడగలమని 1800 నాటి ఫామిన్ కమీషన్ రిపోర్టు తెలియజేస్తున్నది.
రంగడి బతుకు ఇట్లా కునారిల్లిపోతూ వుంటే మరోవైపు వాని యజమాని బతుకో
ఇచట లక్ష్మీ- సరస్వతులూ వసింతురు
ఇచట లేనిది మానవ హృదయమొకటె!
గంగమ్మ గర్భం దాలుస్తుంది. అంబటి వారింటికి పనికెక్కకపోతే ఆ పూట అంబలుండదు. మామ ఒక్కడి కూలితో పూట గడవదు. పేదల బతుకుల్లో గర్భం ఏమంత విశేషం! ఆ రోజుల్లోనూ పనితప్పదు. ఒక రోజు గంగమ్మ
‘బాయి’ పనికిపోయి కళ్లు
చచ్చె నీ లోకమున నాత్మ సాక్షియనుచు
నెత్తినోరిది కొట్టుకోనిండు నన్ను’’
అంటూ నిస్సహాయమయిన, నిర్వేదనను అనుభవజ్ఞులు, మహాపండితులు విశ్వంగారు వెలిబుస్తున్నారంటే రాయలసీమలో ఎంత దయనీయమయిన, హృదయ విదారకమయిన కన్నీటిగాథలు దొర్లి వుండి వుండవలె?
ఈ ప్రాంతపు ప్రాచీన వైభవం, దయనీయ నేటి బతుకుల్ని ఒక దృశ్యకావ్యంగా
‘‘కోటి గొంతుల కినె్నర మీటికానుచు
కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు’’
పాడిన పాటే ఈ పెనే్నటిపాట.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-అయిపోయంది

-భూమన్