వినమరుగైన

కర్పూర వసంతరాయలు -సి.నారాయణరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ లకుమా/ నీ వూదిన ఊపిరి యే
ఈ వసంత రాజీయము’’
మట్టిని ఒక అనర్ఘ/ మణిగా మలచితి వీవే
రాతిని సాలగ్రామము/ గా తీరిచినా వీవే’’
అని రాజు అంటే
‘‘ప్రభూ పాద దాసి నిటుల
ప్రశంసించ దగునా?/ కాలిధూళి ఏనాటికి
గంధపు పొడి యగునా?’’
అని లకుమ బదులు చెప్పిన తీరు ఎంతో సప్రశ్రయంగా కనిపిస్తుంది.
కర్పూర వసంతరాయలు ప్రధానంగా శృంగార రస ప్రబంధంగా సాగినా, కరుణ రసం, వీర రసం దానికి తోడుగా నిలిచాయి. ముగింపులో త్యాగానికి, దేశభక్తికి పెద్దపీట వేయడంవల్ల, కావ్య వస్తువు మరింత ఔచిత్యాన్ని సంతరించుకుని, విశ్వజనీనమైన సందేశాన్ని ప్రబోధించింది. ‘్భగం కాదు, గొప్పతనం త్యాగంలో వుంది’ అని నిరూపించిన లకుమను దేశభక్తికి నిలువెత్తు దర్పణంగా నిలిపింది.
తనకోసం కాక దేశ సంక్షేమం కోసం లకుమను త్యాగం చేయమని మహారాణి అభ్యర్థించే సన్నివేశం పాఠకుల హృదయాల్ని పిండివేస్తుంది.
‘దేశ మొక దెస, నీవు ఒక దెస
తేల్చుకొను మెయ్యది ఘనమ్మో
వ్యక్తి - సంఘములందు యెయ్యది
ప్రథమ గణ్యములందు యెయ్యది
ప్రథమ గణ్యము చెప్పవమ్మా’’
అంటూ మహారాణి వేసిన ప్రశ్న దేశభక్తిని ప్రేరేపిస్తుంది. తూర్పున బాలభానుని తొలి కిరణ ప్రసరణంతో లకుమలోని యిరుల దొంతర కూడా తొలగిపోతుంది. ఆమెలో ఒక వజ్ర సంకల్పము వేళ్ళూనుతుంది. శిబి, దధీచులను మించిన త్యాగం చేస్తూ లకుమ తన ప్రాణాలను అర్పిస్తుంది. ఆ బలిదానంలో వసంతరాయునికి కర్తవ్యం స్ఫురిస్తుంది.
‘‘ఓ లకుమ ఎటు నుంటివో నీవు? ఇంకెచట
పరమ సాధ్వీ జగత్ స్వర్ణాసనము పైన’
ఓ సఖీ ఏమందువో నీవు? ఇంకేమి?
వ్యష్టికన్నను దేశ దృష్టియె గరిష్ఠమని’’-
అంటూ రాజు కర్తవ్యపథంలో అడుగుపెడతాడు.
‘‘కొమరగిరి చరితమ్ము కొండవీటను శిశిర
మును సైతము వసంతముగ రూపుగట్టించు’’
కొండవీటను పాదుకొన్నట్టి మట్టిలో
సైతమ్ము కర్పూర సౌరభమ్ములు వీచు’’
అంటూ కవి తన కావ్యాన్ని ముగిస్తారు. ఈ చివరి వాక్యాలను చదవగానే కొందరి మనస్సులో కినె్నరసాని పాటల ముందుమాట కల్పనలో శ్రీ విశ్వనాథవారు అన్న-
‘‘అచట కినె్నరసాని
నాయాత్మయందు
ఇప్పటికి దాని సంగీతమే నినదించు’’
అనే పంక్తులు అప్రయత్నంగానే ముఖరితవౌతాయి. ఇది యాదృచ్ఛికమైనా కావచ్చు, లేదా కవి స్నిగ్ధ హృదయంపై కినె్నరసాని పాటలు వేసిన అజ్ఞాతముద్ర అయినా కావచ్చు.
కావ్యం చదవటం పూర్తిచేసిన తర్వాత సామాన్య పాఠకుని మనస్సులో ఒకటి, రెండు సందేహాలు తలెత్తుతాయి!
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-సశేషం

-కె.వి.ఎస్.ఆచార్య