వినమరుగైన

అగ్నిధార -దాశరథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్వాతంత్య్రోద్యమంలో తెలంగాణ ఉద్యమం సముజ్వలమైన అమరగాథ. దేశం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలోనే ఆ ఉద్యమ స్వర్ణోత్సవాలు జరుపుకోవటం చారిత్రాత్మక సంఘటన. ఆ ఉద్యమానికి మూడు పార్శ్వాలున్నది ప్రప్రథమంగా వక్కాణించదగినది. బ్రిటీష్ వలస పాలనకు చరమగీతం పాడిన ప్రజోద్యమాల వరుసలో జాతీయ విముక్తి పోరాటంగా ప్రత్యేకించి స్వదేశీ సంస్థానాలలో సాగిన ప్రజా పోరాటంగా దానికున్న ప్రాధాన్యం అనితరమైనది. వ్యవసాయాధార భారత సమాజంలో కీలకమైన భూసమస్యను ప్రముఖంగా జాతీయ ఎజెండాలోకి ఎక్కించిన వీరోచిత పోరాటం; అది రెండో పార్శ్వం. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఒక్కటైన తెలుగు ప్రజలు పరాయి దాస్యంలో ముక్కచెక్కలైన పరిస్థితికి అంతం పలికి భాషా ప్రయుక్త ప్రాతిపదికపై స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు భూమిక సిద్ధింపజేసిన ప్రజాతంత్ర పోరాటమన్నది మరో ముఖ్యమైన మూడవ పార్శ్వం. ఈ విధంగా సమైక్య ఆంధ్ర సాధనకు భావోద్వేగ భరితమైన త్రివేణీ సంగమంగా విశాల ప్రజాప్రాతిపదికపై జరిగిన మహత్తర తెలంగాణ పోరాటం ఆ మూడు ఉద్యమాలు మిగిల్చి వెళ్లిన కర్తవ్యాల పరిపూర్తికి అవసరమైన స్ఫూర్తి సదా కలిగిస్తుంది. ఆ ఉద్యమానికి కవులు తమ తమ పద్ధతులలో ఉత్తేజంతో మద్దతు అందించారు. అది వాస్తవానికి స్వస్థాన వేషభాషా సంస్కృతుల పరిరక్షణకు జరిగిన పోరాటం.
తెలంగాణ ఉద్యమ కావ్యాల్లోకెల్లా అగ్రగణ్యమైనది దాశరధి అగ్నిధార. తెలంగాణ కాకతీయుల కదన పాండితికి నెలవే కాదు- ఒకప్పుడు మనుజేశ్వరాధముల నదఃకరించిన పోతన కవి పురిటిగడ్డ. ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్న దాశరధి ఆ అధముల్లోకెల్లా అధమాధముడైన నిజాం నవాబు పదఘట్టనలో నలిగి నవిసి యమయాతనలకు గురైనది తెలంగాణా. జన్మజన్మాల బూజుగా కృద్ధకవులచే శప్తుడైన నిజాం, ఆయన తొత్తులైన దేశముఖుల చేతిలో అలవికాని అష్టకష్టాల పాలయింది. దున్నుకోటానికి బారెడు భూమి లేక మాతృభాషలో చదువుకునే వీలు లేక కనీస జీవన ప్రమాణాలకు నోచుకోని తెలుగు ప్రజల చింతల కాపురంగా సొక్కిపోయింది. ఆ దారుణంపట్ల ఆగ్రహోదగ్రులైన తెలుగు ప్రజలు ప్రళయరుద్రులై, వీరభద్రులై ఒక్కుమ్మడిగా విజృంభించారు. కవులు ఆ పోరాటాన్ని పరిపరి విధాల కీర్తించారు. నిజాం ముష్కరపాలనపై నిప్పులు వర్షించారు. అగ్నిధార స్రవించాయి. రుద్రవీణలు గర్జించాయి. వీర తెలంగాణ స్ఫూర్తితో మహాంధ్రోద్యమాన్ని ఆకాంక్షిస్తూ ప్రఖ్యాతులూ, అజ్ఞాతులూ అయిన కవులెందరో పాటలని తూటాలుగా, ఈటెలుగా, బరిసెలుగా, వడిసెలుగా, బల్లాలుగా, వజ్రాయుధాల్లా నిలిచి నిజాం రాక్షస రాజ్యంపై పరిక్రమించారు. ఆ పోరాట కాలంలో ఉత్తమ సాహిత్యం, ఉన్నతమైన అభిరుచులతో వివిధ కళారూపాలు సమరశీల ప్రజల విప్లవ కథన కాహళులుగా రూపుదిద్దుకున్నాయి. భూసమస్యపై, సాంస్కృతిక పరిరక్షణ సమస్యపై జరిగినటువంటి ఆ పోరాటం కవులను ఉత్తేజపరిచింది. అందులో దాశరథి ప్రేక్షకుడిగా కాకుండా స్వయంగా పాల్గొన్నారు.
వాస్తవానికి అగ్నిధార తెలంగాణ ప్రజల పీడిత మనోభావాలకు ప్రతీక. దాశరధి చెప్పినట్టు అది నిజాం నవాబు పాలనను తుదముట్టించడమే కాకుండా తెలంగాణలో వున్నటువంటి భూస్వామ్య, బానిస వ్యవస్థను రద్దుచేసి తెలుగువారందరూ ఒక్కటి కావటానికి తోడ్పడింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి మూడుకోట్ల నొక్కటే ముడి బిగించి మహాంధ్రోదయాన్ని ఆకాంక్షిస్తారు అని అగ్నిధారలో ఆసాంతం కనబడుతుంది. వాస్తవానికి అగ్నిధార ఆయన కారాగారవాస క్లేశాలు, అజ్ఞాతవాస అవస్థల నుండి జ్వలించినటువంటి కావ్యమిది. అగ్నిధార తొలి ప్రచురణకు పీఠిక రాస్తూ దేవులపల్లి రామానుజరావుగారు చెప్పినట్టు ఆ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి దాశరధి అక్కడి ప్రజలు మట్టినుండి మాణిక్యాలై, ప్రజల మనుషులై సృష్టించిన చరిత్రకు భాష్యకారుడగా నిలిచాడన్నారు. దాశరధి చెప్పినట్టు పీడిత ప్రజావాణికి మైకు అమర్చినటువంటి ఉత్తమ కావ్యం అగ్నిధార. అలాగే రైతుకు తన భూమి మీద హక్కును గురించి తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని అగ్నిధారలో గర్జించాడు. అంతేకాకుండా అనేక విధాలుగా ఆ ఉద్యమంలో తమతోపాటు తాదాత్మ్యం పొందినటువంటి వీరకేసరులను స్మరిస్తూ అగ్నిధారను తన సహజైలువాసి వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితమిచ్చాడు. దాశరధి పోరాట ప్రజల ఆస్థాన కవిగా వున్నపుడు రాసిన మూడు కావ్యాలలో కూడా తెలంగాణ పోరాట ప్రజాశ్రేణుల యొక్క మనోభావాలను ప్రతిధ్వనిస్తాయి. అగ్నిధార మొదటిది. రుద్రవీణ రెండవది. దాని పర్యవసానంగా వచ్చిన మహాంధ్రోదయం మూడవది. దాశరధి యొక్క ఇంకొక వైశిష్ట్యం ఏమిటంటే అగ్నిధార ప్రజల మనిషి. నవల రాసినటువంటి తన నిజామాబాద్ జైలు సహవాసి వట్టికోట ఆళ్వార్ స్వామికి అంకితమిస్తే రుద్రవీణను తెలంగాణకు అంకితమిచ్చాడు.

-సశేషం

--సి.రాఘవాచారి