వినమరుగైన

అమృతం కురిసిన రాత్రి -బాలగంగాధర తిలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేనిదివరకటి నేను కాను/ నాకు విలువల్లేవు, నాకు అనుభూతుల్లేవు/ చంపడం, చావడం, మీసం దువ్వడం/ లాంటివి అలవాటయ్యాయి’’
‘‘కనిపించే యూనిఫారం కింద/ ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత/ బ్రిడ్జి క్రింద నదిలాగా రహస్యంగా ఉంది/ వదల్లేని మోసపు ఊబిలాగా ఉంది’’
ఇవి నేటికీ వర్తించే శాశ్వత సత్యాలు. ప్రపంచ యుద్ధం నుండి కోలుకునేంతవరకు ఈ సత్యాలు నిలిచే తీరుతాయి.
‘‘్ధత్రి జనని గుండెమీది/ యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు/ మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా?’’ అన్న తిలక్ ప్రశ్నకు సరైన సమాధానం నేటికీ మృగ్యమే.
ఆధునిక మానవ సమాజంలో వ్యక్తులమధ్య పెరిగిపోతున్న అంతరాల్ని తగ్గించడం సాధ్యం కావడంలేదు. పెరిగిపోతున్న పేదరికం ఒక భయంకరమైన సామాజిక వక్రత. సమ సమాజాన్ని సాధించుకోలేని మానవుని నిస్సహాయతకు, అశక్తతకు ఇది నిదర్శనం. అందుకే ఆధునిక కవుల కలాలనుండి ఇది ప్రధాన విషయంగా ప్రవహించింది.
తిలక్ అత్యంత నిశిత దృష్టితో ఈ సమస్యను పరిశీలించినవాడు. ఆయన అమృతం కురిసిన రాత్రిలోని అర్తగీతం ఒక్కటి చాలు ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి.
‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను/ నీ ఆదేశాన్ని మన్నించలేను’’ అంటూ ప్రారంభంలోనే తన మనస్సులోని నిరాశను అక్షరబద్ధం చేశాడు.
దేశం ఎంత గొప్పదైనా, దేశంలోని బాధామయ జీవుల గాధలు కవి హృదయాన్ని కలచివేశాయి. అందుకే తనలోని చేతనా రాహిత్యాన్ని ఇలా చెప్పాడు.
‘‘చిత్ర శిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను/ తత్త్వ సూత్ర వాదోక్తి చలింపను/ సుందర వధూ కదుష్ణ పరిరంభముల రసింపను’’ అంటూ అసలు తన నైరాశ్యానికి కారణాన్ని తానే అనే్వషించుకున్నాడు.
ఈ రోజు నేను చూసిదేమి
విధి యిన్ని కత్తులను దూసినదేమి?’’ అంటూనే
‘‘నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి
మర్రి చెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి
నేను చూశాను నిజంగా నీ రంధ్రవర్షాన వంతెన క్రింద
నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిల్లిన దృశ్యాన్ని
నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక
ఏడుస్తూ, ఏడుస్తూ, ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ
మురికి కాల్వ ప్రక్కన నిద్రించే మూడేళ్ల పసిబాలుణ్ణి..
నేను చూశాను నిజంగా క్షయగ్రస్త భార్య యిక బ్రతకదని
డాక్టర్ చెప్పినప్పుడు ప్రచండ వాతూల హత నీపశాఖవలె
గజగజ వణికిపోయిన ఆర్తక అశక్త గుమాస్తాని..’’
అని చెబుతూ బాధాసర్పదష్టుల దయనీయ స్థితిగతుల దృశ్యమాలికల్ని ఈ కవితలో రూపు కట్టించాడు తిలక్.
ఆధునిక వచన కవిత్వంలో ఇదొక గొప్ప ఖండిక. సాంస్కృతికపరమైన వైభవం కానీ, శాస్ర్తియ ప్రగతి కానీ, మహాప్రవక్తల బోధలు కానీ, రాజ్యవ్యవస్థ కానీ ఇవేవీ కూడా ఈ విషయంలో సరైన సమాధానాన్ని అందివ్వలేకపోయాయి.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జి.గిరిజా మనోహర్‌బాబు