వినమరుగైన

అమృతం కురిసిన రాత్రి -బాలగంగాధర తిలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే
‘‘ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?
ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?
ఏ బుద్ధదేవుని జన్మభూమికి గర్వస్మృతి’’
‘‘ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనింపగలదు?
ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు?
ఏ భోగవంతుని విచలింప జేయగలదు?
ఏ భగవంతునికి నివేదించుకొనగలదు?’’
అన్నాడు. నిజంగా ఈనాడు ఇంతగా ఎదిగిన మానవ విజ్ఞానం కానీ, మరొకటి కానీ దీనికి ఏ సమాధానమూ చెప్పలేని నిస్సహాయతలోనే ఉన్నాయనడం నిర్వివాదాంశం.
మధ్యతరగతి జీవితాలను విస్తృతంగా వర్ణించిన కవుల్లో తిలక్‌ను అగ్రగణ్యుడనవచ్చు. ప్రతి చిన్న విషయం కూడా మధ్యతరగతి వాళ్లకు మహాసమస్యగా కనిపిస్తుంది. దానికి కారణాలనేకం. మధ్యతరగతి జీవులపై తిలక్‌కు ఆర్ద్రతా పూర్వకమైన సానుభూతి ఉంది.
‘‘అక్కయ్యకు రెండో కానుపు
తమ్ముడికి మోకాలివాపు
చింతపండు ధర హెచ్చింది
చిన్నాన్నకు మతిభ్రమించింది
లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు
గోరుచుట్టలా సలిపే లక్షల సమస్యలు...’’
ఇట్లా చెబుతూపోతే మధ్యతరగతి వాళ్ల సమస్యలు లక్షలకు లక్షలు- వాళ్ల మనస్తత్వమే విచిత్రం. మూఢ మనస్తత్వాన్ని వదులుకోరు, భావ బానిసత్వాన్ని ఆశ్రయిస్తారు. ధన దౌర్జన్యానికి దాసోహం అంటారు. మానసికంగా, శారీరకంగా క్రుంగిపోయినా దేన్నీ ఎదిరించలేరు. ఇట్లాంటి వాళ్లపై కోపం చూపించకుండా సానుభూతి చూపిస్తూ తిలక్ నీడలు కవితలో లక్ష్మీదేవిని సంభోధిస్తూ-
‘‘చిన్నమ్మా! వీళ్ల మీద కోపగించకు, వీళ్లనసహ్యించుకోకు/ వీళ్లందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం, సంఘ్భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు..
వీళ్లందరూ తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్పోలే తిరుగుతారు
వ్ఢ్యౌంవల్ల బలాఢ్యులు
అవివేకంవల్ల అవినాశులు
మధ్యతరగతి మనుష్యులు..’’
వీళ్ల విషయంలో తిలక్ చూపించిన కారుణ్య భావనకు అమృతం కురిసిన రాత్రిలోని ఆయన కవితలే నిలువెత్తు సాక్ష్యాలు. సమాజ భవిష్యత్తు ఆశాజనకంగానే భావించాడు. తిలక్ ‘దారంతా గోతులమయం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం’’ అనడంలో వెలుగుల ప్రస్థానం చెయ్యడానికి, ధైర్యాన్ని పొందాలనీ ఆశావహ దృక్పథం కావాలనీ చక్కగా చెప్పాడు.
తిలక్ అమృతం కురిసిన రాత్రి ఆయన మరణానంతరం గ్రంథంగా వచ్చింది. గ్రంథ రూపంలో రాకపూర్వమే తిలక్ కవితలకు విస్తృత ప్రచారం లభించడానికి, కవిత్వంలోని ఆయన ప్రతిభే ప్రధాన కారణం. కవిత్వం మనిషి ఔన్నత్యాన్ని మరింత పెంచే దిశగా నడిపించాలన్నది తిలక్ ఆశయం. ఆయన కథలు రాసినా, పద్యకవిత్వం రాసినా, నాటికలు, నాటకాలు రాసినా ఈ ఆలోచనా దృక్పథంతోనే రాశాడు.
‘‘చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితం
మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం..’’
అని చెప్పడంలో మానవత్వం పట్ల ఆయనకున్న నిష్ఠ, నిబద్ధత అవగతవౌతుంది.
ఆకలి బాధలూ, ఆందోళనలూ, సమస్యలు విరివిగా వున్న విచిత్ర సౌధంలో నివశిస్తున్న నేటి మానవుణ్ణి కవిత్వ వస్తువుగా కలిగి ఉన్న కావ్యం అమృతం కురిసిన రాత్రి.
‘‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెనె్నలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు..’’ అని తిలక్ చెప్పుకున్నట్లు, కవిత్వంలో అత్యంత కారుణ్య భావపూరితాలూ, ప్రజాశక్తిని పరిదీప్తం చేసే చైతన్య శిఖలూ, రసార్ద్ర భావనోద్దీప్తి కలిగిన సుందర సుమధుర రసగుళికల సమాహారమే తెలుగు కవిత్వ ప్రియులకు బాలగంగాధర్ తిలక్ అందించిన అమృతం కురిసిన రాత్రి.
*
-అయిపోయంది
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జి.గిరిజా మనోహర్‌బాబు